For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హనీ రోస్టెడ్ వెజిటేబుల్ చికెన్ రిసిపి..!!

మీరు మీ ఇంట్లో సాధారణంగా వివిధ రకాల చికెన్ వంటకాలు తయారుచేసి ఉంటారు అవునా? కానీ, ఇది క్రిస్మస్, నూతన సంవత్సర సమయం.

By Lekhaka
|

మీరు మీ ఇంట్లో సాధారణంగా వివిధ రకాల చికెన్ వంటకాలు తయారుచేసి ఉంటారు అవునా? కానీ, ఇది క్రిస్మస్, నూతన సంవత్సర సమయం. మీరు ఎప్పుడూ తయారుచేయని డిన్నర్ మేనూతో మీ అతిధులను కొద్దిపాటి కొత్త ప్రయత్నంతో ఆహ్వానించడానికి ఇదే మంచి సమయం.

మీ వంటగది తాజాగా బెక్ చేసిన ఫ్రూట్ కేక్, పుడ్డింగ్ తో నిండి ఉంటే, మీరు తేనెతో వేయించిన కూరగాయల చికెన్ కి కొద్దిగా సువాసన, రుచిని జోడించ౦డి.

తాజా, క్రంచీ కూరగాయలకు చలికాలం మంచి సీజన్. హనీ చికెన్ వంటకంతో వీటిని జోడించి, క్రిస్మస్ డిన్నర్ కి అద్భుతమైన డిష్ ని తయారుచేయండి.

దీనికి ఎక్కువ సమయం పట్టదు, మీరు క్రిస్మస్ పార్టీ ఉత్సాహాన్ని కూడా కోల్పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు, దీనిని తయారుచేయడానికి కావాల్సిన పదార్ధాలు, తయారుచేసే విధానం అనుసరిద్దాం.

సర్వ్ చేయడానికి - 4

తయారుచేయడానికి పట్టే సమయం 20 నిముషాలు

వంటచేయడానికి పట్టే సమయం – 20 నిముషాలు

కావాల్సిన పదార్ధాలు:

1.బటర్ నట్ స్క్వాష్ – 100 గ్రాములు

2.సోంపు రూట్ – 1

3.చిలగడదుంప – 1

4.యాస్పరాగస్ – 4

5.బ్రకోలీ – కొన్ని పుష్పాలు

6.ఎర్ర ఉల్లిపాయ చిన్నవి – 2

7.ఆలివ్ ఆయిల్ – 4 టేబుల్ స్పూన్లు

8.క్యారెట్లు – 4

9.రోజ్ మేరీ – 2-3 రెమ్మలు

10.చికెన్ – 800 గ్రాములు

11.రుచికి సరిపడా ఉప్పు

12.తేనె – 100 ఎమ్ ఎల్

13.వెల్లుల్లి – 5-6 రెబ్బలు (తరిగినవి)

14.ఆవాలు – ½ టేబుల్ స్పూన్

15.మిరియాలు – 1 టేబుల్ స్పూను

16.నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు

తయారుచేసే విధానం:

1.ముందుగా చికెన్ ని మరినేట్ చేయాలి. ఒక బౌల్ తీసుకుని అందులో ఆవాల పేస్ట్, ఆలివ్ ఆయిల్, తేనె, వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.

2.ఇప్పుడు, ఆ మిశ్రమంలో రోజ్ మ్యారీ, చికెన్ వేసి మళ్ళీ బాగా కలపాలి. దాన్ని ఒక గంట పక్కకు పెట్టి ఉంచాలి. మీరు రాత్రి డిన్నర్ కోసం ఈ వంట చేసుకోవాలి అనుకుంటే ఉదయానే ఈ మరినేట్ తయారుచేసి ఉంచుకోవాలి.

