For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ పెప్పర్ చికెన్ కర్రీ రిసిపి: హెల్తీ అండ్ టేస్ట్

|

క్యాప్సికమ్ ఒక హెల్తీ వెజిటేబుల్. అందుకే దీన్ని రెగ్యులర్ డైట్ లో ఏదోఒక విధంగా తీసుకోవాలి . ఈ హెల్తీ గ్రీన్ వెజిటేబుల్లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మన శరీరానికి ఎక్కువ శక్తిని అందిస్తుంది.

ఈ గ్రీన్ క్యాప్సికమ్ మరియు చికెన్ కాంబినేషన్లో ఒక టేస్టీ అండ్ హెల్తీ గ్రేవీని మీకు పరిచయం చేస్తున్నాము. ఈ రిసిపి తయారుచేయడానికి కొన్ని ఇండియన్ మసాలా దినుసులతో తయారుచేస్తే రుచి మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ వంటను పులావ్ తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

స్పైసీ క్యాప్సికమ్ చికెన్ గ్రేవీ కి చివరగా పెరుగు లేదా క్రీమ్ చేర్చడం వల్ల మరింత టేస్ట్ గా నోరూరిస్తుంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Green Pepper Chicken Curry Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్ : 500grms
బెల్ పెప్పర్: 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
టమోటో: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పసుపు: 1tsp
పచ్చిమిర్చి: 2(రెండుగా కట్ చేసి పెట్టుకోవాలి)
మసాలాలు: యాలకలు, దాల్చిన చెక్క మరియు లవంగాలు(అన్ని 2 లేదా 3 తీసుకోవాలి)
పెరుగు లేదా ఫ్రెష్ క్రీమ్: 2tbsp
నీళ్ళు: 1cup
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్లో నూనె వేసి వేడిచేయాలి.
2. నూనె వేడి అయ్యాక అందులో మాలాలు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
3. మసాలాలు వేగిన తరవ్ాత అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒక నిముషం ఫ్రై చేయాలి.
4. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి బ్రౌన్ కలర్ లోకి మారే వరకూ వేగించుకోవాలి.
5. టమోటో ముక్కలు వేసి మొత్తబడే వరకూ వేగించాలి.
6. ఇప్పుడు అందులో పసుపు, వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
7. మొత్తం మిశ్రమం వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలు వేసి బాగా కలియబెడుతూ ఫ్రై చేసుకోవాలి.
8. మసాలాల్లో చికెన్ బాగా ఇమురుతూ వేగుతున్నప్పుడు అందులో సన్నగా కట్ చేసుకొన్న బెల్ పెప్పర్ వేసి బాగా కలియబెట్టాలి.
9. తర్వాత సరిపడా నీళ్ళు ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని మరోసారి కలియబెట్టి , మూత పెట్టి 10 నిముషాలు ఉడకనివ్వాలి .
10. పదినిముషాలు ఉడికిన తర్వాత చికెన్ మెత్తగా ఉడికిందని నిర్ధారించుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఫ్రెష్ క్రీమ్ లేదా చిక్కటి పెరుగుతో గార్నిష్ చేయాలి. అంతే గ్రీన్ పెప్పర్ చికెన్ కర్రీ రెడీ...

English summary

Green Pepper Chicken Curry Recipe

Capsicum is one of the important veggies you should include in your daily diet. This healthy green vegetable is rich in vitamin C which provides a whole lot of energy when consumed. Today Boldsky shares with you an easy chicken curry recipe. This delicious green pepper chicken gravy is spicy and should be paired up with a rich pulav recipe.
Story first published: Wednesday, April 22, 2015, 18:14 [IST]
Desktop Bottom Promotion