For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాట్ అండ్ స్పైసీ ఆంధ్రస్టైల్ మటన్ కర్రీ

|

సాధారణంగా ఆంధ్రా వంటలంటే చాలా స్పైసీగా ఉంటాయి. స్పైసీ లేకుండా ఆంధ్రావంటలు ఉండవంటే అతిశయోక్తికాదేమో..ఆ వంటకాల్లో ఈ మటన్ కర్రీ కూడా ఒకటి. ఈ మటన్ కర్రీలో వివిధ రకాల మసాలా దినుసులు అందులోనూ వివిధ ఫ్లేవర్స్ ఉన్న మసాల దినుసులు ఉపయోగించడం వల్ల ఈ మటన్ కర్రీ మరింత స్పైసీగా ఘుమఘుమలాడుతూ స్పైసీగా ఉంటుంది. ఈ మటన్ కర్రీ తయారు చేసే ముందుగానే మటన్ ను కుక్కర్ లో ఉడికించుకోవాలి. అప్పుడు గ్రేవీ చిక్కగా తయారవుతుంది.

ఈ ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ తయారు చేయడం చాలా సులభం. ఇది తయారు చేయడానికి మటన్ సపరేట్ గా మసాలా దినుసుల గ్రేవీ వేరుగా ఉడికించుకోవడంలోనే ట్రిక్ దాగివుంది. మరి ఇంకెదుకు ఆలస్యం ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ తయారు చేసేయండి.....

Hot N Spicy Andhra Style Mutton Curry

కావల్సిన పదార్థాలు:

మటన్: 1kg(మీడియం సైజు ముక్కలు)
పసుపు: 1/2 tsp
నల్ల మిరియాలు: 10
గ్రీన్ ఏలకులు: 5
పెద్ద జీలకర్ర : / 2 tsp
గసగసాలు: 1tsp
ధనియాలు: 1tsp
జీలకర్ర: 1tsp
దాల్చిన: 1 అంగుళం
లవంగాలు: 5
ఉల్లిపాయలు: 2 (సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
టమోటో: 2 (సన్నగా కట్ చేసుకోవాలి)
కారం: 1tsp
నల్ల మిరియాలు పొడి: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత

తయారు చేయు విధానం:
1. ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు మరియు 3కప్పుల నీరు పోసి కుక్కర్ నాలుగు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద నుండి క్రిందికి దించుకొని, ఐదు నిముషాల తర్వాత మూత తీసి, నీరు వంపేసి మటన్ పీసులను పక్కన తీసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఒక పాన్ లో గసగసాలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, లవంగాలు, యాలకులు, చెక్క, పెద్ద జీలకర్ర వేసి లైట్ గా వేగించుకోవాలి.
4. ఈ మసాలా దినుసులను రోస్ట్ చేసుకొన్న తర్వాత వీటిని చల్లారనివ్వాలి. మసాలా దినుసులు చల్లారిన తర్వాత వీటన్నింటినీ మిక్సీలో వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి.
5. తర్వాత డీప్ బాటమ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి కాగిన తర్వాత కరివేపాకు వేసి తర్వాత ఉల్లిపాయలు ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేగించుకోవాలి.
6. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తక్కువ మంట మీద వేగించుకోవాలి.
7. తర్వాత కట్ చేసి పెట్టుకొన్న టమోటో మరియు ఉప్పు వేసి మరో ఐదు నిముషాలు వేగించుకోవాలి. టమోటోలు మెత్తబడే వరకూ వేగించాలి.
8. ఇప్పుుడు అందులో ఉడికించి పెట్టుకొన్న మటన్ ముక్కలు కూడా వేయాలి. వీటితో పాటు, పెప్పర్ పౌడర్, గ్రైండ్ చేసి పెట్టుకొన్న మసాలా వేసి బాగా వేగించాలి. ఐదు నిముషాల పాటు వేగించుకోవాలి.
9. తర్వాత కారం, కూడా వేసి బాగా కలగలిపి 2కప్పుల నీరు పోసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మరో 10నిముషాలు ఉడికించుకోవాలి. అంతే హాట్ అండ్ స్పైసీ ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ రెడీ.

English summary

Hot N Spicy Andhra Style Mutton Curry | స్పైసీ ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ

All Andhra recipes are very hot and spicy; theyare not meant for people who cannot stand spicy food. Thus the Andhra mutton curry is no exception. This mutton curry recipe is rich in spices and has lots of different flavours.
Story first published: Friday, April 12, 2013, 12:49 [IST]
Desktop Bottom Promotion