For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మటన్ కర్రీ : బెంగాలీ స్పెషల్ రిసిపి

|

బెంగాలీయులకు అతి ప్రీతికరమైన వంట కోష మాంగ్షో. ఈ బెంగాలీ స్టైల్ మటన్ కర్రీ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. బెంగాల్ కోష మాంగ్షో అంటే చాలా నిధానంగా అంటే ఎక్కువ సమయం తక్కువ మంట మీద చికెన్ ఉడికించి తయారుచేస్తారు. ఈ మటన్ కర్రీనీ తయారుచేయడం చాలా సులభం మరియు చాలా సింపుల్ గా తయారుచేసే ఈ వంట రుచికరంగా ఉంటుంది.

ఈ మటన్ రిసిపి ప్రత్యేకత ఏంటంటే, ఈ మటన్ రిసిపికి కొద్దిగా కూడా నీరు జోడించకుండా తయారుచేస్తారు . ఎక్కువ సమయం ఉడికించడం వల్ల ఈ వంటకు ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది మరియు ట్రెడిషినల్ గా కూడా ఉంటుంది. మరికెందుకు ఆలస్యం వెంటనే దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం....

Kosha Mangsho: Bengali Mutton Curry: Telugu Vantalu

కావల్సిన పదార్థాలు:
మటన్- 1kg (మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు- 4
అల్లం-వెల్లుల్లి పేస్ట్- 1tbsp
పెరుగు- 1 cup
టమోటో- 1

READ MORE: షహీ మటన్ కుర్మా రిసిపి: రంజాన్ స్పెషల్
జీలకర్ర పొడి- 1tbsp
ధనియాలపొడి- 1tbsp
కాశ్మీరి రెడ్ చిల్లీ పౌడర్- 1tsp
పసుపు- 1tsp
గరం మసాలా పొడి- 1tsp
బిర్యానీ ఆకు- 2
దాల్చిన చెక్క- 1
యాలకలు- 3
లవంగాలు- 5
పంచదార- 1tsp
ఉప్పు - రుచికి పరిపడా
ఆవనూనె- 2tbsp
కొత్తిమీర- 2tsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి)

READ MORE: మటన్ రిసిపి : డాబా స్టైల్

తయారుచేయు విధానం:
1. ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
2. తర్వాత మటన్ కు కొద్దిగా పెరుగు, ఉప్పు, కారం, పసుపు, మరియు ఒక చెంచా ఆవాలు వేసి మిక్స్ చేసి మ్యారినేట్ చేసి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
3. అంతలోపు ఉల్లిపాయలు మరియు టమోటోలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. రెండు గంటల తర్వాత ఆవనూనెను వేడి చేసి అందులో దాల్చిన చెక్క, యాలకలు, బిర్యానీ ఆకు, లవంగాలు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ, టమోటో పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకూ 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర మరియు ధనియాలపొడి వేసి 5 నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న మటన్ ముక్కలు మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి . 5నిముషాలు పూర్తిగా మిక్స్ చేస్తూ పెట్టుకోవాలి.

READ MORE: మటన్ కుర్మ: హైదరాబాది స్పెషల్

8. మంటను పూర్తిగా తగ్గించి తర్వాత పాన్ కు మూత పెట్టాలి.
9. 45 నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.
10. మటన్ మెత్తగా ఉడికిన తర్వాత అందులో గరం మసాలా పౌడర్ వేసి మిక్స్ చేయాలి.
11. మటన్ పూర్తిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఈ నోరూరించే వంటను పులావ్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

Story first published: Wednesday, July 8, 2015, 13:49 [IST]
Desktop Bottom Promotion