For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీట్ అండ్ బటర్ రైస్ రిసిపి

|

మీరు మీ పిల్లలకోసం మరియు బాగా ఆకలిగా ఉన్న మీ భర్త కోసం ఏదైన రుచికరంగా వంటను తయారుచేయానుకుంటే, ఈ కీమా పీస్ రిసిపిని తయారుచేయండి. మటన్ లో విటమిన్స్ మరియ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పెరిగే పిల్లలకు చాలా ఆరోగ్యకరం.

ఈ ఖీమా బటర్ రైస్ రిసిపి తయారుచేయడం చాలా సులభం మరియు దీన్ని తయారుచేయడానికి ఎక్కువ సమయం పట్టదు . మీరు చేయాల్సిందల్లా, అందుకు అవసరం అయ్యే కరెక్ట్ పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. మరి మీరు కూడా దీన్ని టేస్ట్ చేయాలంటే వెంటనే దీన్ని ఎలా తయారుచేయాలో తెలుసుకోండి...

Meat And Buttery Rice Recipe

కావల్సిన పదార్థాలు:
మటన్ ఖీమా- 1 ½kg
బటర్- 7-8tbsp
యాలకలు- 2
దాల్చిన చెక్క- 1
లవంగాలు- 2-3
బ్లాక్ జీలక్రర- 1tsp
ఉల్లిపాయలు- 2-3 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
బాస్మతి రైస్- 500gms
షుగర్- 1-2tsp
జీడిపప్పు- ½ cup
స్ప్రింగ్ ఆనియన్స్- 2 cups(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉప్పు- రుచికి సరిపడా

తయారుచేయడం విధానం:
1. ప్రెజర్ కుక్కర్ లో నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టాలి. నీరు మరుగుతున్నప్పుడు మటన్ ఖీమా అందులో వేసి, ఉప్పు వేసి రెండు, మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
2. 15 నిముషాల తర్వాత మూత తీసి మటన్ ఖీమా తీసి పక్కన పెట్టుకోవాలి .
3. ఇప్పుడు 5-6 చెంచాలా బటర్ ను డీప్ బాటమ్ ఫ్రైయింగ్ పాన్ లో వేసి, కరిగిన తర్వాత అందులో యాలకలు, దాల్చిన చెక్క మరియు లవంగాలు వేసి, తక్కువ మంట మీద ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులో బ్లాక్ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు మరియు కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి మీడియం మంట మీద ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
5. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో ముందుగా ఉడికించుకొన్న ఖీమా వేసి మిక్స్ చేస్తూ, మరో 5 నిముషాలు ఉడికించుకోవాలి. 6. తర్వాత అందులోనే కడిగి పెట్టుకొన్న బాస్మతి బియ్యం వేసి మరో 10 నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు అందులోనే ఖీమా ఉడికించి పెట్టుకొన్న నీళ్ళనే బియ్యం ఉడకడానికి సరిపడా పోయాలి . మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి మూత పెట్టి, 10నుండి 15 నిముషాలు ఉడికించాలి.
8. 15 నిముషాల తర్వాత మూత తీసి అందులో కొద్దిగా షుగర్, జీడిపప్పు మరియు ఒక చెంచా బటర్ వేసి, 2-3నిముషాలు తక్కువ మంట మీద ఉంచి తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి.
9. తర్వాత మరో ఫ్రైయింగ్ పాన్ ను స్టౌ మీద పెట్టి, అందులో కొద్దిగా బటర్ వేసి, కరిగిన తర్వాత అందులో స్ప్రింగ్ ఆనియల్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని బటర్ ఖీమా రైస్ తో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Meat And Buttery Rice Recipe

A butter rice recipe is very simple and endearing. This meat rice has an amazing flavour that mainly comes from of the butter used in it. You just need some whole spices, vegetables, butter, rice and meat for this meat butter & rice recipe. Even if you are an amateur in the kitchen you can easily prepare this meat rice within no time.
Story first published: Saturday, September 26, 2015, 13:32 [IST]
Desktop Bottom Promotion