For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్ స్టైల్ స్పానిష్ ఆమ్లెట్ రిసిపి

|

స్పానిష్ ఆమ్లెట్ ఒక హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి. ఈ రుచికరమైన ఆమ్లెట్ తీసుకుంటే ఆ రోజంతా మిమ్మల్ని హెల్తీగా మార్చుతుంది. మీకు తగినంత శక్తిని అందిస్తుంది . ఆమ్లెట్ రిసిపిలు వివిధ రకాలుగా ఉన్నాయి. వాటిని హెల్తీగా మరియు సులభంగా తయారుచేయవచ్చు.

అయితే, స్పానిస్ ఆమ్లెట్ ను మన ఇండియన్ స్టైల్లో తయారుచేస్తే ఎలా ఉంటుంది . ఈ స్పానిష్ ఆమ్లెట్ యొక్క స్పెషాలిటీ ఇందులో ఉడికించిన బంగాళదుంపను జోడించడం వల్ల మరింత టేస్ట్ గా మరియు సాష్ట్ గా రుచికరంగా ఉంటుంది. ఇది ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడానికి చాలా త్వరగా తయారుచేయవచ్చు . దీన్ని పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎక్కువగా ఇష్టపడుతారు. మరి ఈ వెరైటీ, స్పానిష్ ఆమ్లెట్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Indian style Spanish Omelette Recipe

కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 4
పొటాటో: 2(మీడియం)
టమోటో: 2(మీడియం)
ఉల్లిపాయలు: 2(మీడియం)
పచ్చిమిర్చి: 4
బ్లాక్ పెప్పర్ పౌడర్: 1/2tbsp
చీజ్: 2tbsp
నూనె: సరిపడా
ఉప్పు : రుచికి తగినంత

తయారుచేయు విధానం:
1. బంగాళదుంపలను ఉడికించి తర్వాత పొట్టు తీసి మ్యాష్ చేయాలి.
2. అంతలోపు, ఉల్లిపాయలను మరియు టమోటోలను కట్ చేయాలి.
3. ఇప్పుడు, బౌల్ తీసుకొని అందులో గుడ్డు పగులగొట్టు వేయాలి. ఇప్పడు అందులో టమోటో, ఉల్లిపాయ, ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకొన్న పొటాటో కూడా వేయాలి. తర్వాత పచ్చిమిర్చి, బ్లాక్ పెప్పర్ మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల సాఫ్ట్ గా మారుతుంది.
4. తర్వాత పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి వేడయ్యాక అందులో కొద్దిగా నూనె రాసిన, గుడ్డు మిశ్రమాన్ని పాన్ మీద పోయాలి.
5. ఆమ్లెట్ ఉడుకుతున్నప్పుడు, చీజ్ తురుము వేసి ఆమ్లెట్ మొత్తం సర్ధాలి.
6. తర్వాత రెండు వైపులా మార్చి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి . అంతే రుచికరమైన స్పానిష్ ఆమ్లెట్ రెడీ.

English summary

Indian style Spanish Omelette Recipe

Spanish omelette is one of the healthiest breakfasts. This delicious meal can kickstart your day, make it power-packed and healthy. There are various kinds of omelette recipes that are healthy and easy.
Story first published: Thursday, October 30, 2014, 12:24 [IST]
Desktop Bottom Promotion