For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మటన్ దోస రెసిపీ--స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి

|

దోసె ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి, ఇది సౌత్ లోనే కాదు, ఇండియాలో ప్రతి చోట దోసెకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇది రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ కాబట్టి బాగా ప్రాచుర్యం పొందింది. ఇల్లలో కనీసి వారంలో ఒక్క సారానై చేసి తీరాల్సిందే. కానీ ఇల్లలో తయారుచేసే దోసె ప్లెయిన్ దోస దానికి చట్నీ లేదా బంగాళదుంప వేపుడు లేదా కర్రీ చాలా ఫేమస్ కాంబినేషన్ .

ఐతే ఈ కాంబినేషన్ లో రెగ్యులర్ గా తిని బోరుకొడుతుంటే, కొంచెం తయారు చేసే విధానం, టేస్ట్ మార్చి చూడండి. ఇంట్లో మళ్ళీ దోసెలే మిగలవు. ముఖ్యంగా నాన్ వెజ్ తో దోసెలంటే ఇంకో రెండు ఎక్కువ తినాల్సిందే...నాన్ వెజ్ తో తయారు చేస్తారు. అంతే కాదు, ఇవి బ్రేక్ ఫాస్ట్ కు చాలా రుచిగా, ఫుల్ ఎనర్జినీ నింపేవిగా ఉంటాయి . ఈ మటన్ దోసె తయారు చేయడం చాలా సులభం. టైం కూడా చాలా తక్కువ పడుతుంది. అయితే ఈ వంటకు మటన్ బాగా ఉడికేలా జాగ్రత్త పడాలి. మరి మటన్ దోసెను ఎలా తయారుచేయాలో చూద్దాం..

Mutton Dosa

కావల్సిన పదార్థాలు:
ఇడ్లీ బియ్యం : 1cup
ఉద్దిపప్పు : ½cup
మటన్ ఖీమా : ½cup
గ్రీన్ బటానీలు : ½cup
పచ్చిమిరపకాయలు : 2 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పసుపు : ½tbsp
కారం : 1tbsp
పెప్పర్ పౌడర్ : 1tbsp
కరివేపాకు : 5
దాల్చిన చెక్క : 1
లవంగం : 2
ఆయిల్ : 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా మీరు బియ్యం మరియు ఉద్దిపప్పును శుభ్రంగా కడిగి నీళ్ళు సోసి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి.
2. 5గంటల తర్వాత నీళ్ళు వంపేసి బియ్యం మరియు పప్పును మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత నాలుగు -గంటల పాటు బియ్యం పిండిని పులియబెట్టుకోవాలి
3. తర్వాత ఒక పాన్ లో, రెండు టీ స్పూన్ల నూనె వేసి, అందులో చెక్క మరియు లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి.
4. అలాగే అదే పాన్ లో పచ్చిమిర్చి, కరివేపాకు, వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
5. తర్వాత అందులో మటన్ ఖీమా మరియు మసాలాలు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి కొన్ని నిముషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
6. మటన్ బాగా ఉడికేవరకూ మంటను తగ్గించి బాగా వేగిస్తూ ఉడికించుకోవాలి. మీకు అవసరం అయితే మరికొంత నూనె కూడా వేసి వేగించుకోవాలి.
7. ఇప్పుడు అందులోనే గ్రీన్ పీస్ కూడా వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
8. ఇలా మొత్తం వేగించుకొన్నాకా ఈ మిశ్రమాన్ని క్రిందికి దింపి కొద్దిగా చల్లారిన తర్వాత దోసె పిండిలో వేయాలి.
9. దోసె పిండిలో, ఫ్రైయింగ్ మిశ్రమం బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.
10. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి గరిట నిండుగా దోసె పిండి పోసి, పాన్ మొత్తం సర్ధి, నూనె చిలకరించి దోసె లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చుకోవాలిజ
11. అంతే మటన్ దోసె రెడీ, ఈ దోసెకు చిక్కటి మటన్ గ్రేవీతో సర్వ్ చేయాలి. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా లేదా ఏ సమయంలోనైనా తినవచ్చు.

English summary

Mutton Dosa Recipe For Breakfast

To start your day in celebration, this is one of the most desirable breakfast recipes you can think of to mark the Bakrid festival. The day is in full celebration and thus starting the day to a yummy delight of a non-vegetarian dosa will be an out of this world experience.
Story first published: Thursday, October 17, 2013, 11:20 [IST]
Desktop Bottom Promotion