For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మింట్ మటన్ బిర్యానీ-స్పెషల్ ఫ్లేవర్ అండ్ టేస్ట్

|

సాధారణంగా బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులందరికీ ఇష్టమైన డిష్. బిర్యానీలో కూడా వివిధ రకాలుగా తయారు చేస్తారు. చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, మటన్ బిర్యానీ. రుచిలో వేటికవే అద్భుత రుచి, ఒక్కో వంటకాన్నీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మటన్ బిర్యానీ చేయాలంటే వివిధ రకాల మసాల దినుసులు అవసరం అవుతాయి.

కానీ పుదీనా మటన్ బిర్యానీ చాలా సింపుల్ గా రుచికరంగా, మంచి ఫ్లేవర్ తో అతి త్వరగా తయారు చేసుకోవచ్చు. అతి తక్కువ మసాలా దినుసులతో తాయరు చేసే మటన్ బిర్యా టేస్ట్, ఫ్లేవర్ కూడా అద్భుతంగా ఉంటుంది. మరి మీరూ పుదీనా ఫ్లేవర్ మటన్ బిర్యానీ రుచి చూడాలంటే ఎలా తయారు చేయాలో ఒక సారి చూద్దాం...

 Mutton Biryani

కావలిసిన పదార్థాలు:
పుదీన : 3cup
ఉల్లిపాయలు : 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నిమ్మకాయలు : 2
ఉప్పు : రుచికి సరిపడ
ఫుడ్ కలర్ : చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tsp
బాస్మతి రైస్ : 3cup(ఆఫ్ బాయిల్డ్ చేయాలి)
ధనియాలపొడి : 1tsp
నూనె : తగినంత
బిర్యానీ మసాలా : 1tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా కుక్కర్‌లో మటన్ ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించి తీయాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో కొద్ది నూనె వేసి, కాగిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించి పక్కన తీసి పెట్టుకోవాలి.
3. చల్లారిన తర్వాత కారం, ఉప్పు, పెరుగు, బిర్యానీ మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి డీప్ ఫ్రిజ్‌లో అరగంట పెట్టాలి. ఇలా చేస్తే మసాలా మొత్తం మటన్‌కి బాగా పడుతుంది.
4. అంతలోపు రైస్‌ను ఆఫ్ బాయిల్ చేసి విడిగా పెట్టుకోవాలి.
5. తర్వాత ఒక గిన్నెలో నూనె వేసి వేడయ్యాక మ్యారినేట్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకొన్న మటన్ ముక్కలను ఒక పొరగా పరచి, దానిపైన ఉల్లిపాయల పొర, దాని పైన పుదీనా, ఆ పైన ఆఫ్ బాయిల్డ్ రైస్, తర్వాత మటన్, ఆ పైన ఉల్లిపాయలు, ఆ పైన పుదీనా, కొత్తిమీర ఆ పైన ఆఫ్ బాయిల్డ్ రైస్‌తో... నీటుగా సర్దాలి.
6. తర్వాత ఫుడ్‌కలర్‌ని ఒక టీ స్పూన్ నీళ్లలో కలిపి పైన చిలకరించాలి. పైన మూత పెట్టి, ఆవిరి బయటకు పోకుండా గోధుమ పిండి ముద్దతో గిన్నెను, మూతను కలిపి కవర్‌చేయాలి. తర్వాత సన్నని మంటమీద ఇరవై నిమిషాలు ఉడికించి, దించాలి. అంతే పుదీనా మటన్ బిర్యానీ రెడీ. ఈ పుదీనా బిర్యానీ మీకు నచ్చిన రైతా లేదా మీకు నచ్చిన గ్రేవీతో వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది.

English summary

Mint Flavour Mutton Biryani

Biryani is one dish which is an all time favourite of most of us. We are familiar with chicken or egg or mutton biryani.
Desktop Bottom Promotion