For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కచ్చ గోష్ట్ బిర్యానీ : హైదరాబాదీ స్పెషల్

|

బిర్యానీ వంటల్లో ఒక డిఫరెంట్ రుచికలిగిన బిర్యానీ హైదరాబాది కచ్చిగోష్ట్ బిర్యానీ. ఈ బిర్యానీ యొక్క రుచి మరియు రంగుతోటే నోరూరిస్తుంటుంటి . ఈ వండర్ ఫుల్ బిర్యానీ రిసిపిని చికెన్ లేదా మటన్ తో కూడా తయారుచేయవచ్చు.

హైదరాబాది కచ్ఛి గోష్ట్ బిర్యానీకి ఇండియన్ మసాలా దినుసులతో మ్యారినేట్ చేసి, తర్వాత బాస్మతి రైస్ తో తయారుచేయడం వల్ల ఈ బిర్యానీకి ఇంత అద్భుతమైన రుచి వస్తుంది. ఈ బిర్యానీ రిసిపిని మ్యారినేట్ చేసిన మటన్ తో జోడించి పూర్తిగా అరగంట పాటు ఆవిరి మీద ఉడికించడం వల్ల మంచి ఫ్లేవర్ మరియు టేస్టీగా ఉంటుంది. మరి ఈ హైదరాబాది కచ్చి గోష్ట్ బిర్యానీ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Hyderabadi Kachay Gosht ki Biryani

కావాల్సిన పదార్థాలు :
మటన్: 1kg
బాస్మతి రైస్: 1kg
పెరుగు: 200grms
లెమన్ జ్యూస్: 3tsp
మసాలా దినుసులు: 20grms
చిల్లీ పౌడర్: 2tsp
ధనియాల పౌడర్: 3tsp
జింజర్ గార్లిక్ పేస్ట్: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
గరం మసాలా: 11/2tsp
నూనె: సరిపడా
ఫ్రైడ్ ఆనియన్: 1cup
తరిగిన కొత్తిమిర: 1/2cup
తరిగిన పుదీనా: 1/2cup
బే లీవ్స్: 1
వెన్న: 150grms
నీళ్ళు: 5ltrs.

తయారు చేయు విధానం :
1. ముందుగా ఒక కేజీ మాసం తీసుకుని అందులో లెమన్ జ్యూస్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా పౌడర్, ఫ్రైడ్ ఆనియన్, పెరుగు, తరిగిన కొతిమిర, పుదీనా, ధనియాల పౌడర్, నూనె కలిపి రెండు మూడు గంటల పాటు బాగా నానబెట్టాలి.
2. తర్వాత 5 లీటర్ల నీటిని ఒక బౌల్‌లో తీసుకుని 25 నిమిషాల పాటు మరగబెట్టాలి.
3.తరువాత ఇందులో పైన సూచించిన మోతాదులో ఉప్పు, 10గ్రా. గరం మసాలా, బేలీవ్స్ కలపాలి.
4. ఇప్పుడు గంటపాటు నాన బెట్టిన బాస్మతి రైస్‌ని మరగించిన నీటికి కలపాలి. ఇప్పుడు సగం బిర్యానీ తయారు అయినట్లే.
5. ఈ రైస్‌ని తీసుకుని పైన సూచించిన విధంగా.. బాగా నాన బెట్టిన మటన్‌పై వేయాలి. రైస్ పైన వెన్న, గార్లిక్ కలపాలి. ఇలా తయారైన బిర్యానీపై మూత ఉంచి గోధుమపిండితో మూతను సీల్ చేయాలి(ఆవిరిబయట పోకుండా)20-25 నిమిషాల పాటు గ్యాస్‌ని సిమ్‌లో ఉంచి ఉడకబెట్టాలి.
6. తరువాత మూతపై 20 నిమిషాల పాటు వేడి వేడి నిప్పులు పోయాలి. తరువాత మూత తీస్తే ఘుమ ఘుమలాడే బిర్యానీ మనకు నోరూరిస్తుంది. దీనికి తరిగిన కొతిమిర, పుదీనా, జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్, మిర్చీ ముక్కలు కలపాలి.
7. అంతే మనకు కావల్సిన కచ్చి గోషి బిర్యానీ తయారైంది. ఇలా వేడి వేడిగా ఉన్న బిర్యానీని టేస్ట్ చేస్తే ఆ మజాయే వేరు.

English summary

Hyderabadi Kachay Gosht ki Biryani

This delicious recipe is all the way from Hyderabad. Color your taste buds with this exquisite Hyderabadi recipe. Make this wonderful tasty dish with Meat or Chicken. Just like good old times. Not many people know that that biryani in the very beginning used to be prepared with raw meat and prolonged steam cooking
Story first published: Tuesday, September 9, 2014, 12:40 [IST]
Desktop Bottom Promotion