For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోంగూర రొయ్యల కర్రీ: సీ ఫుడ్ స్పెషల్ రిసిపి

|

సాధారణంగా ఇంట్లో ఎప్పుడూ చేసినవే చేసి బోరుకొడుతుంటే, కొంచెం వెరైటీగా కోరుకుంటాం. కానీ వాటిని సరైన పద్దతిలో తయారుచేయడం తెలియదు. కొత్త వంటలు చేసేటప్పుడు, కాస్త ఓపిక, ఈ వంట మీద అవగాహన, అందుకు కావల్సిన వస్తువులన్నీ ఉన్నాయలో లేదో తెలుసుకొని, అన్ని సిద్దం చేసుకొన్న తర్వాత కొత్తగా వంట తయారుచేయడానికి ప్రయత్నించాలి.

చాలా మందికి రొయ్యల ఫ్రై మాత్రమే తెలుసు, కానీ రొయ్యల గ్రేవీ, రొయ్యల బిర్యానీ, రొయ్యల పులావ్ కూడా తయారుచేసుకుంటారు. ఇవి తినడానికి రుచికరంగా మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా. ఈ సీ ఫుడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అంధిస్తాయి. ఇది మంచి ఫ్లేవర్ తో పాటు, మంచి రుచిని కూడా కలిగి ఉంటాయి. సీఫుడ్స్ ఇష్టపడే వారు ఇలా వైరటీ వంటలు తయారుచేసుకొని రుచి చూడవచ్చు.

Gongura Prawns Curry

కావల్సిన పదార్థాలు:
గోంగూర: 1cup
రొయ్యలు: 1/2cup
నెయ్యి: 4tbsp
టమోటోలు: 3
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి-ఎండుమిర్చి: 4చొప్పున
పోపుదినుసులు(అన్నీ కలిపి : కొద్దిగా
ధనియాలపొడి: 1/2tsp
పసుపు: 1/4tsp
కారం: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర తరుగు : కొద్దిగా

తయారుచేయు విధానం:
1. ముందుగా గోంగూరను తొడిమల నుండి ఆకులను వేరిచేసి శుభ్రంగా కడిగి, తర్వాత గిన్నెలో వేసి సరిపడా నీళ్ళు పోసి ఉడికించి పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నెయ్యి వేసి, వేడయ్యాక అందులో రొయ్యలు వేసి లైట్ గా వేగించి, తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఆ తర్వాత అదే పాన్ లో అదే నెయ్యిలో ఎండుమిర్చి, పోపుదినుసులు వేసి ఒక నిముషం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి.
4. అందులోనే ఉడికించి పెట్టుకున్న గోంగూర, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి.
5. కొద్దిసేపటి తర్వాత ధనియాల పొడి, వేయించిన రొయ్యల్ని వేసి, మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
6. 5-10నిముషాల తర్వాత, కొత్తిమీర తరుగు చల్లి దింపేస్తే సరిపోతుంది. నోరూరించే గోంగూర రొయ్యల కర్రీ రెడీ. ఇది అన్నంలోకి చాలా రుచికరంగా ఉంటుంది.

English summary

Gongura Prawns Curry

Prawn curry is one of the favourite dishes of any non vegetarian. This is especially true for people who just love seafood. But we tend to get bored with the same old Indian prawn recipes that we are so used to. That is why, we have the Gongura prawn curry that has a completely 'hatke' taste.
Story first published: Tuesday, October 7, 2014, 18:29 [IST]
Desktop Bottom Promotion