For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోరూరించే బోటీ కబాబ్ రిసిపి

|

అవ్వాది కుషన్ అంటే ఆహార ప్రియలకు మరింత ప్రియం. ఎందుకంటే అవ్వాది కుషన్స్ లో అద్భుతరుచిగల బిర్యానీ, కుల్చా, పరాటా మరియు కబాబ్స్ వంటివి నోరూరించేస్తుంటాయి. అవాద్ నవాబ్ కాలం నాటి ఈ రుచులకు మహా క్రేజ్ అందుకే మన ఇండియన్ కుషన్స్ లో అవ్వాది రుచుల నోరూరిస్తుంటాయి.

అవ్వాది కుషన్స్ లోని కబాబ్ లో కకోరి కబాబ్, నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే జలవాతీ, బోటీకబాబ్ మొదలగునవి చాలా పాపులర్ అయినటువంటి కబాబ్స్. మరి మీరు కూడా ఈ అవ్వాది డిష్ ను రుచి చూడాలంటే మీకోసం ఒక బోటీ కబాబ్ రిసిపి...

Mouthwatering Boti Kebab Recipe

కావల్సిన పదార్థాలు:
మటన్: ½kg (బోన్ లెస్, చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
పండని బొప్పాయి పేస్ట్: 2tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
కారం: ½ tsp
గరం మసాలా పొడి: ½tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఉల్లిపాయ ముక్కలు : అలంకరణ కోసం

తయారుచేయు విధానం:
1. ముందుగా మటన్ ముక్కలను శుభ్రంగా కడగాలి.
2. తర్వాత మటన్ ముక్కలకు పచ్చిబొప్పాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కారం, ఉప్పు, మరియు గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న మటన్ ను 3, 4 గంటల పాటు రిఫ్రిజరేటర్లో పెట్టుకోవాలి.
4. 3 గంటల తర్వాత మటన్ ను బయటకు తీసి ప్రెజర్ కుక్కర్ లో వేసి ఒక కప్పు నీళ్ళు పోసి 4 విజిల్స్ వచ్చే వరకూ ఉంచాలి.
5. తర్వత క్రిందిపు దింపుకొని,కుక్కర్ లో ఆవిరిమొత్తం తగ్గే వరకూ ఉండాలి. తర్వాత మూత తీసి చూపి మొత్త నీరు ఇమిరి ఉన్నట్లైతే ఓకే. లేదంటే తక్కువ మంట మీద నీరు మొత్త ఇమిరే వరకూ ఉడికించుకోవాలి. లేదా పక్కకు వంపేసుకోవచ్చు. అయితే రుచి ఉండదు.
6. తర్వాత ఈ మటన్ ముక్కలను ఒక గిన్నెలోనికి తీసుకొని గ్రిల్లర్ కు గ్రిల్ చేయాలి. లేదా గ్రిల్లర్ పాన్ లో పెట్టాలి.
7. ఇలా గ్రిల్ చేసిన మటన్ ముక్కలకు బటర్ ను అప్లై చేసి, తక్కువ మంట మీద 15-20నిముషాల వరకూ పూర్తిగా ఉడికించుకోవాలి లేదా బేక్ చేయాలి.
8. ఇలా బేక్ చేసుకొన్న మటన్ కబాబ్ ముక్కలను ఒక సర్వింగ్ ప్లేట్ లోకి మార్చుకొని ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేయాలి. అంతే బోటీ కబాబ్ రెడీ. గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటాయి.

English summary

Mouthwatering Boti Kebab Recipe

Awadhi cuisine is a foodie's haven. The delicious biryani, kulchas, parathas and of course, the kebabs of Awadh are to die for. The Nawabs of Awadh were famous for their gastronomic sophistication and love for food. That is why the royal kitchens can boast of producing some of the most delectable recipes which make Indian cuisine stand out from rest of the world.
Story first published: Wednesday, June 11, 2014, 18:05 [IST]
Desktop Bottom Promotion