
కావలసిన పదార్థాలు:
చికెన్: 1/2kg
టమోటాలు: 1/4kg
ఉల్లిపాయలు: 1/2kg
అల్లం వెల్లుల్లి పేస్ట్: 3tbsp
ఫెరుగు: 1cup
కారం: 2tsp
నూనె: తగినంత
పచ్చిమిర్చి పేస్ట్: 2tsp
కోడి గుడ్లు: 2
కొత్తిమీర: 1కట్ట
దాల్చిన చెక్క: చిన్న ముక్క
లవంగం: 4
యాలకుల పొడి: 1tsp
వెన్న: 50gram
పలావ్(బిర్యాని)ఆకులు: 2
తయారు చేయు విధానం:
1. చికెన్ ముక్కలు పెద్దగా కోసుకుని శుభ్రం చేసుకోవాలి.
2. ఇప్పుడు పాన్ లో నూనె వేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు వేయించాలి. అందులోనే టమాటా ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర వేయించాలి.
3. తర్వాత అందులోనే పచ్చిమిర్చి పేస్ట్, చికెన్ ముక్కులు వేసి అరగంట పాటు మొత్తగా ఉడకనివ్వాలి. కొద్దిగా నీళ్ళు పోసి మద్య మద్యలో కలుపుతూ, కొద్దిగా పెరుగు కలిపి మీడియం మంటమీద ఉడకనివ్వాలి.
4. తర్వాత గుడ్లు పగులగొట్టి ఒక పాత్రలో వేసి బాగా గిలక్కొట్టి ఉడుకుతున్న కూరలో కలపాలి. గుడ్లు కూడా ఉడికిన తర్వాత దానిపై యాలకలపొడి, వెన్న వేసి స్టౌ మీద నుండి దించి గార్నిష్ గా కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి అంతే ఇరానీ చికెన్ రెడీ..













