For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోవాన్ చికెన్ కర్రీ : టేస్టీ అండ్ స్పైసీ రిసిపి

|

గోవాన్ చికెన్ కర్రీ చూడటానికి ట్రెడిషినల్ చికెన్ కర్రీలాగేనే అనిపిస్తుంది. ఈ గోవాన్ చికెన్ కర్రీ గోవాలో బీచ్ లేదా తీర ప్రాతంలో చాలా ఫేమస్ అయిన రిసిపి ఇది.

గోవాన్ చికెన్ కర్రీకి మసాలాలు మరియు హెర్బ్స్ జోడించి తయారుచేయడం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది. ఈ గోవాన్ రిసిపి మీల్స్ కు చాలా టేస్ట్ గా ఉంటుంది.

ఈ గ్రీన్ చికెన్ కర్రీ తయారుచేయడం చాలా సులభం. ఇది పులావ్, కోకనట్ రైస్, పీస్ పులావ్ కు మంచి కాంబినేషన్ మరి ఈ యమ్మీ డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Goan Green Chicken Curry Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్ - 1 kg (చిన్న ముక్కలుగా తరిగి)
వెల్లుల్లి అల్లం పేస్ట్ - 1/2 tsp
కరివేపాకు - కొద్దిగా
కొబ్బరి - 6tbsp(తురుమి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి - 2 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పుదీనా ఆకులు -1 cup(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కొత్తిమీర ఆకులు - 3 cups (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
జీలకర్ర - 1/2 tsp
మిరియాలు - 1/2tsp
పసుపు - 1/2tsp
ఉల్లిపాయలు - 2 (తురిమినది)
కొత్తిమీర - 1/2cup(పేస్ట్ కోసం)
మసాలాలు: దాల్చిన చెక్క-1, యాలకలు-5
ఆయిల్ : సరిపడా
ఉప్పు - రుచికి తగినంత
చక్కెర : 1tsp
ఎండు మిరపకాయలు - 2
నీరు - 2cups

తయారుచేయు విధానం:
1. ముందుగా కొబ్బరి తురుము, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, పంచదార, పసుపు, పెప్పర్ కార్న్, జీలకర్ర, ఉల్లిపాయ సగం, పచ్చిమిర్చి, కొద్దిగా నీళ్ళు మిక్స్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద కుక్కర్ పెట్టి, అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి.
3. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, యాలకలు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి.
4. ఇప్పుడు అందులో చికెన్ ముక్కలు వేసి మొత్తం మసాలాలో వేగించుకోవాలి.
5. చికెన్ వేగిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేసి వేగించాలి, తర్వాత నీళ్ళుపోసి బాగా మిక్స్ చేసి మూత పెట్టాలి . 10నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
6. పది నిముషాలు ఉడికిన తర్వాత మూత తీసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే గోవాన్ గ్రీన్ చికెన్ కర్రీ రిసిపి రెడీ.

English summary

Goan Green Chicken Curry Recipe

If you have been to Goa and missed binging on the traditional chicken curry prepared in Goan homes, don't worry, for we have a simple chicken curry recipe you can try out.
Story first published: Wednesday, May 27, 2015, 14:05 [IST]
Desktop Bottom Promotion