For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హరియాలీ చికెన్ కబాబ్ రిసిపి: రంజాన్ స్పెషల్

|

హరియాలి చికెన్ కబాబ్ ట్రెడిషినల్ స్టాటర్ డిష్. ఇది రంజాన్ కు చాలా ఫర్ ఫెక్ట్ రిసిపి. ఈ గ్రీన్ అండ్ స్పైసీ హరియాలి చికెన్ కబాబ్స్ పంజాబీ రెస్టారెంట్స్ మరియు డాబాల్లో ఎక్కువగా తయారు చేస్తుంటారు. మరి ఈ అద్భుతమైన కబాబ్ రిసిపిలను ఇంట్లో ఎలా తయారు చేస్తారు?

ఈ కబాబ్ రిసిపిని తయారు చేయడానికి ప్రధానంగా కాల్సింది మ్యారినేషన్ . ఈ మ్యారినేషన్ కు ఎక్కువగా పెరుగు, కొన్ని మసాలాదినుసులు, పుదీన, కొత్తిమీరను ఉపయోగిస్తారు ఈ మిశ్రమంతో తయారైన పేస్ట్ లో చికెన్ ముక్కలను మ్యారినేట్ చేస్ గ్రిల్ చేసి, బేక్ చేస్తారు . పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ తో గ్రిల్ చేసిన ఈ చికెన్ చాలా సింపుల్ గా టేస్టీగా నోరూరిస్తుంటుంది. దీన్ని ఒకసారి తింటే చాలు, మళ్లి మళ్లి తినాలనిపస్తుంది.

కావల్సిన పదార్థాలు:
చికెన్ ముక్కలు: 500gms(బోన్ లెస్ చికెన్)
తాజా కొత్తిమీర: ½cup(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పుదీనా ఆకులు: ½ కప్ (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 4
అల్లం: 1చిన్న ముక్క
పచ్చిమిరపకాయలు: 2
జీలకర్ర: 1tsp
దాల్చిన చెక్క: చిన్న ముక్క
ఏలకులు: 3
నిమ్మరసం: 2tbsp
పెరుగు: 2tbsp
నూనె: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
Skewers:గ్రిల్లింగ్ కోసం

తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ మినహాయించి, మిగిలిన పదార్థాలన్నింటిని మిక్సీలో వేసి మొత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి.
2. తర్వాత చికెన్ నీళ్ళలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
3. ముందుగా గ్రైండ్ చేసుకొన్ని మసాలాను చికెన్ కు పట్టించాలి. మ్యారినేట్ చేసిన తర్వాత ఈ చికెన్ ను 3గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
4. బ్యాంబూ పుల్లలను మీరు ఉపయోగించేటట్లైతే, వాటిని నీటిలో అరగంటపాటు నానబెట్టుకోవాలి. దానివల్ల అవి కాలిపోకుండా ఉంటాయి.
5. తర్వాత ఈ బ్యాబూ పుల్లలకు మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను 5-6 వరకూ గుచ్చి, వాటి మీద నూనెను చిలకరించి, గ్రిల్, లేద వోవెన్ లో పెట్టి పూర్తిగా మెత్తబడేవరకూ ఉడికించుకోవాలి.
6. ఓవెన్ లో తయారు చేసుకొనేటప్పుడు ఓవెన్ ను 400F లేదా 200డిగ్రీ సెల్సియస్ వరకూ పెట్టి 10నిముషాల పాటు ఉడికిచుకోవాలి.
7. ఒక్కసారి ఇలా తయారుచేసుకొన్న తర్వాత skewers ligcr చికెన్ ముక్కలను పక్కకు తీసి, సర్వింగ్ ప్లేట్ లోనికి, సర్వ్ చేయాలి. అంతే హరియాలీ చికెన్ కబాబ్స్ రెడీ...

English summary

Hariyali Chicken Kebab Recipe: Ramzan Treat

Hariyali chicken kebab recipe is a traditional grilled starter dish which is simply perfect for the auspicious month of Ramzan. You can come across these green and spicy appetizers in most of the Punjabi restaurants and dhabas. So, how about making this delicious kebab recipe at home?
Desktop Bottom Promotion