For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ అండ్ టేస్టీ బ్రింజాల్ ఫిష్ కర్రీ

|

మాంసాహారులైయుండి, చేపలు తినని వారు ఉంటారు. అయితే చేపలు తినడ ఇష్టమే అయితే వాటి వాసన, సరిగా వండటం చేత కాకనో చేప వంటకాలకు దూరంగా ఉంటారు. చేపలంటే చాలా మందికి ఇష్టం. చేపలను తినడం వల్ల ఆరోగ్యమే కాదు, అందం కూడా. నునుపైన చర్మ సౌందర్యం మీ సొంత అవుతుంది. తీరప్రాంతాల్లో నివసించే వారిని గమనించినట్లైతే వారి చర్మ మిళమిళ మెరుస్తుంటుంది. చేపల్లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అద్భుతమైన ఫిష్ వెరైటీ వంటకాల్లో బ్రింజాల్ ఫిఫ్ కర్రీ కూడా ఒకటి.

ఈ ఫిష్ కర్రీ ప్లెయిన్ రైస్ సూపర్బ్ గా ఉంటుంది. ఈ ఫిష్ వంటకాన్ని వండటానికి ఎక్కువ మసాలాలు అవసరం లేదు. అతి తక్కువ పదార్థాలను ఉపయోగించి, తక్కువ సమయంలో సులభంగా చేసుకొనే టేస్టీ ఫిష్ కర్రీ రెడీ. ఈ ఫిష్ కర్రీను ఏప్పుడైనా, ఏ సందర్భంలోనైనా వండుకోవచ్చు. ఈ రుచికరమైన వంటకం ఫ్యామిలీ మెంబర్స్ కు, అతిథులకు అందించడమే కాకుండా ఫిష్ లవర్స్ నుండి ప్రసంశలను పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి మీరు టేస్ట్ చూసేయండి...

Hilsa Fish With Brinjal Curry

కావల్సిన పదార్థాలు:

హిల్సా ఫిష్: 8 pieces(800 grams)
బ్రింజాల్ (వంకాయ: 8 slices(400 grams)
పచ్చిమిర్చి: 4(మద్యలోకి కట్ చేసుకోవాలి)
ఆవాలు: 1/2tsp
కారం: 1tsp
పసుపు: 1 pinch
మస్టర్డ్ ఆయిల్: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. స్టౌ మీద డీప్ బాటమ్ ఫ్రైయింగ్ పాన్ పెట్టి అందులో మస్టర్ ఆయిల్ వేసి వేడి అయ్యాక అందులో హిల్సా ఫిష్ ముక్కలను వేసి పదిహేను నిముషాల పాటు, అతితక్కువ మంట మీద ఫిష్ ను రెండు ప్రక్కలా ఫ్రై చేసుకోవాలి .

2. ఫ్రై చేసిన ఫిష్ ను నూనెలో నుండి బయటకు తీసి, ఒక టిష్యూ పేపర్ మీద వేసి, చేపలో ఉండే ఎక్ట్స్రా ఆయిల్ ను వత్తేయాలి.

3. ఇక పాన్ లో మిగిలిన నూనెలోనే ఆవాలు, పచ్చిమిర్చి వేసి వేగించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత బ్రింజాల్(వంకాయ)స్లైస్ ను కూడా వేసి, మంటను కొద్దిగా ఎక్కువగా పెట్టుకొని, ఒక ఐదు నిముషాల పాటు బాగా వేయించుకోవాలి.

4. బ్రిజాల్ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ మారగానే, అందులో కారం, మరియు పసుపు, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి .

5. మంట ఎక్కువగా పెట్టి మద్యమద్య కలియబెడుతూ ఉడికించాలి. బ్రింజాల్ ముక్కలు మెత్తబడ్డాక అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న చేపముక్కలను ఈ గ్రేవీలో వేయాలి.

6. పాన్ మీద మూత పెట్టి మరో ఐదు నిముషాల ఉడికించాలి. అంతే బ్రింజాల్ ఫిష్ రెడీ దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.

English summary

Hilsa Fish With Brinjal Curry | హిల్సా ఫిష్ బ్రింజాల్ కర్రీ


 Fish curry is a specialty of Indian cuisine. Every state in India, primarily the fish eating states like Odisha, Bengal, Tamil Nadu, Goa, Kerala etc have their own varieties of fish curries to offer. Fish curry with brinjal is mostly cooked in the eastern parts of India. In both Bengal and Odisha, fish curry with brinjal is a favourite dish.
Story first published: Thursday, February 7, 2013, 11:55 [IST]
Desktop Bottom Promotion