For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మస్టర్డ్ ఫిష్ కర్రీ రిసిపి: సీ ఫుడ్ స్పెషల్ రిసిపి

|

మస్టర్డ్ ఫిష్ కర్రీ రిసిపి (మచ్చబేసర కర్రీ రిసిపి )ఇది ఒడిషా మరియు వెస్ట్ బెంగాల్లో చాలా ఫేమస్ అయినటువంటి వంట. బేసిక్ గా ఇది బెంగాల్ రిసిపి. అయితే ఇది ఓడిషాలో మాత్రం చాలా పాపులర్ అయినటువంటి వంట.

ఈ స్పెషల్ మస్టర్డ్ ఫిష్ రిసిపిని రెండు పద్దతుల్లో తయారుచేస్తారు . చిక్కగా గ్రేవీ టేస్ట్ తో ఒక పద్దతిలో తయారుచేస్తే రెండవది కొద్దిగా డ్రై ఫ్రైలా స్టైల్లో చేస్తారు.

READ MORE: బట్టర్ గార్లిక్ ఫ్రైడ్ ఫిష్ : టేస్టీ సైడ్ డిష్

ఈ వంట యొక్క ప్రత్యేకత ఫిష్ కర్రీ కోసం మస్టర్డ్ సాస్ ను ముందుగా తయారుచేసుకొని తర్వాత ఫ్రై చేసి గ్రేవీ చేసి చాలా డిఫరెంట్ పద్దతిలో తయారుచేస్తారు. మరి మీరు కూడా మస్టర్డ్ ఫిష్ కర్రీని టేస్ట్ చూడాలంటే ఎలా తయారుచేయాలో చూద్దాం....

Mustard Fish Curry Recipe: Special Sea Food

కావల్సిన పదార్థాలు:
పెద్ద చేప ముక్కలు(ఏరకమైనా): 4
ఉల్లిపాయ: 2
టమోటోలు: 3
బంగాళదుంప: 1
ఆవాలు: 3tbsp(నీళ్లలో నానబెట్టాలి)

READ MORE: సీఫుడ్ లవర్స్ కోసం: ఆచారి ఫిష్ టిక్కా
వెల్లుల్లి రెబ్బలు: 3
అల్లం: చిన్న ముక్క
కారం: 1tsp
పసుపు: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె : సరిపడా
పెరుగు : 1/2cup
కొత్తిమీర: 1కట్ట

READ MORE: చేపలు తినండి ఆరోగ్యాన్ని..ఆయుష్యును పెంచుకోండి

తయారుచేయు విధానం:
1. ముందుగా నీళ్లలో నానబెట్టిన ఆవాలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో వేసి మెత్గగా పేస్ట్ చేసుకోవాలి.
2. తర్వాత చేపముక్కలను శుభ్రంగా కడిగి వాటిరి అరచెంచా కారం, పసుపు, కొద్దిగా ఉప్పు పట్టించి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో ముప్పావు వంతు నూనె వేసుకొని, వేడిచేసి చేపముక్కల్ని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
4. అదే పాన్ లో మిగిలిన నూనె వేసి ఉల్లిపాయ ముక్కులు వేసి వేయించుకోవాలి.
5. తర్వాత అందులోనే టమోటో ముక్కలు వేసి వేయించుకోవాలి. ఐదు నిముషాల తర్వాత ముందుగా మిక్సీలో చేసిపెట్టుకొన్న ఆవ పేస్ట్ వేసి, రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి. READ MORE: స్పైసీ కోరియాండర్ ఫిష్ : సీఫుడ్ స్పెషల్
6. తర్వాత అందులోనే ఉప్పు, కారం, వేసి మిక్స్ చేసి నీళ్లు పోసి మూత పెట్టేయాలి. ఇది గ్రేవీలా తయారయ్యాక గిలకొట్టిన పెరుగు వేయాలి. 7. ర్వాత వేయించిన చేపముక్కల్ని కూడా వేసి మంట తగ్గించి మూత పెట్టేయాలి. కొన్ని నిముషాలకు చేపముక్కలు బాగా ఉడుకుతాయి.
8. చివరగా కొత్తిమీర తరుగు చిలకరించి పక్కకు దింపుకోవాలి.

English summary

Mustard Fish Curry Recipe: Special Sea Food: Telugu Vantalu

Fish is a delicacy that makes all Bongs go a bit weak in the knees. And when it comes to the special fish called hilsa, or 'ilish' as it is called in Bengali, we can hardly stop ourselves from salivating. Bhapa ilish is a very sumptuous dish that is both delicious and healthy.
Story first published: Tuesday, July 7, 2015, 15:16 [IST]
Desktop Bottom Promotion