For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రంజాన్ విందు బహుపసందు-మొఘలాయ్ మటన్

|

రంజాన్ అంటే ఆ నెల మొత్తం ముస్లీములు ఉపవాస దీక్షలు చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండే వీరికి సాయంత్రం ఉపవాసం తీర్చుకొనే సమయం. అందుకోసం వివిధ రకాల అద్భుతమైన వంటలు, ప్రతి ముస్లిం ఇంట్లోనూ అలరిస్తుంటాయి. అటువంటి స్పెషల్ డిష్ లలో మొఘలాయ్ మటన్ పులావ్ ఒకటి. మొఘల్ కాలం నాటి రాయల్ ఫ్యామీలీ నుండి వచ్చిన ఈ మొఘలాయ్ పులవ్ ను ఇండియన్స్ తమదైన స్టైల్లో వండుతున్నారు. మొఘలాయ్ మటన్ పులవ్ కడుపు నింపు రైస్ డిస్. దీన్ని రోజంతా ఉపవాస దీక్ష ఉండే వారు హెవీ డిన్నర్ గా తీసుకోవచ్చు. అందుకే దీనికి గ్రేట్ రంజాన్ రిసిపి అని పేరు వచ్చింది.

రంజాన్ వంటకాల్లో చాలా పాపులర్ అయినటువంటి మొఘలాయ్ మటన్ పులవాన్ ను రెడ్ మీట్ తో తయారు చేస్తారు. ఉపవాసం ఉండేవారికి తప్పనిసరిగా ప్రోటీనులు మరియు శక్తి చాలా అవసరం అవుతుంది. ఇవి రెడ్ మీట్ లో పుష్కలంగా లభిస్తాయి కాబట్టి, రంజాన్ నెలలో దీన్ని ఎక్కువగా వండుతారు. ఈ పులావ్ రిసిపి, మొఘలాయ్ బిర్యానీ ని పోలి ఉంటుంది. వండే విధానంలో కూడా చాలా చిన్న తేడా కలిగినది. ఈ మొఘలాయ్ వంటకం చాలా రిచ్ అనిపిస్తుంది. మరీ మీరు టేస్ట్ చేయాంటే ఈ మొఘలాయ్ రిసిపిని ట్రై చేయండి.

Mughlai Mutton Pulao

కావల్సిన పదార్థాలు:
మటన్: 500grms(మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి)
బాస్మతి బియ్యం: 2cups
పెరుగు: 1cup
ఉల్లిపాయ: 2 (సన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
పచ్చిమిరపకాయలు: 4 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
కారం: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
ధనియాల పొడి: 1tsp
గరంమసాలా పొడి : 1 / 2tsp
దాల్చిన చెక్క: 1 అంగుళం
మిరియాలు: 6
లవంగాలు : 4
ఏలకుల: 4
బిర్యాని ఆకు: 1
కుంకుమ పువ్వు: ఒక చిటికెడు (పాలలో నానబెట్టుకోవాలి)
జీడిపప్పు: 10
ఎండుద్రాక్ష: 10
నెయ్యి: 1tbsp
నూనె: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శుభ్రం చేసి పెట్టుకొన్న మటన్ ముక్కలు వేసి అందులో కారం, జీలకర్ర, కొత్తిమీర, మరియు గరం మసాలా పౌడర్, వేసి బాగా మిక్స్ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి, వేడయ్యాక అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి తక్కువ మంట మీద వేగించాలి.
3. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి మరో 2నిముషాలు వేగించాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, వేసి మీడియం మంటమీదే మరో రెండు నిముషాలు వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న మటన్ ముక్కులు వేసి, బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి. మసాలా మిశ్రమంతో మటన్ ముక్కలు బాగా మిక్స్ అయ్యాక, మూత పెట్టి 7-8నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
6. మరో డీప్ బాటమ్ పాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి, వేడయ్యాక అందులో బిర్యాని ఆకు, మిరియాలు, చెక్క, యాలకులు, లవంగాలు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
7. తర్వాత అందులోనే జీడిపప్పు కూడా వేసి మరో నిముషం వేగించుకోవాలి. తర్వాత ఎండుద్రాక్ష, బియ్యం కూడా వేసి మీడియం మంట మీద 2-3నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
8. అంతలోపు మటన్ సగభాగం ఉడికి ఉంటుంది, ఉడియే మటన్ గ్రేవీ మీద ఆయిల్ తేలినట్లు ఉందేమో ఒక సారి మూత తీసి గమనించాలి.
9. అలా ఐతే ఈ సగ భాగం ఉడికి మటన్ ను గ్రేవిని, ఫ్రై అవుతున్న బియ్యం మిశ్రమంలో పోసి, బాగా మిక్స్ చేసి మటన్, బియ్యం, మసాలా అంతా మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసి, 3కప్పులు నీళ్ళు పోసి, తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.
10. తర్వాత మూత పెట్టి 20-25మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
11. అంతే బియ్యం, మటన్ రెండూ మెత్తగా ఉడికిన తర్వాత, పాలలో నానబెట్టి పెట్టుకొన్న కుంకుమ పువ్వు మిశ్రమాన్ని అన్నం మీద చిలకరించాలి. మరో నిముషం మూత పెట్టి ఆవిరి మీద ఉంచాలి. అంతే మొఘలాయ్ మటన్ పులావ్ రెడీ...

మొఘలాయ్ మటన్ పులావ్ ను రైతా, మరియు ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేస్తే రంజాన్ విందు బహు పసందుగా ఉంటుంది.

English summary

Mughlai Mutton Pulao Recipe For Ramzan

Ramzan is the holy month of fasting for Muslims. This month is associated with many delicacies with which the day long fast is broken. Mughali mutton pulao is one such dish. This Mughali recipe owes its origin to the royal kitchens of the Mughals.
Desktop Bottom Promotion