For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ టమోటో ఫిష్ కర్రీ: ఇండియన్ స్టైల్

|

ఫిష్ తో తయారుచేసే వంటలు ఎప్పటిలాగే రొటీన్ గా తయారుచేసుకోకుండా కొంచెం వెరైటీగా చాలా సులభంగా, ట్యాంగీ టేస్ట్ తో త్వరగా తయారుచేసుకొనే వంటి టమోటో ఫిష్ కర్రీ. స్పైసీ ఇండియన్ ఫిస్ కర్రీ ట్యాంగీ మరియు స్పైసీగా ఉంటుంది.

ఇటువంటి స్పెషల్ వంటలను వీకెండ్స్ లో ఇంట్లో ట్రై చేయడం వల్ల ఒక కొత్త రుచిని ఆస్వాధించవచ్చు. ఈ టమోటో ఫిస్ కర్రీకి పుల్లని నాటీ టమోటోలతో పాటు కొన్ని ఇండియన్ మసాలా దినుసులతో పాటు, చింతపండు గుజ్జు మిక్స్ చేయడం వల్ల ట్యాంగీ మరియు స్పైసీ టేస్ట్ కలిగి ఉంటుంది.
మరి ఈ ఇండియన్ స్టైల్ స్పైసీ ఫిష్ కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Indian Style Spicy Tomato Fish Curry Recipe

కావల్సిన పదార్థాలు:
చేపముక్కలు: 6-7పీసెస్
రెడ్ చిల్లీ పేస్ట్ : 2tbsp
టమోటోలు: 6 మీడియం సైజ్(కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి)
బంగాళదుంపలు: 8(స్లైస్ గా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 1చిన్నది(సన్నగా తరిగినవి)
వెల్లుల్లి రెబ్బలు: 6-8సన్నగా తరిగినవి
కరివేపాకు: కొద్దిగా
జీలకర్రపొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: కొద్దిగా
చింతపండు గుజ్జు: 2tbsp
కొబ్బరి నూనె: 1tbsp

తయారుచేయు విధానం:
1. చేపముక్కలను శుభ్రంగా కడిగి, కొద్దిగా పసుపు మరియు ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. 10నిముషాల తర్వాత పాన్ లో కొద్దిగా కొబ్బరి నూనె వేసి వేడయ్యాక అందులో కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
4. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మరో రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. అలాగేజీలకర్రపొడి మరియు ఉప్పు కూడా వేసి ఒక నిముషం వేగించాలి.
6. ఇప్పుడు టమోటో పేస్ట్ వేసి మొత్తం మిశ్రమం కలగలుపుతూ 10 నిముషాలు ఉడికించుకోవాలి.
7. పదినిముషాల తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేసి మరో 5నిముషాలు ఉడికించాలి.
8. తర్వాత బంగాళదుంపలు కూడా చేర్చుకోవాలి. (మీకు అవసరం అయితేనే చేర్చుకోవచ్చు). టమోటో గ్రేవీ చిక్కగా ఉడుకుతున్న సమయంలో అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలను వేసి మొత్తం మిక్స్ చేసి మూత మూయాలి. మంటను పూర్తిగా తగ్గించి 10నిముషాలు ఉడికించుకోవడం వల్ల మసాలాలు చేపకు బాగా పడుతాయి.
9. చివరగా చింతపండు గుజ్జును ఉడుకుతున్న టమోటో ఫిష్ గ్రేవీలో పోసి బాగా మిక్స్ చేసి ఒక నిముషం తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
10. స్టౌ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

న్యూట్రిషియన్ విలువలు: ఈ జ్యూసీ ఫిస్ పీస్ వివిధ రకాల విటమిన్స్ మరియు మినిరల్స్ తో నిండి ఉంటుంది. మరియు ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది ప్రమాధకరమైన వ్యాధుల నుండి ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.

English summary

Indian Style Spicy Tomato Fish Curry Recipe

Have you lately thought of having or preparing a really spicy fish curry with some tangy tomatoes. Get started to tickle your taste buds with our today's special yet easy fish curry recipe. Truly hot and very Indian, this tomato fish curry is just right for this weekend's try!
Story first published: Thursday, December 11, 2014, 13:25 [IST]
Desktop Bottom Promotion