For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లోఫ్యాట్ దేశీ చికెన్ మసాలా: టేస్టీ అండ్ హెల్తీ

|

మాంసాహార ప్రియులకు చికెన్ చాలా ఇష్టమైన ఆహారం. సాధారణంగా, చికెన్ వంటలను తయారుచేయడానికి వివిధ రకాల పద్దతులున్నాయి. ప్రస్తుత రోజుల్లో బరువు తగ్గించుకోవాలనుకొనే వారుకు కూడా లోఫ్యాట్ చికెన్ రిసిపిలను ఎంపిక చేసుకోవచ్చు. అయితే, బరువు తగ్గించుకోవడానికి, లోఫ్యాట్ చికెన్ ఎంపిక చేసుకుంటున్నారు. ఎవరు కూడా క్రీమ్ మరియు అధిక మసాలా ఉన్న డిష్ లను ఎంపిక చేసుకోవడం లేదు. చాలా మంది, చాలా సింపుల్ వంటకాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు.

కాబట్టి, అటువంటి వారికోసం లోఫ్యాట్ , దేశీచికెన్ మసాలా రిసిపి మీరు తయారుచేయడానికి ఇక్కడ అందిస్తున్నాం. ఇది హెల్తీ మరియు లోక్యాలరీ ఫుడ్ రిసిని, దీన్ని తయారుచేయడం కూడా చాలా సులభం. మరియ ఈ లోఫ్యాట్ దెశీ చికెన్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Low Fat Desi Chicken Masala Recipe

చికెన్
కావల్సిన పదార్థాలు:

చికెన్ : 1kg(మీడియం సైజ్ లోకి కట్ చేసుకోవాలి)
మ్యారినేషన్ కోసం:
లోఫ్యాట్ పెరుగు : 1cup
ఉల్లిపాయ పేస్ట్: 1tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
పసుపు: ½ tsp
ఉప్పు: రుచికి సరిపడా

గ్రేవీ కోసం :
ఉల్లిపాయలు: 4(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం: 1కొద్దిగా (తురుముకోవాలి)
వెల్లుల్లిపాయలు: 10
పసుపు: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 1tbsp
జీలకర్ర పొడి: 1tbsp
పెప్పర్: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
జీలకర్ర : 1tsp
బే ఆకులు: 2
జీలకర్ర: 2tsp
ధనియాలు: 2tsp(పొడి చేసుకోవాలి)
పంచదార: ½ tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 2tbsp
వెచ్చని నీళ్ళు: 1 ½cups
కొత్తిమీర: తరుగు: 2tbsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

తయారుచేయు విధానం :
1. ముందుగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలు నీటిలో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఈ చికెన్ ముక్కలను ఒక బౌల్లో వేసి, పసుపు, పచ్చిమిర్చి, పెరుగు, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా చికెన్ ముక్కలకు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి.
3. అరగంట తర్వాత ప్రెజర్ కుక్కర్ లో నూనె వేసి, వేడయ్యాక , అందులో జీలకర్ర, ధనియాల పొడి, మరియు బిర్యానీ ఆకులు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
4. తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
5. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
6. ఇప్పుడు అందులో మ్యారినేట్ చికెన్ వేసి బాగా మిక్స్ చేయాలి.
7. తర్వాత అందులో జీలకర్రపొడి, ధనియాల పొడి, ఉప్పు, పంచదార, పెప్పర్ పౌడర్ వేసి 7-8నిముషాలు వేగించుకోవాలి . ఇప్పుడు అందులో నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
8. ఇప్పుడు మూత పెట్టి మీడియం మంట మీద 3విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
9. తర్వాత ఆవిరి పూర్తిగా తగ్గింతే వరకూ ఉండి తర్వాత మూత తీసి, అందులో గరం మాసాలా పౌడర్ వేసి, బాగా మిక్స్ చేయాలి.
10. చివరగా సన్నగా తరిగి పెట్టుకొన్న కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి.
అంతే డెలిషియస్, దేశీ చికెన్ రిసిపి రెడీ. ఈ చికెన్ రిసిపిన రోటీ లేదా రైస్ తో సర్వ్ చేయాలి .

English summary

Low Fat Desi Chicken Masala Recipe

Chicken is the most preferred item among most non-vegetarian foodies. Naturally, there are numerous ways of preparing a chicken dish.
Story first published: Tuesday, November 26, 2013, 11:55 [IST]
Desktop Bottom Promotion