For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీమా పీస్ రైస్: పిల్లలకు పెద్దలకు ఇష్టమైన డిష్

|

మీరు మీ పిల్లలకోసం మరియు బాగా ఆకలిగా ఉన్న మీ భర్త కోసం ఏదైన రుచికరంగా వంటను తయారుచేయానుకుంటే, ఈ కీమా పీస్ రిసిపిని తయారుచేయండి. మటన్ లో విటమిన్స్ మరియ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పెరిగే పిల్లలకు చాలా ఆరోగ్యకరం.

ఈ కీమా పీస్ రిసిపి తయారుచేయడం చాలా సులభం మరియు దీన్ని తయారుచేయడానికి ఎక్కువ సమయం పట్టడు . మీరు చేయాల్సిందల్లా, అందుకు అవసరం అయ్యే కరెక్ట్ పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. మరి మీరు కూడా దీన్ని టేస్ట్ చేయాలంటే వెంటనే దీన్ని రుచి చూడండి.

Keema Peas Recipe: A Dinner Delight

కావల్సిన పదార్థాలు:
కీమీ: 500grms
దాల్చిన చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 2
బ్లాక్ యాలకులు: 2
అల్లం: 2tsp(తురుము)
గ్రీన్ యాలాకులు: 2
పచ్చిమిర్చి: 2(మద్యకు కట్ చేసుకోవాలి)
కారం: 1tsp
ధనియాల పొడి: 2tsp
ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటో: 2పెద్దవి(గుజ్జు చేసుకోవాలి)
పచ్చిబఠానీలు: 1/2cups
గరం మసాలా: 1/2tsp
పసుపు: 1/2tsp
బిర్యానీ ఆకు: 1
నూనె : 2btsp
నీళ్ళు: 1/2cup
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: గార్నిష్ చేయడానికి

తయారుచేయు విధానం:
1. స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి, మీడియంగా మంట పెట్టి పాన్ లో నూనె వేసి బాగా వేడయ్యే వరకూ ఉంచాలి.
2. తర్వాత అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, బ్లాక్ యాలకులు, గ్రీన్ యాలకులు మరియు లవంగాలు వేసి 30సెంకడ్స్ వేయించుకోవాలి.
3. తర్వాత అందులో ఉల్లిపా ముక్కలు మరియు కొద్దిగా ఉప్పు వేసి వేయించాలి. మూత పెట్టి చాలా తక్కువ మంట మీద 10నిముషాలు వేయించుకోవాలి.
4. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి వేసి 10నిముషాలు వేయించుకోవాలి. వెల్లుల్లి పింక్ కలర్ లోకి మారే వరకూ వేయించుకోవాలి.
5. తర్వాత అందులో పచ్చిమిర్చి టమోటోముక్కలు కూడా వేసి 5నిముషాలు వేయించుకోవాలి.
6. ఇప్పుడు మూత తీసి నూనె పైకి తేలుతుండటం మీరు గమనించిన తర్వాత అందులో కొద్దిగా కారం, ధనియాల పొడి, పసుపు, మరియు జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసి తర్వాత మంట తగ్గించి వేయిస్తుండాలి.
7. చివరగా కీమా మరియు నీళ్ళు మరియు ఉప్పు వేసి మిక్స్ చేసి మూత పెట్టాలి.
8. తర్వాత మీడియం మంట పెట్టి కీమా 20నిముషాలు బాగా ఉడికించుకోవాలి. తర్వాత కట్ చేసిన కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే మీ కీమా పీస్ రిసిపి రెడీ. దీన్ని తందూరి రోటీ లేదా టమోటో రైస్ తో తిని ఎంజాయ్ చేయవచ్చు.

English summary

Keema Peas Recipe: A Dinner Delight

If you are wondering what to cook for your kids and hungry husband when he returns from work, you should try this keema peas recipe. Mutton is rich in vitamins and iron, which is healthy for a growing child.
Story first published: Tuesday, January 21, 2014, 12:38 [IST]
Desktop Bottom Promotion