For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మసాలా ఎగ్ బుర్జీ-ముంబాయ్ స్టైల్

|

ప్రతి చోటా మసాలా ఎగ్ బుర్జ్ చాలా ప్రత్యేకమైన, బెస్ట్ రిసిపి. ఈ ఎగ్ బుర్జ్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. బ్రెడ్ స్లైస్, జ్యూస్ తో పాటు తీసుకొనే ఎగ్ బుర్జ్ ముంబాయ్ లో చాలా ఫేమస్. కొంత మంది ఈ ఎగ్ బుర్జ్ ను రైస్ మరియు రోటీతో తీసుకుంటారు. గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీనుల అధికంగా ఉండటం వల్ల ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డును(ఉడికించిన గుడ్డు, ఆమ్లెట్, వేయించిన)తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. దాంతో రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ఆకలిని కంట్రోల్ చేస్తుంది. సాధారణంగా మనకు ఎగ్ బుర్జ్ (మసాలాలు, వెజిటేబుల్స్ )ఎలా తయారు చేయాలో తెలుసు. అయితే మసాలా ఎగ్ బుర్జీ ముంబాయ్ స్టైల్ లో ఎలా తయారు చేయాలో చూద్దాం...

గుడ్లు: 5
పన్నీర్/కాటేజ్ చీజ్: 2tbsp
ఉల్లిపాయ తురుము: 2(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
టమోటో: 1(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 4(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1tsp
బ్లాక్ పెప్పర్ (మిరియాల)పౌడర్: 1tsp
కారం: ½tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఛాట్ మసాలా: చిటికెడు
బట్టర్: 2-3 tbsp
కొత్తిమీర తరుగు: 2tbsp(తరిగి పెట్టుకోవాలి)

Masala Egg Bhurji

తయారు చేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో వెన్న(బట్టర్)వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి.
2. ఉల్లిపాయలు వేగుతూ మెత్తబడి బ్రౌన్ కలర్ మారే సమయంలో అందులో పచ్చిమిర్చి, టమోటో, మరియు పన్నీర్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసి మరో రెండు మూడు నిముషాల పాటు వేయించుకోవాలి.
3. ఇప్పుడు అందులోనే ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్, కారం, ఛాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసి మీడియం మంట మీద అన్నీ కలిసేలా ఫ్రై చేసుకోవాలి. 4. అంతలోపు ఒక గిన్నెలో గుడ్లును వేసి బాగా గిలకొట్టాలి. ఇప్పుడు వేగుతున్న మసాలాలో గిలకొట్టిన గుడ్డును పోసి పొడిపొడిగా తయారయ్యేంత వరకూ మీడియం మంట మీద వేయించాలి. అంతే ఎగ్ మసాలా బుర్జ్ రెడీ.... చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి రోస్టె బ్రెడ్ తో ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా అంధించండి.

English summary

Masala Egg Bhurji-Mumbai style dish | బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ మసాలా ఎగ్ బుర్జీ

Egg bhurji is one of the best egg recipes everywhere. Commonly known as scrambled eggs, egg bhurji in India is a staple breakfast recipe that is teamed up with roasted bread slices and juice. Some people even have egg bhurji with rice or rotis. Egg is a healthy dairy product and eggetarians and non-vegetarians always prefer to have boiled egg, omelette or any other egg recipe to start off their day.
Story first published: Tuesday, January 22, 2013, 17:30 [IST]
Desktop Bottom Promotion