For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాదీ గోస్ట్ మసాలా

|

'గోస్ట్ మసాలా'.. పేరు భయంకరంగా ఉందని బెదిరిపోకండి... లొట్టలేసుకు తినే రుచిని కలిగిన ఈ హైదరబాదీ వంటకం దేశ వ్యాప్తంగా ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. 'నైజాం నవాబులు' కాలం నుంచి రూపాంతరం చెందుతూ వస్తున్న 'సుప్రసిద్ధ భాగ్యనగరి మటన్ వంటకం' కాలానుగుణంగా మార్పు చెందుతూ ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది. రంజాన్ మాసంలో మహ్మదీయులు ఇష్టంగా ఆరగించే ఈ వంటకం కోస్తా, రాయలసీమ, తెలంగాణ, ఉత్తారాంధ్రాల్లో చెదురు మదరుగా దొరుకుతుంది.

అయితే ఈ వంటకాన్నిఅతి సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందు కోసం అతిగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ముఖ్యంగా బ్యాచిలర్స్, వీకెండ్ ఎంజాయ్ అంటూ రెస్టారెంట్లలో వందలకు వందలు బిల్లులు కట్టే బదులు తమ రూమ్ లోనే ఈ స్వయంపాకాన్ని తయారు చేసుకుంటే ' కొత్త వంటకాన్ని ట్ర్రై చేసామన్న ధ్రిల్ తో పాటు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది...

Hyderabadi Gosht Masala

గోస్ట్ మసలా తయారీకి కావల్సిన పదార్ధాలు:
తాజా వేట మాంసం(మటన్): 500grm
పెరుగు: 1cup
మిరియాలు: 3tbsp
ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగినవి)
వెల్లులి రెబ్బలు: 5
అల్లం కొద్దిగా: చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి
పచ్చిమిర్చి: 4(సన్నగా తరిగినవి)
పెప్పర్ కార్న్స్: 10
లవంగాలు: 5
ఏలకలు: 4
లవంగపట్టు బద్దలు: 2
జీలకర్ర :1tsp
పలావ్ ఆకు: 1
కారం: 1tsp
జీలకర్ర పొడి: 2tsp
నూనె: 4tbsp
ఉప్పు: రుచికి తగినంత

తయారు చేసుకునే విధానం:
1. ముందుగా శుభ్రం చేసుకున్న మటన్, పెరుగు, కారం, జీలకర్ర పొడి, మిరియాలు లేదా పొడి, ఉప్పును ఒక పాత్రలోకి తీసుకుని బాగా మిక్స్ చేసి రెండు గంటలు పాటు నానబెట్టకోండి.
2. తర్వాత పాన్ లో నూనె పోసి వేడైన తరవాత పలావ్ ఆకు, జీలకర్ర, పెప్పర్ కార్న్, లవంగాలు, ఏలకలు, లవంగపట్టు బద్దలను వేసి నిమిషం పాటు వేయించండి.
3. అనంతరం సన్నగా తరిగిపెట్టకున్న ఉల్లిముక్కలను మెల్లగా పాన్ లోకి జారవిడువండి. అవి బంగారం రుంగులో వేగాక వెల్లులి రెబ్బలతో పాటు అల్లాన్ని వేసి రెండు నిమిషాల పాటు వేయించండి.
4. ఇప్పుడు నానబెట్టిన మిశ్రమాన్ని పాన్ లో వేసి మిశ్రమం కలిసేలాగా గరెటితో తిప్పండి. 8 నిమిషాలు పాటు ఈ మిశ్రమాన్ని ఉడికించిన తరువాత, ప్రెషర్ కుక్కర్‌లోకి మార్చండి.
5. ఈ మిశ్రమానికి రెండు కప్పుల నీటిని జోడించి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మీరు శ్రమించి తయారుచేసిన 'గోస్ట్ మషాలా' తయార్, ఈ వేడి, వేడి మాషాలాను అన్నంలోగాని, బిర్యానిలోగాని కలుపుకుని తింటే ఆ రుచే వేరు, ఇంకెందుకండి ఆలస్యం తయారీ విధానం తెలుసుకున్నారుగా ఒక సారి ట్రై చేస్తే పోలా...

English summary

Hyderabadi Gosht Masala

Ghost masala is a spicy lamb curry that hails from the meat paradise of Hyderabad. It is an ideal Ramzan recipe to spice up your experience of food during this month of fasting. This Indian mutton recipe is very popular across the country for its burning peppery taste.
Story first published: Wednesday, July 30, 2014, 12:15 [IST]
Desktop Bottom Promotion