For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మసాలేదార్ మటన్ రిసిపి-డిన్నర్ స్పెషల్

|

వీకెండ్ లో ఏదైనా స్పెషల్ గా తయారుచేయడానికి ప్లాన్ చేస్తున్నారా? మీ కుటుంబ సభ్యులకు కొత్తగా ఏదైనా రుచి చూపించాలనుకుంటున్నారా? అటువంటప్పుడు మీకు ఒక ఉత్తమ రుచిగల ఒక వంటను మీరు ప్రయత్నించడానికి ఇక్కడ ఒక కొత్త వంటను పరిచయం చేస్తున్నాం.

ఈ మసాలేదార్ మటన్ రిసిపిని పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్రీమీగా ఉండే ఈ మటన్ రిసిపిని మీరు ఈ వీకెండ్ లో ట్రై చేయండి. ఈ మసాలేదార్ స్పెషల్ మటన్ రిసిపికి కొన్ని సువాసనలు కలిగిన మసాలాదినుసులను జోడించడం వల్ల రుచితో పాటు, వాసను కూడా అద్భుతంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Masaledar Mutton Recipe For Dinner
కావల్సిన పదార్థాలు:
మటన్: 750grm(మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
నూనె: 4tbsp
యాలకలు: 6
లవంగాలు: 10
బే ఆకులు : 3
దాల్చిన చెక్క: 1
ఉల్లిపాయలు: 5(సన్నగా తరిగినవి)
వెల్లుల్లి / అల్లం: 1tbsp (పేస్ట్)
పెరుగు: 5tbsp
పసుపు: 1tsp
కారం : 1tbsp
ఉప్పు : రుచికి సరిపడా
పచ్చిమిర్చి: 2(మద్యకు కట్ చేసుకోవాలి)
గరం మసాలా: 1tbsp
ధనియాల పొడి: 2tsp
టమోటో: 6tbsp(గుజ్జు)
మిరియాలు: 1tsp
కొత్తిమీర తరుగు: 1tbsp
పుదీనా:1రెమ్మ(సన్నగా తరిగాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో కొద్దిగా నూనె వేసి, వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో, యాలకలు, లవంగాలు, బిర్యానీ ఆకు మరియు దాల్చిన చెక్క వేయాలి.
2. ఇప్పుడు ఈ పదార్థాలను 2,3నిముషాలు మీడియం మంట మీదు వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి, గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
3. ఇప్పుడు అందులో మటన్ ముక్కలు కూడా వేసి, 5నిముషాలు ఫ్రై చేయాలి. కుక్కర్ లో ఫ్రై అవుతున్న మసాలా దినుసులన్నీ మటన్ తో బాగా కలిసేలా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
4. 5నిముషాల తర్వాత, అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులో పెరగు, పసుపు, కారం, ఉప్పు మరియు ధనియాల పొడి వేసి, అన్నింటిని బాగా మిక్స్ చేస్తూ వేయించాలి.
6. 5నిముషాలు వేగిన తర్వాత అందులో టమోటో గుజ్జు మరియు పచ్చిమిర్చి కూడా వేసి మిక్స్ చేసి, ఫ్రై చేయాలి.
7. ఇప్పుడు ఈ మిశ్రమానికి, 7కప్పుల నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
8. ప్రెజర్ కుక్కర్ మూత పెట్టి, మీడియం మంట మీద 5,6విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకొని, తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
9. స్టౌ ఆఫ్ చేసిన తర్వాత 5నిముషాలు అలాగే ఉండి ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత, మూత తీసి, అందులో గరం మసాలా, పెప్పర్, కొత్తిమీర మరియు పుదీనా తరుగు వేయాలి.
10. ఇప్పుడు తిరిగి కుక్కర్ ను స్టౌ మీద పెట్టి మరికొన్ని నిముషాలు ఉడికించుకోవాలి. నీరు మొత్తం చిక్కగా ఇమిరిపోయే వరకూ ఉడికించుకోవాలి. అంతే తినడానికి మసాలేదార్ మటన్ రిసిపి రెడీ. ఈ రుచికరమైన మసాలేదార్ మటన్ రిసిపిని రోటీ లేదా పీస్ పులావ్ తో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది.

English summary

Masaledar Mutton Recipe For Dinner

Wondering what to prepare this evening for dinner? Here we have one of the best recipes you can try out this evening to cook for the family. The Masaledar Mutton recipe is a must try as your kids will love just as much as they would love the taste of any mutton dish.
Story first published: Wednesday, December 11, 2013, 15:55 [IST]
Desktop Bottom Promotion