For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాది ఆఛారి ముర్గ్ : స్పెషల్ నాన్ వెజ్ రిసిపి

|

హైదరాబాది వంటలు వేటికవి ప్రత్యేకంగా ఉంటాయి. రుచిలో కానీ, ప్లేవర్లో కానీ, చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాది వంటలకు ఎక్కువగా ఇండియన్ మసాలా దినుసులను ఉపయోగించడం వల్ల అద్భుతమైన రుచి, రంగు, వాసనతో ప్రతి ఒక్కరినీ నోరూరిస్తుంటాయి . హైదరాబాది స్పెషల్ చికెన్ వంటల్లో ఆఛారి ముర్గ్ ఒకటి.

హైదరాబాది ఆఛారిక ముర్గ్ రిసిపి ఫ్లవర్ ఫుల్ రిసిపి . ఎందుకంటే ఈ వంటకోసం జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఉల్లిపాయ విత్తనాలను ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. అందుకే చాలా డిఫరెంట్ టేస్ట్ ను కలిగి ఉంటుంది . ఈ స్పైసీ అండ్ డెలిషియస్ డిష్ ను మీకు కూడా రుచి చూడాలంటే లేదా స్పెషల్ గెస్ట్ లకు ఆతిద్యం ఇవ్వాలన్నా ఈ రిసిపి స్పెషల్ గా ఉంటుంది.

Hyderabadi Achari Murgh: Step-By-Step Recipe

ఆఛారి చికెన్ అంటే చాలా మంది ఈ వంటకు ఊరగాయను జోడిస్తారనుకుంటారు, అయితే ఖచ్ఛితంగా అలా జరగదు. ఈ వంటను తయారుచేయడమే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఈ వంటకు ఆఛారి చికెన్ లేదా ఆఛారి ముర్గ్ గా పిలుస్తారు. మరి ఇంకెదుకు ఆలస్యం హైదరాబాది ఆఛారి ముర్గ్ రిసిపి ని ఎలా తయారుచేయాలో చూద్దాం....

Serves: 3
Preparation time: 20 minutes
Cooking time: 40 minutes

Hyderabadi Achari Murgh: Step-By-Step Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్: 500gms
ఉల్లిపాయలు: 3 (సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం: వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
టమోటాలు: 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పెరుగు: 1/2 కప్పు
నిమ్మకాయ juice- 2tbsp
పసుపు పొడి: 1tsp
కారం పొడి: 1tsp
Kalonji(ఉల్లిపాయ గింజలు) - 1tsp
మెంతి (మెంతులు): 1tsp
జీలకర్ర: 1tsp
సోంపు(ఫెన్నెల్) : 1/2 tsp
బిర్యానీ ఆకు: 2
ఉప్పు రుచికి సరిపడా
నెయ్యి: 2tbsp

ఆఛారి మసాలా కోసం కావల్సినవి:
కలోంజి (ఉల్లిపాయ గింజలు): 1tsp
ఆవాలు : 1tsp
మెంతి (మెంతులు) : 1tsp
జీలకర్ర: 1tsp
సోంపు (ఫెన్నెల్) : 2tsp
బిర్యానీ ఆకు : 2
ఎండు మిర్చి: 3

తయారుచేయు విధానం:
1. ముందుగా ఆఛారి మసాలా కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని మీడియం మంట మీద ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
2. తర్వాత ఈ పొడిని చికెన్ ముక్కల మీద వేసి, కొద్దిగా ఉప్పు మరియు నిమ్మరసం మిక్స్ చేసి 15-20నిముషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి వేడయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను వేసి మరో 5-10నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. చికెన్ కొద్దిగా వేగిన తర్వాత అందులో కలోంజి విత్తనాలు, జీలకర్ర, ఎండు మిర్చి, మేతి మరియు బిర్యానీ ఆకు వేసి బాగా మిక్స్ చేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులోనే పసుపు, కారం, ఉప్పు, సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి, ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
6. చికెన్ తో పాటు ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా, టమోటో ముక్కలు మరియు ఆఛారి మసాలా పౌడర్ వేసి మొత్త మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
7. చివరగా అందులో పెరుగు వేసి మిక్స్ చేయాలి. తర్వాత మూత పెట్టి తక్కువ మంట మీద20-25నిముషాలు ఉడికించుకోవాలి.
8. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.
9. సర్వ్ చేయడానికి ఆఛారి ముర్గ్. ఈ స్పెషల్ చికెన్ రిసిపిని రోటి మరియు రైస్ తో ఎంజాయ్ చేయవచ్చు.

Hyderabadi Achari Murgh: Step-By-Step Recipe

న్యూట్రీషియన్ విలువలు: ట్రెడిషినల్ హైదరాబాది ఆఛారి చికెన్ రిసిపిని నూనెతో వండేటప్పుడు కొద్దిగా క్యాలరీలు జోడించబడుతాయి . అలాగే మరింత టేస్ట్ గా ఉండటం కోసం నెయ్యి కూడా జోడిస్తారు, కాబట్టి, ఈ చికెన్ రిసిపికి అధిక క్యాలరీలు చేరుతాయి. ఈ స్పెషల్ వంటకు పెరుగును వాడటం వల్ల అదనపు రుచితో పాటు ప్లేవర్ కూడా అద్భుతంగా ఉంటుంది.

Hyderabadi Achari Murgh: Step-By-Step Recipe

చిట్కా: చికెన్ వండటానికి కొన్ని గంటల ముందు ఆఛారి మసాలాతో చికెన్ ను మ్యారినేట్ చేసుకోవాలి . చికెన్ మ్యారినేట్ చేయడానికి ముందు చికెన్ ముక్కలకు చిన్న చిన్న గాట్లు పెట్టుకోవడం వల్ల చికెన్ టేస్ట్ మరింత బెటర్ గా ఉంటుంది.

Hyderabadi Achari Murgh: Step-By-Step Recipe
Hyderabadi Achari Murgh: Step-By-Step Recipe
Hyderabadi Achari Murgh: Step-By-Step Recipe
Hyderabadi Achari Murgh: Step-By-Step Recipe
Hyderabadi Achari Murgh: Step-By-Step Recipe
Hyderabadi Achari Murgh: Step-By-Step Recipe
Hyderabadi Achari Murgh: Step-By-Step Recipe

English summary

Hyderabadi Achari Murgh: Step-By-Step Recipe

Hyderabadi recipes have a different charm of their own. They are laced with the flavour of the fragrant Indian masalas, which make the Hyderabadi recipes a delight for the foodies. Achari murgh, a chicken recipe from Hyderabad, is the best example of the medley of Indian masalas.
Story first published: Tuesday, December 23, 2014, 14:28 [IST]
Desktop Bottom Promotion