For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మచ్చర్ జాల్ : స్పైసీ బెంగాలీ ఫిష్ కర్రీ

|

బెంగాలీ వంటలు ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి . తయారుచేయడానిికి చాలా సింపుల్ గానే ఉండే వంటలు, రుచిలో మాత్రం గ్రేట్ గా ఉంటాయి . బెంగాలీ వంటల్లో ఫిష్ వంటలకు పత్యేక ప్రాధాన్యత ఉంది. స్పైసీ ఫిష్ వంటలో మస్టర్డ్ ఫిష్ కర్రీ చాలా ఫేమస్. దీన్నే బెంగాల్లో మచ్చర్ జాల్ అంటారు. ఈ మచ్చర్ జాల్ ఫిష్ కర్రీ చాలా సింపుల్ గా ఉంటుంది. అయితే మన స్టైల్లో ఈ ఫిష్ కర్రీని ఎలా తయారుచేయాలో ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. మచ్చర్ జాల్ ఫిష్ కర్రీకి చిన్న చేపలు, తెలాపియ, పబ్దా, టాగ్రా మొదలగు చేపలతో ఎక్కువగా వండుతారు. మచ్చర్ జాల్ స్పైసీ రిసిపి మరి మీరు కూడా టేస్ట్ చేయాలంటే, ఎలా తయారుచేయాలో చూడండి..

Machcher Jhaal: Spicy Bengali Fish Curry

కావల్సిన పదార్థాలు:
చేపలు(పబ్దా): 4పీసెస్
ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
టమోటో: 1(సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి: 3(సన్నగా తరిగినవి)
కారం: 1tsp
పసుపు: 1/2tsp
జీలకర్ర పొడి 1tsp
ధనియాలపొడి : 1/2tsp
కలౌంజి: 1/2tsp
బిర్యానీ ఆకు: 1
కొత్తిమీర : కొద్దిగా(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నూనె: 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు వేసి 10నిముషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఫిష్ ముక్కలు వేసి నిదానంగా అన్ని వైపులా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత అదే నూనెలో బిర్యానీ ఆకు, కలౌంజి, పచ్చిమిర్చి వేసి వేగించాలి.
5. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. ఆ తర్వాత అందులో టమోటో ముక్కులు కూడా వేయాలి.
7. ఇప్పుడు మసాలా పౌడర్లతో కారం, పసుపు, జీలకర్ర పొడి, మరియు ధనియాల పొడిలతో పాటు కొద్దిగా ఉప్పును కూడా చిలకరించి మరికొన్ని నిముషాలు మొత్తం మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి.
8. తర్వాత అందులో ఒక కప్పు నీళ్ళు పోసి మొత్తం కలగలిపి గ్రేవీని చిక్కగా ఉడకనివ్వాలి.
9. చివరగా ముందుగానే ఫ్రై చేసి పెట్టుకొన్న చేప ముక్కలను వేసి మిక్స్ చేసి తక్కువ మంట మీద 5నిముషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే కొత్తిమీర తరుగుతో గార్నిస్ చేసి సర్వ్ చేయాలి.

English summary

Machcher Jhaal: Spicy Bengali Fish Curry

Machcher jhol is made with common styles of fish such as rohu, katla etc. The spicy version of Bengali fish curry recipe or machcher jhaal recipe is usually reserved for smaller fish such as telapia, pabda, tangra etc. Machcher jhaal is a spicy dish because the word 'jhaal' literally means 'spicy' in Bengali.
Story first published: Monday, June 9, 2014, 18:00 [IST]
Desktop Bottom Promotion