For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోరూరించే మ్యాంగో చికెన్ కర్రీ సమ్మర్ స్పెషల్

|

ఈ కాలంలో అందరి కళ్లు మామిడి చెట్లమీదే. ఆకుల మధ్యన వేలాడే పచ్చి మామిడికాయలను చూడగానే ఎంతటివారికైనా నోట్లో నీళ్లు ఊరుతాయి. పుల్లటివైతే పప్పులో వేసుకుంటారు. కాస్త పులుపు తక్కువగా ఉంటే ప్లేట్లో ఉప్పు, కారం వేసుకుని లాగిచేస్తారు. కాయలు పళ్లయ్యేవరకూ ఆగడమంటే చాలా కష్టం. రెండు కాయలందుకుంటే గాని మనసు ఊరుకోదు. సి విటమిన్‌తో పాటు వేసవిలో ఒంటికి చలువ చేసే పచ్చిమామిడితో పప్పు, పులుసే కాకుండా బోలెడన్ని వెరైటీ వంటలు చేసుకోవచ్చు.

లేత మామిడికాయలు మార్కెట్లోకి వచ్చాక మరో కూరగాయ ఏదైనా వంటింట్లోకి రావాలంటే వెనకా ముందు చూసుకోవాల్సిందే! ఏ కూర వండినా మామిడికాయను జత చేస్తే కొత్త టేస్ట్‌తో ఇంటిల్లిపాది నోళ్లు ఊరాల్సిందే! వెజిటేరియన్ తో మాత్రమే కాదు నాన్ వెజిటేరియన్ తో నైస్ గా కలిసిపోయే ఈ పుల్ల పుల్లని మామిడికాయలతో జిల్ అనిపించేలా...ఫుల్ గా ఇంటిల్లి పాదికి అంధించండి.

Mango Chicken Curry For Summer Blast!

కావల్సిన పదార్థాలు:

చికెన్ (ఎముకలు లేని): 500gms
బేబీ ఉల్లిపాయలు: 2(పేస్ట్)
మామిడి: 1 (పొట్టు తీసి మరియు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
కొబ్బరి: 1cup(తురిముకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 2-4
అల్లం: ఒక చిన్న ముక్క
పచ్చిమిర్చి: 2
ఎండు మిర్చి: 2
సోపు సీడ్: 1tsp
పసుపు: 1tsp
కారం:1tsp
ఆవాలు: 1tsp
ఏలకులు: 4
దాల్చిన చెక్క: చిన్న ముక్క
బిర్యాని ఆకు: 1
నూనె: 3 tbsp
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం మరియు ఎండుమిర్చిని మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2. తర్వాత ఈ పేస్ట్ ను చికెన్ కు పట్టించాలి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ ను రాత్రంతా ఫ్రిజ్ లో పెట్టాలి.
3. ఇప్పుడు పాన్ లో కొబ్బరి తురుము, మరియు ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ లో మారుతు పచ్చివాసన పోయి, మంచి వాసన రావడం మొదలవుతుంది అప్పుడు, స్టౌ ఆఫ్ చేసి, పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో కొద్ది నూనె వేసి కాగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, యాలకలు, చెక్క, ఆవాలు మరియు సోంపు వేసి మీడియం మంట మీద ఫై చేసుకోవాలి.
5. ఇప్పుడు ఆ పోపులో రాత్రి మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ను అందులో వేసి, తక్కువ మంట మీద 5-10నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. ఫ్రై చేస్తున్నప్పుడు, కర్రీ నుండి నూనె సపరేట్ అయినప్పుడు, అందులో ఫ్రైచేసుకొన్న కొబ్బరి, ఉల్లిపాయపేస్ట్ వేసి, అలాగే వీటితో పాటు, మసాలాలు కూడా వేసి అన్నింటిని కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకొన్న మామిడికాయ ముక్కలు వేసి మిక్స్ చేసి 2 కప్పుల నీళ్ళు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మరో పది నిముషాల తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే మ్యాంగో చికెన్ కర్రీ రెడీ. సమ్మర్ స్పెషల్ గా మ్యాంగో చికెన్ రిసిపిని వేడి వేడి అన్నంతో సర్వ్ చేయండి.

English summary

Mango Chicken Curry For Summer Blast!


 Mango chicken is undeniably a specialty of the coasts. This Indian curry recipe is characteristically more popular in the island city of Mumbai and the 'gaons' of Goa. Chicken embroiled in rich mango curry could only be delicious but it is a very summer specific recipe. The best time to try this Indian curry recipe with chicken is when the mangoes are just about half ripe (which is now, in the month of March).
Story first published: Saturday, April 5, 2014, 17:04 [IST]
Desktop Bottom Promotion