For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరాఠీ ప్రాన్ కర్రీ: సీఫుడ్ స్పెషల్

|

ప్రాన్ కర్రీ ఒక బెస్ట్ ఫేవరెట్ రిసిపి. ఈ రిసిపి ప్రతి నాన్ వెజిటేరియన్స్ కు తప్పకుండా నచ్చుతుంది. ముఖ్యంగా ఇది సీఫుడ్ అంటే ఇష్టపడే వారికి ఇది తప్పకుండా నచ్చుతుంది . మనం ఎప్పుడు తయారుచేసే పద్దతిలోనే సీఫుడ్ ను తయారుచేయడం వల్ల మనకి బోర్ అనిపించవచ్చు. అటువంటప్పుడు ఇలాంటి ఒక టేస్టీ డిష్ ను తయారు చేసుకుంటే ఒక కొత్త రుచిని రుచి చూడవచ్చు. ఈ మరాఠీ స్పెషల్ ప్రాన్ కర్రీ చాలా టేస్ట్ గా డిఫరెంట్ టేస్ట్ ను కలిగి ఉంటుంది.

మరాఠీ ప్రాన్ కర్రీ ఒక రెస్టారెంట్ ఫేవరెంట్ ఫుడ్. ఈ ప్రాన్ కర్రీని తయారుచేయడం అంత కష్టమైన పనేం కాదు. దీన్ని చాలా త్వరగా మరియు సులభంగా, తయారుచేయవచ్చు. ఈ మరాఠీ ప్రాన్ రిసిపిని మొదట ప్రాన్స్ ను మ్యారినేట్ చేసుకొని తర్వాత గ్రేవీ తయారుచేసుకొని మిక్స్ చేయాలి. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Marathi Prawn Curry

కావల్సిన పదార్థాలు:
ప్రాన్స్: 10(షెల్ తొలగించి పక్కన పెట్టుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 10(పేస్ట్ )
అల్లం: 1 అంగుళం (పేస్ట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి : 5 (పేస్ట్ చేసుకోవాలి)
కరివేపాకు: రెండు రెమ్మలు
కారం పొడి: 1tsp
పసుపు: ½ tsp
గరం మసాలా: 1tsp
టమోటో గుజ్జు: 2tbsp
చింతపండు పేస్ట్ : 1cup
కొబ్బరి తురుము: 1cup
కొత్తిమీర కొద్దిగా: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నూనె: 4tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని మెత్తగా పేస్ట్ చేసి, అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకొన్న ప్రాన్స్(రొయ్యలకు)మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి.
2. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న రొయ్యలను కనీసం అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో కరివేపాకు వేసి ఒక నిముషం తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న ప్రాన్స్ ను అందులో వేసి మీడియం మంట మీద 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రాన్స్ ను ఎక్కువగా ఫ్రై చేయకూడదు.
4. రొయ్యలు బ్రౌన్ కలర్లో వేగుతున్నప్పుడు అందులో టమోటో గుజ్జు వేసి బాగా మిక్స్ చేస్తూ తక్కువ మంట మీద మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు రెండు కప్పుల నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని ఉడికించుకోవాలి.
6. గ్రేవీ ఉడుకుతుండగా అందులో చింతపండు పులుసు వేసి మరో 5-6 నిముషాలు ఉడికించుకోవాలి.
8. చివరగా తాజాకొబ్బరి తురుము మరియు కొత్తమీర తురుము వేసి బాగా మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేయాలి.

English summary

Marathi Prawn Curry


 Maharashtrian cuisine is not just about thalipeeth and puran poli. They do have a number of excellent seafood recipes in their cuisine. After all, Maharashtra has a very long coastline and fresh prawns are available in this part of India quite readily. So if you want to enjoy a tangy meal of shrimps, you can try the kolambi rassa recipe.
Story first published: Monday, December 29, 2014, 18:18 [IST]
Desktop Bottom Promotion