3.ఇప్పుడు, ఒక బేకింగ్ ట్రే తీసుకుని దానికి ఆలివ్ ఆయిల్ అప్లై చేయాలి. ఉప్పు, తేనె, వెల్లుల్లి, మిరియాల పొడి అన్నీ కలిసేట్టు బాగా కలపాలి.

4.ఈ మిశ్రమంలో అన్ని కూరగాయలు, ఆ మ్యారినేట్ ని కలపాలి.

5.ఈ కూరగాయలతో మ్యరినేట్ చేసిన చికెన్ ని కలిపి ఈ మిశ్రమాన్ని 220 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 20-25 నిమిషాలసేపు బేక్ చేయాలి.

6.మీ తేనెతో వేయించిన చికెన్, కూరలు వడ్డించడానికి సిద్ధం. కూరగాయలు, చికెన్ తో వేడిగా వడ్డించడానికి డిష్ ని ఏర్పాటు చేయండి.

ఈ వంటకం అందంగా, క్రిస్మస్ పండుగకు సరైన ఎంపికగా కనిపిస్తుంది. మీరు పూర్తి డిన్నర్ కోసం ఈ డిష్ ని తీసుకోవచ్చు లేదా దీనితో వెల్లుల్లి బ్రెడ్ ని తయారుచేసుకోవచ్చు, రెడ్ వైన్ తో నూతన సంవత్సరానికి స్వాగతం పలకవచ్చు.

తయారుచేసే విధానం:

తయారుచేసే విధానం:

1.ముందుగా చికెన్ ని మరినేట్ చేయాలి. ఒక బౌల్ తీసుకుని అందులో ఆవాల పేస్ట్, ఆలివ్ ఆయిల్, తేనె, వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.

తయారుచేసే విధానం:

తయారుచేసే విధానం:

ఇప్పుడు, ఆ మిశ్రమంలో రోజ్ మ్యారీ, చికెన్ వేసి మళ్ళీ బాగా కలపాలి. దాన్ని ఒక గంట పక్కకు పెట్టి ఉంచాలి. మీరు రాత్రి డిన్నర్ కోసం ఈ వంట చేసుకోవాలి అనుకుంటే ఉదయానే ఈ మరినేట్ తయారుచేసి ఉంచుకోవాలి.

తయారుచేసే విధానం:

తయారుచేసే విధానం:

ఇప్పుడు, ఒక బేకింగ్ ట్రే తీసుకుని దానికి ఆలివ్ ఆయిల్ అప్లై చేయాలి. ఉప్పు, తేనె, వెల్లుల్లి, మిరియాల పొడి అన్నీ కలిసేట్టు బాగా కలపాలి.

తయారుచేసే విధానం:

తయారుచేసే విధానం:

ఈ మిశ్రమంలో అన్ని కూరగాయలు, ఆ మ్యారినేట్ ని కలపాలిఈ కూరగాయలతో మ్యరినేట్ చేసిన చికెన్ ని కలిపి ఈ మిశ్రమాన్ని 220 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 20-25 నిమిషాలసేపు బేక్ చేయాలి.

మీ తేనెతో వేయించిన చికెన్, కూరలు వడ్డించడానికి సిద్ధం. కూరగాయలు, చికెన్ తో వేడిగా వడ్డించడానికి డిష్ ని ఏర్పాటు చేయండి.

ఈ వంటకం అందంగా, క్రిస్మస్ పండుగకు సరైన ఎంపికగా కనిపిస్తుంది. మీరు పూర్తి డిన్నర్ కోసం ఈ డిష్ ని తీసుకోవచ్చు లేదా దీనితో వెల్లుల్లి బ్రెడ్ ని తయారుచేసుకోవచ్చు, రెడ్ వైన్ తో నూతన సంవత్సరానికి స్వాగతం పలకవచ్చు.

English summary

Honey Roasted Vegetable Chicken

You usually may make different types of chicken recipes at home, right? But, this is the time of Christmas and New Year. This is the time to try something new to welcome your guests with an ever-lingering dinner menu.
Desktop Bottom Promotion