For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ జీర చికెన్ కర్రీ రిసిపి

|

ఎప్పుడూ తయారుచేసిన చికెన్ రిసిపిలను తినితిని బోరు అనిపిస్తోంది . అయితే ఇక్కడ ఒక డెలిషియస్ చికెన్ రిసిపి ఉంది . ఇది పూర్తిగా డిఫరెంట్ టేస్ట్ ను కలిగి ఉంటుంది. ఇక్కడ మీకోసం ఒక కొత్తరకం చికెన్ వంటను అందివ్వండి. ఈ చికెన్ రిసిపిలో చికెన్ ప్రధాన పాత్రపోషిస్తుంది.

ఒక మంచి సువాసన కలిగిన చికెన్ రిసిపి చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు కూడా ఈ చికెన్ రిసిపిని టేస్ట్ చేయాలంటే, తయారుచేసే పద్దతిని ఇక్కడ ఇస్తున్నాము. ప్రయత్నించండి..

Jeera Chicken


కావల్సిన పదార్థాలు:
చికెన్ బ్రెస్ట్: 4 (1 అంగుళాలుగా కట్ చేయాలి)
నెయ్యి: 2tbsp
ఆవాలు: 1tsp
జీలకర్ర పొడి 1tbsp
వైట్ జీలకర్ర: 1tsp
స్ప్రింగ్ ఉల్లిపాయలు -4 (తురుము)
వెల్లుల్లి గుజ్జు 1tbsp
అల్లం గుజ్జు 1tbsp
తాజా పచ్చి మిరపకాయలు: 3(చిన్నసైజ్ లో కట్)
చికెన్ స్టాక్: 1cup (250ml)
టమోటో: 1 కప్ (తరిగిన)
కారం 1tbsp
బెల్ పెప్పర్-1 (ఒక అంగుళం చతురస్రాలు లోకి కట్)
వైట్ ఉల్లిపాయ -1 (దివ్యముగా ముక్కలుగా చేసి)
గరం మసాలా: 1tsp
ఉప్పు మరియు మిరియాలు: రుచికి సరిపడా
కొత్తిమీర: గార్నిషింగ్ కోసం

ఆయిల్ లెస్ జీర చికెన్ ఫ్రై: క్లిక్ చేయండి

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి మీడియం మంట మీద వేగించుకోవాలి. నూనె వేడయ్యాక అందులో ఆవాలు మరియు జీలకర్ర వేసి వేగించుకోవాలి.
2. ఇప్పుడు అందులో జీలకర్ర పొడి, కారం, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి మరియు అల్లం వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయలు మరియు బెల్ పెప్పర్ వేసి వేయించుకోవాలి.
3. తర్వాత అందులో చికెన్ ముక్కలు వేసి 50%వేగే వరకూ ఉడికించుకోవాలి. ఇలా సగభాగం ఉడకడానికి కొంత సమయం తీసుకుంటుంది.
4. తర్వాత అందులో కట్ చేసిన టమోటో ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి.

కుల్చా-జీర పన్నీర్ బెస్ట్ కాంబినేషన్ రిసిపి: క్లిక్ చేయండి

5. తర్వాత అందులో చికెన్ స్టాక్ వేసి, చికెన్ ముక్కలు మొత్తగా ఉడికే వరకూ వేయించుకోవాలి.
6. తర్వాత చివరగా రుచికి సరిపడా ఉప్పు, మరియు పెప్పర్ పౌడర్ వేసి వేయించుకోవాలి. చివరగా కట్ చేసుకొన్న కొత్తమీర తరుగును గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

Story first published: Thursday, January 16, 2014, 11:58 [IST]
Desktop Bottom Promotion