For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరకరలాడే హాట్ అండ్ స్పైసీ చికెన్

|

కరకరలాడే చికెన్ అంట్ మనందరికీ ఇష్టమే అందులోనూ హాట్ గా స్పైసీగా...సాఫ్ట్ గా ఉండే చికెన్ అయితే మరింత ఇష్టం. ఇంట్లో రెగ్యులర్ గా వండే చికెన్ కాకుండా కొంచెం వెరైటీగా తయారుచేసుకుంటే పిల్లలు మరియు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు.

READ MORE: చాలా సింపుల్ పెప్పర్ లెమన్ చికెన్

ఇలాంటి రెస్టారెంట్ ఫుడ్ కోసం బయటకెళ్ళి డబ్బు ఖర్చుచేయాల్సిన అవసరం ఉండదు. ఈ హాట్ అండ్ క్రిస్పీ చికెన్ రిసిపి చాలా సింపుల్ గా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు . ఈ సింపుల్ అండ్ ఈజీ చికెన్ క్రిస్పీని ఒక్క సారి తయారుచేయండ నేర్చుకుంటే మరెప్పుడూ మిస్ చేయరు. మరియు ఈ హాట్ క్రిస్పీ చికెన్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం....

Hot Chicken Crisps Recipe: Telugu Vantalu

కావల్సిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్: 1 kg
కార్న్ ఫ్లోర్: 5 tbsp
మైద: 5 tbsp
గుడ్లు: 2
సోయా సాస్: 2 tbsp
చిల్లీ సాస్: 2 tbsp
వెనిగర్: 2 tbsp
ఆవపొడి: 1 tsp
బ్లాక్ పెప్పర్: 1 tsp
వెల్లుల్లి రెబ్బలు: 6 to 7సన్నగా తరిగి పెట్టుకోవాలి
ఉప్పు : రుచికి సరిపడా
చికెన్ ముక్కలు:5 to 6
చైనీస్ సాల్ట్: రుచికి సరిపడా
నూనె: ఫ్రై చేయడానికి సరిపడా

READ MORE: రోస్టెడ్ చికెన్ లెమన్ రైస్: టేస్టీ అండ్ హెల్తీ...

తయారుచేయు విధానం:
1. ముందుగా శుభ్రం చేసుకొన్న చికెన్ ముక్కలను కుక్కర్లో వేసి, కొద్దిగా నీళ్ళు పోసి పెట్టాలి.
2. అలాగే చికెన్ తో పాటు, కొద్దిగా నూనె, చైనీస్ సాల్ట్, వెల్లుల్లి, వెనిగర్, ఉప్పు మరియు పెప్పర్ వేయాలి.
3. మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి.
4. ఇప్పుడు సపరేట్ బౌల్ తీసుకొని అందులో గుడ్లు, సోయాసాస్, చిల్లీ సాస్, బ్లాక్ పెప్పర్, ఆవాల పేస్ట్, కార్న్ ఫ్లోర్, మైదా మరియు చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
5. మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. మరీ చిక్కగా లేకుండా కొద్దిగా పాలు మిక్స్ చేసుకోవచ్చు.
6. ఇప్పుడు ముందుగా ఉడికించుకొన్న చికెన్ ముక్కలను ఈ పేస్ట్ ను పట్టించి డీప్ ఫ్రై చేసుకోవాలి.
7. అంతే క్రిస్పీ చికెన్ ముక్కలను టమోటో సాస్ మరియు కోల్డ్ డ్రింక్స్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Hot Chicken Crisps Recipe: Telugu Vantalu

We all like to have chicken which is crispy, crunchy and yet soft. What if you could make the same chicken in your own kitchen. How exciting it would that be! Your kids will love having them and so will the elders of your family.
Story first published: Tuesday, August 4, 2015, 14:05 [IST]
Desktop Bottom Promotion