For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరిమీన్ కుళంబు(చేపల పులుసు): తమిళనాడు స్టైల్

|

కరిమీన్ కుళంబు (చేపల పులుసు) ఒక అద్భుతమైన రుచి కలిగి నటువంటి తమిళనాడు ఫిష్ కర్రీ. చాలా రుచికరంగా డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. ఫిష్ కర్రీ(చేపల పులుసు) సౌత్ ఇండియాలో చాలా పాపులర్ అయినటువంటి రిసిపి. ఈ వంటను ఎప్పుడూ, చింతపండు, కొన్ని డిఫరెంట్ మసాలా దినుసులతోటి తయారుచేస్తారు. ఈ ఫిష్ కర్రీ, రైస్, ఇడ్లీ మరియు దోసెలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సాధారణంగా ఈ ఫిష్ కర్రీ వండిన రోజుకంటే, మరుసటి రోజున చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి, ఈ ఫిష్ కర్రీని ప్రిజ్ లో ఉంచి మరొసటి రోజు కూడా తినవచ్చు.

అలాగే చేపలతో తయారుచేసిన వంటలు రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా పాపులర్ అయినటువంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని కూడా మీకు అందిరికీ తెలిసిన విషయమే . ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ను తినడం వల్ల గుండె మరియు మెదడును ఆరోగ్యంగా చురుకుగా ఉంచుకోవచ్చు. డిప్రెషన్ తగ్గిస్తుంది మరయిు ఆర్థరైటిస్ ను నివారిస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్ చేర్చుకోండి....

Karimeen Kulambu Recipe: Tamilanadu Style

కావల్సినవి:
చేపలు : 500grms
కొత్తిమీర తరుగు : 1cup
పసుపు : 1/2tsp
టొమాటో : 250grms
బిర్యానీ ఆకు : 1
కరివేపాకు : ఒకరెమ్మ
గరం మసాలా : tbsp
ఉప్పు : రుచికి తగినంత
నూనె : సరిపడా
సాంబార్ ఉల్లిపాయలు: 250grms
మసాలా కోసం:
పచ్చిమిర్చి : 5-8
ఎండుకొబ్బరి తరుము: 1cup
మిరియాలు : 1tbsp
చింతపండు : 50grm
ధనియాలపొడి : 1tbsp
అల్లం పేస్ట్ : 1tsp
వెల్లుల్లిపేస్ట్ : 1tbsp
నూనె : 50ml
సాంబార్ ఉల్లిపాయలు : 250grm

తయారు చేయు విధానం:
1. స్టౌ పై పాన్ పెట్టి, సరిపడా నూనె వేసి, వేడయ్యాక పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి.
2. తర్వాత ధనియాలపొడి, పసుపు, చింతపండుగుజ్జు వేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని పేస్ట్ చేయాలి.
3. మరొక మందపు గిన్నెను స్టౌ మీద పెట్టి మరికొద్దిగా నూనె పోసి, ఉల్లిపాయలు, తమలపాకు, కరివేపాకు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి.
4. అడుగు మాడకుండా కొద్దిగా నీళ్లు పోయాలి. ఈ మొత్తం మిశ్రమం ఉడికిన తర్వాత పేస్ట్ చేసిన మిశ్రమం, చింతపండు గుజ్జు వేసి, కలిపి, ఉడికించాలి.
5. వాసన ఘుమఘుమలాడుతుండగా చేపముక్కలు వేసి, నాలుగు నిమిషాలు ఉంచి, గరం మసాలా, కొత్తిమీర చల్లి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే కరిమీన్ కుళంబు (చేపల పులుసు)రెడీ.

English summary

Karimeen Kulambu Recipe: Tamilanadu Style

Karimeen Curry is authentic Tamilanadu Fish Curry. It is one of the tastiest Fish Curry. Fish Curry is a popular recipe in South India. It is always cooked with the tamarind and chilli powder.It goes well with rice, iddli or dosa. Usually Fish Curry will be tastier on the next day of the gravy prepared. So we may store it in a refrigerator and consume it in the next day also.
Story first published: Friday, March 14, 2014, 12:06 [IST]
Desktop Bottom Promotion