For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంగళూరు ఫిష్ కర్రీ: సౌంత్ ఇండియన్ స్పెషల్

|

ఫిష్‌తో చేసిన ఐటమ్స్ తినడానికేం...? చేప ఈదినంత వీజీగా రెండు చేతులా ఎడాపెడా ఆరగించవచ్చు. కాకపోతే కాస్త ముల్లూ గిల్లూ చూసుకోవాలంతే. ఫిష్ కర్రీ తయారు చేయడం చాలా సులభం. అది మంగళూర్ ఫిష్ కర్రీలు, ఫ్రైలు చాలా వెరైటీ రుచులతో ఉంటాయి. అక్కడికి వెళ్ళ పర్యాటకుల ఇలాంటి రుచులును చాలా ఇష్టంగా తింటుంటారు. మంగళూర్ స్పెషల్ కొబ్బరి పాలతో తయారు చేసే వారి వంటలు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫిష్ కర్రీకి సౌత్ ఇండియన్ స్పైసీ కలిపితే మరింత రుచికరంగా ఉండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అటువంటి రుచిని మనం ఇట్లో తయారు చేసుకొనొ మంగళూర్ రుచులను ఆస్వాదిద్దాం..

ఫిష్: ½kg
ఉల్లిపాయలు: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
ధనియాలు: 2tbsp
ఎండు మిర్చి: 9 to 10
కొబ్బరి తురుము: 2 cups
అల్లం: చిన్న ముక్క
చింత గుజ్జు: 2tbsp
పచ్చిమిర్చి: 5-6(మధ్యకు కట్ చేసుకోవాలి)
కొబ్బరి పాలు: 1/2 cup(పచ్చికొబ్బరిని తురిమి గ్రైడ్ చేసి అందులో నీరు పోసి వడగట్టుకోవాలి)
నూనె: 2tbsp
గరం మసాలా: 1tbsp
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా

Mangalore Fish Curry

తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. ఇప్పుడు అందులో ఎండు మిర్చి మరియు ధనియాలు వేసి లైట్ గా వేయించుకోవాలి.
2. తర్వాత ఒక కప్పు నీటిని వేడి చేసి అందులో చింత పండు వేసి ఐదు నిముషాలు నానబెట్టి తర్వాత చేత్తో బాగా కలిపి గుజ్జు తయారు చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు వేయించి పెట్టుకొన్న ఎండు మిర్చి, ధనియాలు, కొబ్బరి పాలు, చింత గుజ్జు, అల్లం వేసి మెత్తగా గ్రైడ్ చేసుకోవాలి.
4. తర్వాత పాన్ లో నూనె వేసి ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత పేస్ట్ చేసి పెట్టుకొన్ని మసాల ముద్దను వేసి ఫ్రై చేయాలి.
5. అందులోని పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి ఫ్రై చేయాలి. తర్వాత రెండు కప్పుల నీళ్ళు పోసి బాగా ఉడికించాలి.
6. గ్రేవి బాగా ఉడికి చిక్కబడే సమయంలో చేప ముక్కలను వేసి ఐదు నుండి పది నిముషాల మాత్రమే ఉడికించుకోవాలి. అంతే మంగళూర్ ఫిష్ కర్రీ రెడీ.

English summary

Mangalore Fish Curry: South-Indian Recipe | మంగళూరు ఫిష్ కర్రీ-స్పెషల్ టేస్ట్

Fish is considered to be a healthy food for all ages. The nutritional benefits of fish are many. It has the ability to cure diseases related to heart, eyes and liver. Fish oil, as we know has a natural solution to revitalize ageing skin, promote more vibrant and youthful skin, prevent eczema and psoriasis. Unlike other meat, fish is a lighter meat and has low fat content. Minerals, amino acids, proteins & vitamins are found abundant in fish and essential for the body too.
Story first published: Saturday, February 2, 2013, 12:27 [IST]
Desktop Bottom Promotion