For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మటన్‌ కర్రీ-రాజ్‌ పుత్‌ స్పెషల్‌

|

Mutton Curry
ఈ రాయల్ డిష్ మటన్ కర్రీ రాజ్ పుతానీ కిచెన్ స్పెషల్. రాజస్థాన్, జోధ్ పూర్ ప్రదేశాల్లో ఇది చాలా ఫేమస్ వంటకం. ఈ మటన్ కర్రీకి ఎక్కువగా టామోటోలు, ఉల్లిపాయలు ఉపయోగిస్తారు. ఇండియన్ మసాలాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ రాజ్ పుత్ స్పెషల్ కారం కారంగా ఎప్పుడూ నోరూరిస్తుంటుంది.

అక్కడి మాంసాహార ప్రియులకు అత్యంత ఇష్టమైన రాజ్ పుత్ మటన్ కర్రీని లాల్ మాస్ అని కూడా అంటారు. ఈ రుచికరమైన రాజ్ పుత్ మటన్ కర్రీనీ మీరూ టేస్ట్ చూడాలనుకుంటే, ఇంట్లోనే స్పెషల్ గా తయారు చేసుకొనే చక్కటి విధానం ఇక్కడ ఉంది. ఈ రాజ్‌ పుత్‌ స్పెషల్‌ కర్రీ అన్నం, చపాతీలు, దోసెల్లోకి చాలా రుచిగా ఉంటుంది. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి మరి.

కావలసిన పదార్థాలు:

పొట్టేలు మాంసం: 1/2kg
ఉల్లిపాయలు : 1/4kg
అల్లంవెల్లుల్లి : 2tbsp
కారం : 1tsp
ధనియాలపొడి : 2tsp
లవంగాలు : 5
యాలకులు: 5
దాల్చినచెక్క ముక్కలు: 3
పులావు ఆకులు: 5
పెరుగు: 1cup
టొమోటో గుజ్జు: 1cup
గరం మసాలా : 2tsp
నూనె: 1/2cup
ఉప్పు : సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ తీసుకొని అందులో నూనె వేసి కాగనివ్వాలి. తరువాత మంట తగ్గించి మసాలా దినుసులన్నీ వేసి వేయించాలి.
2. ఇప్పుడు మటన్‌ ముక్కలు, అల్లంవెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి మూతపెట్టి అరగంట సేపు మగ్గనివ్వాలి.
3. తరువాత మూత తీసి ఓసారి కలియదిప్పి కారం, ధనియాలపొడి, పెరుగు వేసి తక్కువ మంటమీద ముక్కలు మెత్తగా అయ్యేంతదాకా ఉడికించాలి.
4. మటన్ మెత్తబడ్డాక టొమోటో గుజ్జు వేసి గరంమసాలా కూడా వేసి కలియబెట్టి, మూతపెట్టి మరో ఐదు నిమిషాలు తక్కువ మంటలో ఉడికించాలి. అంతే రాజ్‌ పుత్‌ స్పెషల్‌ కర్రీ రెడీ..! ఇది అన్నం, చపాతీలు, దోసెల్లోకి చాలా రుచిగా ఉంటుంది. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి మరి.

English summary

Mutton Curry- Rajput Special | మటన్‌ కర్రీ-రాజ్‌ పుత్‌ స్పెషల్‌

This is a royal dish from the Rajputani Kitchen. The Rajput Kings of Rajasthan were known to be fierce hunters and lovers of meat. They had amazing culinary skills too!
Desktop Bottom Promotion