For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేరళ స్టైల్ ఎండు చేపల పులుసు: స్పెషల్ టేస్ట్

|

ఫిష్ కర్రీలలో కేరళ స్టైల్ ఫిష్ కర్రీలు చాలా టేస్ట్ గా ఉంటుంది. డిఫరెంట్ గా కూడా తయారుచేస్తారు. కేరళ వంటలు కొంచెం స్పెషల్ గా తయాచేయబడి ఉంటాయి. కొట్టాయం ఫిష్ కర్రీ, ఒరిజినల్ వంట కొట్టాయం ప్రదేశంలో ఎక్కువగా తయారుచేస్తారు, ఈ వంటలు చాలా డిఫెరెంట్ టేస్ట్ ను కలిగి ఉంటాయి. కాబట్టి, ఈ వంటలకు కొట్టాయం ఫిష్ కర్రీ అని పేరు.

ఈ ఫిష్ కర్రీకి ఒక ప్రత్యేకత ఉంది, అదేంటటే ఎండిన చేపలతో తయారుచేస్తారు. కేరళలలో తయారుచేసే ఇతర ఫిఫ్ కర్రీల కంటే, కొట్టాయం ఫిష్ కర్రీలను చాలా తక్కువ గ్రేవీతో తయారుచేస్తారు. ఇది చూడటానికి ఫ్రైడ్ మసాలలాగా కనబడుతుంది. కొట్టాయం ఫిష్ కర్రీని చాలా తక్కువ నీటితో శుభ్రం చేస్తారు. అలాగే ఈ ఫిష్ కర్రీకి కొబ్బరి కూడా ఉపయోగించరు. అయితే కూడా టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. మరో ప్రత్యేకతఏంటే, ఈ ఫిష్ కర్రీక్ మలబార్ చింతపండు రసాన్ని ఉపయోగిస్తారు. మరి ఈ స్పెషల్ టేస్ట్ ఫిష్ కర్రీనీ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Kottayam Dry Fish Curry From Kerala

కావల్సిన పదార్థాలు:
సాల్మన్ ఫిల్లెట్స్: 12
కరివేపాకు: 3,4 రెమ్మలు
తెల్ల ఉల్లిపాయలు: 2సన్నగా తరిగినవి
వెల్లుల్లి రెబ్బలు: 6(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
అల్లం: చిన్న ముక్క
పసుపు: 1/2tsp
కారం: 1tbsp
పెప్పర్ పౌడర్: 1tbsp
మలబార్ చింతపండు: 2(నీటిలో నానబెట్టుకోవాలి)
కొబ్బరి నూనె: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ లో కరివేపాకు పరవాలి. తర్వాత శుభ్రం చేసిన సాల్మన్ ఫిష్ ఫిల్లెట్ తీసుకొని వాటి మీద ఉప్పు రుద్ది, వాటిని కరివేపాకు మీద పరవాలి.
2. తర్వాత మూత పెట్టి మరో 20 నిముషాలు అలాగే పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మలబార్ చింతపండును అరకప్పు నీటిలో వేసి, నానబెట్టుకోవాలి.
4. అంతలోపు స్టౌ మీద పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో కరివేపాకు, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు ఒక దాని తర్వాత ఒకటి వేసి మీడియం మంట మీద వేగించుకోవాలి.
5. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ కు మారగానే అందులో అల్లం వెల్లుల్లి కూడా వేయాలి. మరో రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులో పెప్పర్ వేసి మరో నిముషం వేగించుకోవాలి. ఎక్కువ మంటమీద ఎక్కువ సేపు వేయించకూడదు లేదా మిరియాల పొడి, మాడిపోవడం జరుగుతుంది.
7. ఇవన్నీ వేగిన తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న ఫిష్ ఫిల్లెట్ వేసి, మసాలాతో బాగా మిక్స్ అయ్యేలా వేయించుకోవాలి.
8. తక్కువ మంట మీద నిధానంగా వేయిస్తూ, నీళ్ళల్లో నానబెట్టుకొన్న మలబార్ చింతపండును చేత్తో బాగా పిసికి గుజ్జును సపరేట్ చేసి, వేగితున్న చేపల మిశ్రంలో పోయాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్లు కూడా అందులో పోసుకోవాలి..
9. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి కలియ బెట్టి, మూత పెట్టి 5నిముషాలు ఉడికించుకోవాలి. అంతే కొట్టాయం ఫిష్ కర్రీ తినడానికి రెడీ.

English summary

Kottayam Dry Fish Curry From Kerala

Fish constitutes a major part of Kerala recipes and every region has its own special fish curry. Kottayam fish curry owes its name to coastal region of Kottayam in Kerala. This fish curry recipe is special because it is dry. Unlike other Kerala recipes, Kottayam fish curry does not have lots of gravy; it is more like a fried masala with fish.
Story first published: Saturday, February 1, 2014, 16:20 [IST]
Desktop Bottom Promotion