For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముర్గ్ కాలీ మిర్చి: ఇండియన్ పెప్పర్ చికెన్

|

ముర్గ్ కాలీ మిర్చి ‘పెప్పర్ చికెన్'రిసిపి ఇండియన్ నాన్ వెజ్ వంటకాల్లో స్పెషల్. ముర్గ్ కాలీ మిర్చి పెప్పర్ చికెన్ నోరూరిస్తే స్పైసీగా తింటుంటే కళ్ళవెంబడి నీళ్ళు రావాల్సిందే. ఈ స్పెషల్ పెప్పర్ చికెన్ తయారు చేయడం చాలా సులభం. మీరు కనుక స్పైసీ ఫుడ్ ను ఇష్టపడుతున్నట్లైతే ఈ పెప్పర్ చికెన్ కొన్ని నిముషాల్లో తయారు చేసేయొచ్చు .

ఈ స్పైసీ ఇండియన్ చికెన్ పెప్పర్ ఫ్రై అతిథులకు ప్రత్యేకంగా వండ్డించవచ్చు. పార్టీకి, ఫంక్షన్లకు ప్రత్యేకంగా తయారు చేసుకొనే ఈ చికెన్ రిసిపి సైడ్ డిష్ గా బాగా నప్పుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు తయారు చేసి రుచి చూసేయండి...

Murg Kali Mirch:Chicken

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1kg
అల్లం వెల్లుల్లి పేస్ట్: 3tbsp
పెప్పర్ పౌడర్: 2tsp
కాశ్మీరీ కారం: 1tsp
పసుపు: ½tsp
పెరుగు: 3tbsp
నిమ్మరసం: 2tbsp
జీలకర్ర: 2tbsp
ధనియాలు: 1tbsp
పెప్పర్(మిరియాలు): 1tbsp
పచ్చిమిర్చి: 2 (మొత్తం ) + 4 (చిన్న ముక్కలుగా తరిగి)
ఆవాలు : 1tsp
కొత్తిమీర: 3 కాడలు (తరిగినవి)
ఆవాలు నూనె 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ శుభ్రం చేసి ఒక గిన్నెలో ఉంచుకోవాలి. తర్వాత చికెన్ ముక్కల మీద నిమ్మరసం, కారం, పసుపు, పెప్పుర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ , పెరుగు మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
2. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ ను ఫ్రిజ్ లో పెట్టి 2గంటల పాటు అలాగే ఉంచాలి.
3. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు మరియు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు మిక్సీ జార్ లో జీలకర్ర, ధనియాలు మరియు మిరియాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
5. ఈ పేస్ట్ ను పోపు వేగుతున్న పాన్ లో వేసి రెండు మూడు నిముషాలు తక్కు మంట మీద ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలు, ఎక్స్ ట్రా మసాలా కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా ఇమురుతూ ఫ్రై అయ్యేలా చూసుకోవాలి.
7. తర్వాత మూత పెట్టి 12-15నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి అవసరం అయితే ఒకటి నుండి రెండు కప్పుల నీరు పోసి ఉడికించుకోవాలి. మొత్తం మిశ్రమం డ్రై అయ్యే వరకూ ఉడికించుకోవాలి.
8. చివరగా కొత్తిమీర తరుగు మరియు పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకోవాలి. అంతే ముర్గ్ కాలీ మిర్చిని రోటీస్ లేదా పరాటోలతో సర్వ్ చేయాలి.

English summary

Murg Kali Mirch:Chicken

When we say 'Pepper Chicken', most people are tempted to think that the recipe is a westernised one. However, Murg Kali Mirch has a lovely desi twang to it. That is why we are calling this recipe the Murg Kali Mirch curry.
Desktop Bottom Promotion