For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేరళ స్టైల్ ఎగ్ రోస్ట్ : స్పెషల్ టేస్ట్

|

కేరళ స్టైల్ ఎగ్ రోస్ట్ ఇది ఒక అద్భుతమైన రుచి కలిగిన ఎగ్ రోస్ట్ రిసిపి. దీన్ని తయారుచేయడం చాలా సులభం, మరియు రైస్, చపాతీ, ఇడియప్పంకు బెస్ట్ సైడ్ డిష్ గా కేరళీలయు ఎక్కువగా తీసుకుంటారు.

ఎగ్ తో తయారుచేసే వంటల్లో ఇది ఒక స్టైల్ రిసిపి. ఒక డిఫరెంట్ టేస్ట్ చూడాలంటే, ఇతర రాష్ట్రాల్లో తయారుచేసే మన రెగ్యులర్ వంటలినే డిఫరెంట్ గా తయారుచేసి తీసుకోవడం వల్ల ఒక కొత్త రుచిని ఆస్వాదించవచ్చు. మరి ఈ టేస్టీ డిఫరెంట్ స్టైల్ కేరళ ఎగ్ రోస్ట్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

egg roast

కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 4(బాగా ఉడికించి, పొట్టు తీసి, సన్నగా గాట్లు పెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 2 (సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2(మద్యకు కట్ చేసి పెట్టుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
టమోటోలు: 2(పెద్దవి సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కారం: 1 to 2tsp
బ్లాక్ పెప్పర్ పౌడర్: 1/2tsp
కొత్తిమీర : 1tsp
గరం మసాల: చిటికెడు
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2-3tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మందపాటి పాన్ స్టౌ మీద పెట్టి, నూనె వేసి కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి . తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
2. తర్వాత అందులో కరివేపాకు, కారం, ధనియాలపొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్ మరియు ఉప్పు వేసి మిక్స్ చేయాలి.
3. తర్వాత టమోటో ముక్కలు వేసి మరో 6నిముషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో నీళ్ళు, బాయిల్డ్ ఎగ్స్ వేసి మూత పెట్టి మరో 10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు మూత తీసి, అందులో గరం మసాలా పౌడర్ కూడా వేసి మరో 2లేదా 3నిముసాలు ఫ్రై చేసుకోవాలి . తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి మార్చుకొని చపాతీ లేదా ఇడియప్పంతో తినాలి.

English summary

Kerala Style Egg Roast

Egg roast with appam is the quintessential Kerala-style breakfast. Egg roast or mutta roast is is very easy and delicious egg recipe from kerala.
Story first published: Friday, April 24, 2015, 15:12 [IST]
Desktop Bottom Promotion