For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కల్మీ కబాబ్ రిసిపి: రంజాన్ స్పెషల్

|

రంజాన్ అంటేనే వివిధ రకాల నాన్ వెజ్ రుచులను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయడమే. ఎందుకంటే ఫాస్టింగ్ ఎంత ముఖ్యమో ఫీస్టింగ్ కూడా అంతే ముఖ్యం. ఈ రంజాన్ సీజన్ లో వివిధ రకాల రుచులను చూడటానికి చాలా కోరిక కలిగి ఉంటారు. రోజంతా ఉపవాసం ఉండటం ఎంత కష్టమో, సాయంత్రం ఉపవాసం తీర్చుకోవడానికి రుచికరమైన వంటలను తినడానికి అంతే ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు.

రంజాన్ సీజన్ లో తయారుచేసే మాంసాహారాల్లో ఒకటి కబాబ్ రిసిపిలు. కబాబ్ రిసిపిలను వివిధ రకాలుగా తయారుచేస్తారు . ఈ కబాబ్ రిసిపిలను టేస్ట్ చూడటానికి చాలా ఎక్సైటింగ్ ఉంటారు. రంజాన్ సీజన్ మొత్తం ప్రతిఒక్కరి ముస్లీం ఇంట్లోనో కబాబ్ రిసిపిలు తప్పకుండా చేస్తారు. అంటువంటి వంటలో కల్మీ కబాబ్ రిసిపి కూడా ఒకటి. మరి దీన్ని ఎలా తయారుచేస్తారో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:

చికెన్: 1kg (మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
పెరుగు: 1cup
కుంకుమపువ్వు: చిటికెడు
నిమ్మకాయ రసం: 1tbsp
మైదా: ¼cup
మసాలా కోసం కావల్సిన పదార్థాలు:
లవంగాలు: 3
ఉల్లిపాయ విత్తనాలు(కాలా జీర): ½tsp
చెక్క: 1
బే ఆకు: 1
మిరియాలు: 5

Kalmi Kebab Recipe: Ramzan Special

తయారుచేయు విధానం:

1. ముందుగా మసాలాకోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటి పాన్ లో వేసి రోస్ట్ చేసుకోవాలి. తర్వాత వీటిని చల్లారినిచ్చి, మిక్సీలో వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి, తడిఆరేవరకూ పక్కన పెట్టుకోవాలి,
3. తర్వత చికెన్ ముక్కలను చిన్న చిన్నగాట్లు పెట్టుకోవాలి.
4. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కుంకుమ పువ్వు, నిమ్మరసం, మైదా మరియు పొడిచేసుకొన్న మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి.
5. ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలను వేసి రెండు మూడు గంటల సమయం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి.
6. తర్వత మైక్రోవేవ్ లోని గ్రిల్స్ కు గ్రిల్ చేసి 15-20నిముషాలు మైక్రోవోవెన్ లో పెట్టాలి.
7. చికెన్ గ్రిల్ క్రింది బాగంలో డ్రిప్ ట్రే పెట్టాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ లోనికి మార్చుకోవాలి.
8. అంతే చికెన్ కల్మీ కబాబ్ రిసిపి రెడీ, వీటితో పాటు ఆనియన్ రింగ్స్, నిమ్మ చెక్కతో గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి.

English summary

Kalmi Kebab Recipe: Ramzan Special

Try to use chicken legs for preparing this kebab recipe. But if you cannot find chicken legs specifically then you can make it with other parts also. It is a delectable kebab recipe to try.
Story first published: Thursday, July 10, 2014, 17:52 [IST]
Desktop Bottom Promotion