For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోం మేడ్ చికెన్ పకోడా: రంజాన్ స్పెషల్

|

రంజాన్ ముస్లింలకు పవిత్రమైన నెల..అత్యంత భక్తి శ్రద్దలతో నియమాలతో ఈ నెలలో ఉపవాసాలు చేస్తారు..సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ మంచి నీరైనా ముట్టరు. అంతే కాదు..ఎదుటి వ్యక్తికి తాము ఉపవాసం ఉన్నట్లు కూడా కనిపించరు. రోజువారీ విధుల్ని మా మూలుగానే నిర్వహిస్తుంటారు. నగర జీవితం బిజీబిజీ..ట్రాఫిక్ లో మరెన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఉపవాసం ఉన్న వారు నిత్యజీవినం గడుపుతుంటారు. అందుకే సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత బలమైన ఆహారం తీసుకుంటే రోజంతా ఇబ్బంది ఉండదు.

ఎదుటి వారి ఆకలి తెలిసేలా చేసేది ఉపవాసం. అభిమానం అనే ఆకలిని పెంచేది ఇఫ్తార్. రంజాన్ మాసం అంటే తోటి వారిపై ప్రేమ చాటుకునే మాసం. వారిని ప్రేమగా గుండెలకు హత్తుకునే మాసం. ఈ మాసంలో ముస్లింలు ఇతర మతస్తులను ఇఫ్తార్ కు ఆహ్వానిస్తారు. అలాగే ఇతర మతస్తులు వారికి ఇఫ్తార్ విందు ఇస్తారు. రంజాన్ మాసంలో భక్తితో ఆచరించే ఉపవాసదీక్షలు విరమించే ఇఫ్తార్‌లో, ఆ తరువాత స్వీకరించే పదార్థాలు నోరూరిస్తాయి. అధిక పోషక విలువలు కలిగి ఉండే ఈ పదార్థాలకు రంజాన్ నెలలో ప్రత్యేక స్థానం ఉంది. జిహ్వ చాపల్యం కలిగిన ప్రతి ఒక్కరూ వీటిని రుచి చూడకుండా ఉండలేరు. అటువంటి వంటకాల్లో చికెన్ పకోడా ఒకటి. మరి దీన్ని ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారుచేయాలో చూద్దాం...

Homemade Chicken Pakora-Ramzan Special

కావల్సిన పదార్థాలు:

చికెన్ తయారీకి కావల్సినవి:
చికెన్: 1kg
జీలకర: వేయించి పొడి చేసింది : 1/2tsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నిమ్మ ఉప్పు(లెమన్ డ్రెస్స్): 1tsp

పిండి తయారీకి కావల్సినవి
నీరు : 1cup
శనగపిండి: 1cup
బేకింగ్ పౌడర్: 1/2tsp
కారం: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
కరివేపాకులు : నాలుగు రెమ్మలు
పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి)

తయారు చేయు విధానం:

1. ముందుగా ఒక కప్పు నీటిలో కొద్దిగా ఉప్పు వేసి చికెన్ ముక్కలు ఉడకబెట్టాలి.
2. ఉడికిన తరువాత నీటిని పూర్తిగా వడపోసి జిలకర పొడి, ఉప్పు, నిమ్మ ఉప్పు, కారంలో బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
3. తరవాత ఒక గిన్నెలో శనగపిండిని బజ్జీలపిండిలా చిక్కగా కలుపుకొవాలి.
4. అందులోనే కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి, కారం, ఉప్పు తగినంత, బేకింగ్ పౌడర్ కలిపి చికెన్ ముక్కలను పిండిలో ముంచి నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే వేడి వేడి చికెన్ పకోడా రెడీ.

English summary

Homemade Chicken Pakora-Ramzan Special


 Here is a chicken pakora recipe that will solve the problem of your evening snacks. Chicken pakoras can be made using an easy chicken snack recipe.
Story first published: Saturday, July 26, 2014, 15:32 [IST]
Desktop Bottom Promotion