For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముర్గ్ హరియాలీ చికెన్ రిసిపి: రంజాన్ స్పెషల్

|

ముర్గ్ ముస్లం ఒక ఉత్తమ స్పైసీ చికెన్ రిసిపి, ఈ అద్భుతమైన రుచికలిగిన చికెన్ రిసిపి చాలా రిచ్ గా మరియు క్రీమీగా ఉంటుంది. చూస్తూనే నోరూరించేట్లు ఉండే ఈ ముర్గ్ హరియాలి చికెన్ రిసిపి నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ రిసిపి. ఈ చికెన్ రిసిపిని ఎక్కువగా ఫెస్టివల్స్, మ్యారేజీలుకు ఎక్కువగా తయారుచేసుకుంటుంటారు.

ముర్గ్ హరియాలి చికెన్ రంజాన్ మాసంలో ఎక్కువగా తయారుచేసుకుంటారు. ముర్గ్ హరియాలి చికెన్ రిసిపిని వివిధ రకాల ఇండియన్ మసాలా దినుసులతో తయారుచేస్తారు. ఈ మసాలాలతో పాటు మెంతి ఈ వంటకు ఒక స్పెషల్ టేస్ట్ మరియు ఫ్లేవర్ ను అంధిస్తాయి. మరి ఈ స్పెషల్ టేస్టీ ముర్గ్ హరియాలి చికెన్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:

చికెన్ : 1/2kg
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2tsp
ఉల్లిపాయలు: 100grms
పచ్చిమిర్చి : 15
పుదీనా: 2కట్టలు
కొత్తిమీర: 4కట్టలు
జీడిపప్పు: 3tbsp
గసగసాలు: 2tbsp
పెరుగు: 1cup
గరం మసాలా: 1tsp
మెంతికూర: 1/2tsp
నూనె: వేయించడానికి సరిపడా
ఉప్పు: తగినంత

Murgh Hariyali Chicken Recipe: Ramzan Special

తయారుచేయు విధానం:

1. ముందుగా స్కిన్ తీసేసిన చికెన్ ముక్కలను తీసుకుని శుభ్రంగా కడిగి, ఓ వెడల్పాటి గిన్నెలో వేసి ఉంచాలి.
2. తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి వేయించి మెత్తని ముద్దలా నూరి చికెన్ ముక్కలకు పట్టించాలి.
3. ఇప్పుడు అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసి ఓ అరగంటసేపు నానబెట్టాలి.
4. ఓ పాన్ లో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిముక్కల్ని వేయించాలి తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసి కొద్దిగా వేయించాలి.
5. ఇప్పుడు అందులోనే నానబెట్టిన చికెన్ ముక్కల్ని వేసి ఫ్రైచేస్తుండాలి.
6. తర్వాత గసగసాల్ని మెత్తని ముద్దలా నూరి తగినంత ఉప్పు, గరం మసాలా, పసుపు కూడా వేసి ముక్కల కలపాలి. మధ్య మధ్యలో కలియబెడుతూ సన్నని మంట మీద మూత పెట్టి ఉడికించాలి. అంతే చిక్కని గ్రేవీలా తయారవుతుంది.
6. చివరగా మెంతికూర తురుము చల్లి దించాలి. ఇది రోగన్ రోటీలోకి బాగుంటుంది.

English summary

Murgh Hariyali Chicken Recipe: Ramzan Special

Murgh Hariyali is one of the best spicy chicken recipes that you can try this afternoon. This delightful chicken recipe has a rich and creamy texture and a lip-smacking taste which makes it simply irresistible.
Story first published: Tuesday, July 15, 2014, 12:59 [IST]
Desktop Bottom Promotion