For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మటన్ దమ్ పక్త్ : మొఘులాయ్ స్పెషల్

|

మటన్ దమ్ పక్త్ చాలా స్పెషల్ ముఘులాయ్ రిసిపి. చాలా ఏ కార్యక్రమానికైనా, పార్టీకైనా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వంటను పూర్వకాల పద్దతిలో తయారుచేస్తారు. ముఖ్యంగా చాలా చాలా తక్కువ మంట మీద దీన్ని తయారుచేస్తారు. పాన్ కు అన్ని వైపులా పూర్తిగా సీల్ చేసి మటన్ ఉడికిస్తారు. ఇలా ఆవిరి మీద ఉడికించడం వల్ల మటన్ ముక్కలు చాలా మెత్తగా, మసాలాలన్నింటిని కలగలుపుకొని ఉడికుతుంది కాబట్టి మంచి ఫ్లేవర్ కూడా కలిగి ఉంటుంది.

మటన్ దమ్ పక్త్ సుగంధ మసాలా దినుసులు మరియు హెర్బ్స్ తో తయారు చేస్తారు. ముందుగా మటన్ ను మసాలా పేస్ట్ మరియు పెరుగుతో మ్యారినేట్ చేస్తారు. మ్యారినేట్ చేసిన రెండు గంట తర్వాత ఈ వంటను తయారు చేయడం, చాల తక్కువ మంట మీద ఆవిరిలో ఉడికించడం వల్ల నోరూరించే, రుచికరమైన స్పైసీ వంటకాన్ని మిమ్మల్ని టేప్ట్ చేసేస్తుంది. మరి దీన్ని టేస్ట్ చేయాలంటే ఎలా తయారుచేయాలో ఒకసారి చూద్దాం..

Mutton dumpukht

కావల్సిన పదార్థాలు:
మటన్: 1kg
ఉల్లిపాయలు: 2 (మీడియం సైజ్ వి, సన్నగా, చిన్న ముక్కలుగా తరిగాలి)
వెల్లుల్లి రెబ్బలు: 5-10(చిన్న ముక్కలుగా తరగాలి)
అల్లం: 1చిన్న ముక్క(తురుము కోవాలి)
యాలకులు: 3- 4
నల్ల మిరియాల: 6
లవంగాలు : 4
జీలకర్ర: 1tsp
బ్లాక్ ఏలకులు: 1
పెరుగు: 1cup
పచ్చిమిరపకాయలు: 4
పుదీనా ఆకులు: ½cup(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
కొత్తిమీర: ½cup(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
గోధుమ పిండి: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 3tbsp
నీళ్ళు: 1 ½cup

తయారుచేయు విధానం:
1. ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పుదీనా, కొత్తిమీర, ఏలకలు, బ్లాక్ ఏలకలు, లవంగాలు, జీలకర్ర, మిరియాలు, కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ లా తయారుచేసుకోవాలి.
3. తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకొన్న మటన్ ముక్కలకు ఈ పేస్ట్ మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
4. రెండు గంటల తర్వాత డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి వేడయ్యా అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా వేసి మరో 2 నిముషాలు వేగించుకోవాలి.
6. ఇప్పుడు అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న మటన్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేస్తూ ఒకటి రెండు నిముషాలు వేగించుకొని ఒక కప్పు నీళ్ళు పోసి బాగా కలగలపాలి.
7. మసాలా, నీళ్ళు బాగా కలగలిసిన తర్వాత మూత పెట్టి మంటను తగ్గించాలి. తర్వాత కొంచెం గోధుమ పిండిని మెత్తగా చపాతీ పిండిలా కలుపుకొని పాన్ అంచులకు మూతకు అంటించాలి. అంటే లోపలి ఆవిరి బయటకు రానివ్వకుండా ఇలా పూర్తిగా పాన్ చూట్టూ కవర్ చేయాలి.
8. ఇప్పుడు ఈ మటన్ కర్రీని 30-40నిముషాలు తక్కువ మంట మీద, ఆవిరిలోనే ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, ఆవిరంత పూర్తిగా తగ్గే వరకూ చపాతీ సీల్ తియ్యకూడదు. పది పదిహేను నిముషాల తర్వాత పాన్ మూతి చుట్టూ అంటించి పెట్టిన చపాతీపిండిని తొలగించాలి. అంతే మటన్ దమ్ పక్త్ రెడీ..

English summary

Mutton Dumpukht Recipe

Mutton dumpukht is prepared with a blend of some very fragrant spices and herbs. The mutton is first marinated with the spices and curd and then cooked over very low flame for a long time till the mutton turns tender.
Story first published: Saturday, September 28, 2013, 15:41 [IST]
Desktop Bottom Promotion