For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాజుర్ గోష్ట్ : బక్రీద్ స్పెషల్

|

ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో రంజాన్ పండుగ మైదటిదైతే..బక్రీద్ రెండవదిగా నిలిచింది. ముస్లింలు బక్రీద్‌ను ఖుర్భాని పండుగ అని కూడా అంటారు. బక్రీద్ పండుగ రోజు ముస్లిం పవిత్ర స్థలమైన మక్కాలో హజ్ యాత్ర జరుగుతుంది. ముస్లిం సోదరులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో రంజాన్ పండుగ మైదటిదైతే..బక్రీద్ రెండవదిగా నిలిచింది. ఈద్‌గాలో నమాజు ముగుస్తుంది. అందరినీ చల్లగా చూడమని కోరే దువా ముగుస్తుంది. ఆ తర్వాత ఈద్ ముబారక్ చెప్పుకునే అలాయి బలాయి ముగుస్తుంది.

ఆ తర్వాత..? ఇంకేముంది... విందులూ వినోదాలే. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, అయినవాళ్లు... అందరూ కలిసి దావత్‌లో కూచుంటారు. మతాలు మర్చిపోయే క్షణాల్లో అందరూ ఆత్మీయులైపోతారు. మటన్, చికెన్, రోటీ, సేమ్యా... ఘుమఘుమలాడే పదార్థాల మధ్య మాటలు నంజుకుంటారు. నవ్వులు పంచుకుంటారు. పండుగలు ఉండాలి. ఒకరి పండుగలో మరొకరి లోగిలి కళకళలాడాలి. ఆ బహార్ కోసం ఒక స్పెషల్ వంట మీకోసం....

Khajur Gosht: The Taste Of Awadh

కావల్సిన పదార్థాలు:

మటన్: 1kg
ఎండు ఖర్జూరం: 12
ఉల్లిపాయలు: 3(సన్నగా తరిగినవి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2tbsp
జీడిపప్పు పేస్ట్: ½cup
పసుపు పొడి: 1tsp
కారం పొడి: 1tsp
ధనియాల పొడి: 2tsp
గ్రీన్ ఏలకుల పొడి: ½tsp
గరం మసాల పొడి: ½tsp
నిమ్మరసం: 2tbsp
బిర్యానీ ఆకులు: 2
Kewda వాటర్: 2-3చుక్కలు
నూనె: 3tbsp
నెయ్యి:1tsp
నీళ్ళు: 1cup

తయారుచేయు విధానం:

1. ముందుగా మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో ఒక చెంచా నూనె వేసి, బిర్యానీ ఆకు వేసి ఒక నిముషం వేగించాలి.
3. తర్వాత అందులో కట్ చేసుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి 5 నిముషాలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులోనే పసుపు, జీడిపప్పు పేస్ట్, మటన్ ముక్కలు, ఉప్పు, నీళ్ళు, వేసి బాగా మిక్స్ చేసి మరో 10నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
5. ఇప్పుడు కుక్కర్ కు మూత పెట్టి తక్కువ మంట మీద 4-5విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
6. ఒకసారి ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
7. మరో పాన్ తీసుకొని అందులో నూనె వేసి, అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు నిముషాలు వేగించాలి.
8. తర్వాత అందులో కారం, ధనియాలపొడి కూడా వేసి మరొక నిముషం వేగించుకోవాలి.
9. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ మూత తీసి ఉడికిన మటన్ ను నీరుతో సహాయపోయాలి.
10. తర్వాత అందులోనే ఎండు ఖర్జూరం వేసి బాగా మిక్స్ చేసి మీడియం మంట మీద 5నిముషాలు ఉడికించుకోవాలి.
11. చివరగా యాలకల పొడి, గరం మసాలా, నిమ్మరసం, కెవడా వాటర్ అన్నింటినీ వేసి మిక్స్ చేసి మరో 5 నిముషాలు ఉడికించి, నెయ్యి వేసి మిక్స్ చేసిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఖాజుర్ గోష్ట్ రెడీ. ఈ రుచికరమైన మటన్ డిష్ ను రోటీ లేదా పులావ్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Khajur Gosht: The Taste Of Awadh


 Awadhi cuisine has a distinction of its own. The Mughal cooking techniques and the use of fragrant Indian spices make the Awadhi cuisine stand out from the rest in the world of cookery and food. The varieties of kebabs, biryanis, kormas and sweets can only be found in the Awadhi cuisine.
Story first published: Monday, October 6, 2014, 13:04 [IST]
Desktop Bottom Promotion