For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీన్ మొయిలీ: కేరళ స్టైల్ ఫిష్ కర్రీ

|

మీన్ మొయిలీ లేదా ఫిష్ మొయిలీ, కేరళ తీరప్రాంతంలో ఫేమస్ ఫిష్ కర్రీ. మీన్ అంటే చేపలు, మొయిలీ అంటే గ్రేవీ. ఈ ఫిష్ కర్రీ కోకనట్ మిల్క్ గ్రేవీలో మెత్తగా ఉడికించడం అన్నమాట. చాలా తక్కువ మసాలాదినుసులు ఉపయోగించి తయారుచేస్తారు. ఈ ఫిష్ కర్రీ ఇతర ఫిష్ కర్రీలను డామినేట్ చేస్తుంది.

మీన్ మొయిలీ తయారుచేయడానికి ముఖ్యంగా చేపలను తాజాగా ఉన్న చేపలు లేదా పాంఫ్రెట్ లేదా కింగ్ ఫిష్ ను తీసుకోవాలి . ఈ మంచి ఫ్లేవర్ కలిగిన ఫిష్ కర్రీ, ఫిష్ లవర్స్ కోసం ఒక అద్భుతమైన ట్రీట్. ఈ టేస్టీ ఫిష్ కర్రీ ఖచ్చితంగా చాలా రుచికరంగా ఉంటుంది.

Meen Moilee: Kerala Fish Curry

కావల్సిన పదార్థాలు:
ఫిష్: 4 ఫిల్లెట్స్
ఉల్లిపాయ: 1(మీడియం సైజ్, ముక్కలుగా కట్ చేసుకోవాలి)
గ్రీన్ చిల్లీ: 2 (మద్యలోకి కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
మిరియాల పొడి: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
కొబ్బరి పాలు: 1cup
కరివేపాకు: 10
ఆవాలు: 1tsp
పసుపు: ½
నిమ్మరసం: 1tbsp
నూనె: 1tbsp
కొత్తిమీర తరుగు: 2tbsp(తరిగిన)

తయారుచేయు విధానం:
1. ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తేమ ఆరిన తర్వత వాటికి నిమ్మరసం, ఉప్పు, ఇక చెంచా అల్లం, వెల్లుల్లిపేస్ట్ మిక్స్ చేసి, చేపలకు పట్టించి అరగంట పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బ్రౌన్ కలర్ కు మారేవరకూ వేయించుకోవాలి.
4. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కొబ్బరి పాలు వేసి మిక్స్ చేస్తూ వేయించాలి.
5. ఇప్పుడు అందులో ముందుంగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చూపముక్కలను వేసి 7-8నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి, మూత పెట్టాలి.
7. నీళ్ళు పోసిన తర్వాత 5-10నిముషాలు మీడియం మంటలో చేపముక్కలు ఉడుకుతాయి. కాబట్టి, పది నిముషాల తర్వాత మూత తీసి చూసి, ఉడికినవని నిర్ధారించుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే మీన్ మోయిలీ కెరళ స్టైల్ ఫిష్ కర్రీ రెడీ. ఈ ఫిష్ కర్రీని అప్పంతో ఎంజాయ్ చేయండి.

English summary

Meen Moilee: Kerala Fish Curry

Meen Moilee or fish Moilee is a famous fish curry from the coasts of Kerala. The word Meen means fish and Moilee is the stew. The fish is cooked in a coconut milk stew with very little spices so that the flavour of the fish dominates the dish.
Story first published: Friday, March 7, 2014, 17:54 [IST]
Desktop Bottom Promotion