For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హరియాలి మటన్ కర్రీ :రంజాన్ స్పెషల్

|

మీ వంటలు ఒకే టేస్ట్ ఒకటే కలర్...బోర్ కొడుతోందా!అయితే కొంచెం డిఫరెంట్ కలర్ లో, డిఫరెంట్ టేస్ట్ తో తయారు చేసుకుందాం . హరియాలీ మటన్ కర్రీ, లేదా హరియాలీ గోస్ట్ గ్రీన్ కలర్ లో క్రీమీక్రీమీగా నోరూరిస్తున్న ఈ ఒక ట్రెడిషినల్ మొఘలాయ్ రిసిపి. ఈ రాయల్ మటన్ రిసిపి చాలా ఫేమస్ రిసిపి మరియు క్రీమీ డిలైట్.

హరియాలీ మటన్ కర్రీ రిసిపిని ఇండియన్ హెర్బ్స్ ఉపయోగించి తయారు చేస్తారు. ఈ క్రీమి టెక్చర్ జీడిపప్పు ద్వారానే వస్తుంది. ఫ్రెష్ క్రీమ్ మాత్రం నోరూరిస్తూ, చూస్తేనే చేత్తో టేస్ట్ చూసేయాలనిపిస్తుంది. మరియ ఈ రంజాన్ స్పెషల్ రిసిపిని ఎలా తయారు చేయాలో చూద్దాం..

Hariyali mutton curry

కావల్సిన పదార్థాలు:
మటన్: 500gms
తాజా కొత్తిమీర:1కట్ట
పచ్చిమిరపకాయలు: 3-4
ఉల్లిపాయలు: 3
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1tbsp
జీడిపప్పు: 6-7
మిరియాలు: 15
స్టార్ సొంపు: 1
దాల్చిన చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 3
జీలకర్ర పొడి: 1tsp
ధనియాల పొడి: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 3tbsp
ఫ్రెష్ క్రీమ్:1tbsp
నీళ్ళు: 1cup

తయారుచేయు విధానం:
1. ముందుగా మటన్ ముక్కలను మంచినీళ్ళతో శుభ్రం చేయాలి.
2. తర్వాత కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి, కొత్తిమీరతో పాటు, పచ్చిమిర్చి, కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత అదే మిక్సీ జార్ లో ఉల్లిపాయలను, జీడిపప్పు, చెక్క, స్టార్ యానిస్, లవంగాలు మరియు మిరియాలు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో ఉల్లిపాయ మిశ్రం పేస్ట్ వేసి, మీడియం మంట మీద 5నిముషాలు వేగించుకోవాలి.
5. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 5నిముషాలు తక్కువ మంట మీద వేగించుకోవాలి.
6. ఇప్పుడు అందులో జీలకర్రపొడి, ధనియాల పొడి వేసి మరో రెండు నిముషాల వేగించుకోవాలి.
7. తర్వాత ఇందులోనే కొత్తిమీర పేస్ట్ కూడా వేసి 5నిముషాలు వేగించిన తర్వాత, మటన్ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తూ 10నిముషాల పాటు వేగించుకోవాలి.
8. తర్వాత ఇందులో ఉప్పు మరియు నీళ్ళు చేర్చి, మూత పెట్టి అరగంట పాటు మీడియం మంట మీద బాగా ఉడికించుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.
9. ఒక్కసారిగా మటన్ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, తాజా క్రీమ్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే హరియాలీ మటన్ కర్రీ రెడీ. ఈ నోరూరించే మటన్ కర్రీని ఫ్రైడ్ రైస్ లేదా రోటీలతో వేడి వేడిగా సర్వ్ చేయండి.

English summary

Hariyali Mutton Curry Recipe

It's time to go green with your menu! Hariyali mutton curry or hariyali gosht is a traditional Mughlai recipe, which is famous for its green and creamy texture. This royal mutton recipe is a rich and creamy delight which is sure to excite your taste-buds.
Story first published: Saturday, August 3, 2013, 16:04 [IST]
Desktop Bottom Promotion