For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్డుతో ఫ్రై చేసిన మటన్ ఖీమా కట్ లెట్

|

మటన్ ఖీమా కట్ లెట్స్ చాలా రకాలున్నాయి . ఈ మటన్ ఖీమా కట్ లెట్ కోల్ కత్తా స్పెషల్ రిసిపి. దీన్ని రంజాన్ సందర్బంగా కొంచెం వెరైటీగా ఈ కట్ లెట్ ను మీకు అందిస్తున్నాం. ఈ కట్ లెట్ యొక్క స్పెషాలిటీ ఎగ్ తో ఫ్రై చేయడమే...

ఈ రంజాన్ స్పెషల్ ఖీమా ఎగ్ కట్ లెట్స్ అద్భుతమైన టేస్ట్ ను అంధిస్తుంది. ఇది కడుపు నిండుగా ఉంచే ఫిల్లింగ్ డిష్. మీరు ఈ మటన్ ఖీమా ఎగ్ ఫ్రైడ్ కట్ లెట్ ను జస్ట్ 20నిముషాల్లో తయారు చేయవచ్చు . అందువల్ల ఈ వంటకం రంజాన్ కు చాలా అనుకూలమైన వంటగా ఉంది. మరి నోరూరించే ఈ స్పెషల్ స్నాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం..

Mutton Kheema Cutlets

కావల్సిన పదార్థాలు:
మటన్ ఖీమా: 500grms
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
నిమ్మరసం: 1tbsp
పచ్చిమిరపకాయలు: 4 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
కొత్తిమీర: 1 కొమ్మ (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పెప్పర్ పౌడర్: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
శెనగపిండి లేదా పెసరపిండి: 2tbsp
గుడ్లు: 4
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 4tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం మరియు ఉప్పు వీటితో పాటు శుభ్రం చేసుకొన్న మటన్ ఖీమా కూడా వేయాలి.
2. అలాగే అందులో పెప్పర్ పౌడర్ మరియు గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి 10-20నిముషాల వరకూ పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత శెనగపిండిని కూడా కలిపి మెత్తగా (చపాతీ పిండిలా కలుపుకోవాలి).
4. తర్వాత ఈ ఖీమా మిశ్రమాన్ని చేతి నిండా తీసుకొని, ఉండాల చుట్టి, అరచేతిలో పెట్టుకొని కట్ లెట్ లా వత్తుకోవాలి. ఇలా మొత్తం ఖీమా మిశ్రమాన్ని కట్ లెట్ లా తయారు చేసుకోవాలి.
5. తర్వాత స్టౌ మీద డీప్ బాటమ్ పాన్ పెట్టి నూనె పోసి, మీడియం మంట మీద బాగా కాగనివ్వాలి.
6. తర్వాత 4గుడ్లను పగులగొట్టి , అందులో ఉప్పు వేసి బాగా గిలకొట్టాలి.
7. ఇప్పుడు ముందుగా తయారు చేసుకొన్న కట్ లెట్ ను ఎగ్ సాల్ట్ మిశ్రమంలో డిప్ చేసి, కాగే నూనెలో వేయాలి. తర్వాత మంట తగ్గించి డీప్ ఫ్రౌ చేయాలి.
8. మీడియం మంట మీద డీప్ ఫ్రై చేస్తూ, రెండు వైపులా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చుకోవాలి. అంతే మటన్ ఖీమా కట్ లెట్ విత్ ఎగ్ ఫ్రై రెడీ..

English summary

Mutton Kheema Cutlets Fried With Eggs

Mutton kheema cutlets are of many types. The Ramzan recipe that we are going to share with you today has been inspired by the Kolkata variety of mutton kheema cutlets. You must have heard of the the legendary Kobiraji cutlets. The specialty of these cutlets is that they are fried with eggs.
Story first published: Wednesday, July 24, 2013, 17:39 [IST]
Desktop Bottom Promotion