For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ కాశ్మీరి చికెన్ రిసిపి-వీకెండ్ స్పెషల్

|

చికెన్ తినడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చికెన్ ను ఏ స్టైల్లో అయినా తయారుచేయవచ్చు. చాలా మంది చికెన్ తో వివిధ వెరైటీలను తయారుచేస్తారు. చికెన్ హెల్తీ ఫుడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఇందులో ప్రోటీనులు అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది.

కాశ్మీరి చికెన్ రిసిపి పూర్తిగా హెల్తీ రిసిపి, కొన్ని మసాలాలు యాడ్ చేసి తయారుచేయడం మాత్రమే కాదు, ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ ను కూడా జోడిస్తారు. జీడిపప్పు మరియు బాదం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కాశ్మీర్ ఫుడ్ అంటే టేస్ట్ కు చాలా పాపులర్ చెందిన వంటలు. అందులో కాశ్మీరి చికెన్ రిసిపి ఒకటి. మరి ఈ స్పెషల్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం..

కావల్సిన పదార్థాలు:
చికెన్ బ్రెస్ట్(చికెన్ రొమ్ము): 1(శుభ్రంగా కడిగి, స్కిన్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పెరుగు: 1/2cup
పెద్ద ఉల్లిపాయ:1cup (పేస్ట్ చేసుకోవాలి)
జీడిపప్పు: 1/2cup(ఒక గంట సేపు నానబెట్టి, తర్వాత పేస్ట్ చేసుకోవాలి)
మీడిసైజ్ టమోటో: 2(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
తాజా అల్లం పేస్ట్: 1tsp
వెల్లుల్లి పేస్ట్: 1tsp
యాలకలు: 5
కాశ్మీరీ ఎరుపు కారం: 1tsp
బాదాం: 2tbsp (ముక్కలుగా చేసుకోవాలి)
కొత్తిమీర: కొద్దిగా(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఆయిల్: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం :
1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
2. ఇప్పుడు అందులో అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
3. మొత్తం మిశ్రమం బ్రౌన్ కలర్ మారే వరకూ ఉండి తర్వాత అందులో యాలకులు మరియు చికెన్ ముక్కలు వేసి, 20నిముషాలు మీడియం మంట మీద వేయించుకోవాలి.
4. ఇప్పుడు అందులో పెరుగు, టమోటో ముక్కలు, కాశ్మిరి రెడ్ చిల్లీ పౌడర్ మరియు ఉప్పు వేయాలి.
5. వేగే వరకూ మద్యమద్యలో కలియబెడుతూ 20-30ఉడికించుకోవాలి. చికెన్ మెత్తగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి.
6. తర్వాత అందులో జీడిపప్పును పలుకులను యాడ్ చేసి మరో 3నిముషాలు వేయించుకోవాలి.
7. తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే హెల్తీ కాశ్మిరీ చికెన్ రిసిపి రెడీ. అంతే రైస్ లేదా రోటితో తినవచ్చు.

English summary

Healthy Kashmiri Chicken Recipe

Who doesn't like to have chicken? Chicken prepared in any style is relished by people who are ardent fans of this meat. At the same time, many of us would like to experiment with different chicken recipes. Chicken is known to be a healthy food since it is high in proteins.
Story first published: Friday, January 10, 2014, 17:30 [IST]
Desktop Bottom Promotion