For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మటన్ ఖీమా పకోడా: వీకెండ్ స్పెషల్

|

చాలా మంది క్రిస్పీ మరియు ఫ్రైడ్ ఫుడ్స్ ను ఎక్కువగా ఇష్టపడుతారు. ఈవెనింగ్ అయ్యే సరికి ఒక కప్పు కాఫీతో పాటు, ఏదైనా వేడివేడి స్నాక్స్ తినాలని కోరుకుంటాం. అందులో క్రీస్పీగా ఉండేవి అంటే మరింత ఎక్కువగా ఇష్టపడుతారు. సాధారణంగా ఈవెనింగ్ స్నాక్స్ చాలా మంది ఇష్టపడుతారు. సాయంత్ర సమయాల్లో టీ, కాఫీలతో పాటు తీసుకొనే వేడి వేడి స్నాక్స్ లో పకోడ కూడా ఒకటి అందులో హెల్తీ అండ్ పకోడా ఖీమా పకోడా. ఖీమా ఫుల్ గా ప్రోటీనులను అందిస్తుంది, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆరోగ్యానికి ఉపయోగపడే న్యూట్రిషియన్స్ ను అందిస్తుంది. ఇది పిల్లలు పెద్దలు అమితంగా ఇష్టపడి తింటారు.

ఇది గ్రీన్ చట్నీ లేదా టమోటో కెచప్ తో చాలా గ్రేట్ అండ్ టేస్టీ స్నాక్. ఇది చాలా సింపుల్ మరియు ఈజీ మటన్ పకోడా. చాలా తక్కువ సమయంలో దీన్ని తయారుచేయవచ్చు. ఈ సింపుల్ స్నాక్ రిసిపిని శెనగపిండితో తయారుచేస్తారు. అంతే కాదు, రుచికూడా అద్భుతంగా ఉంటుంది. ఈ స్నాక్ ను గ్రీన్ చట్నీ లేదా టమోటో కెచప్ తో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Mutton Kheema Pakora : Weekend Special

కావలసిన పదార్థాలు:
మటన్‌ కీమా - 2cup
గుడ్డు - 1
ఉల్లిపాయ - 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి - 4(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
శెనగపిండి - 1cup
టమోటో: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్టు - 1tsp
గరం మసాలా: 1tsp
కబాబ్ మసాలా:1tsp
కారం - 1tsp
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేగించడానికి తగినంత.

తయారుచేయు విధానం:
1. ముందుగా ఖీమా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి మరియు టమటోటో ముక్కలను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో వేయాలి.
2. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి
3. తర్వాత అందులోనే ఉప్పు, కబాబ్ మసాలా మరియు గరం మసాలా వేసి బాగా మిక్స్ చేస్తూ, మెత్తగా చేసుకోవాలి.
4. తర్వాత శెనగపిండిని కూడా ఖీమా మిశ్రమానికి జోడించాలి . తర్వాత దానికి అరకప్పు నీళ్ళు జోడించి కొద్దిగా గట్టిగానే జారుడుగా కలుపుకోవాలి
5. ఇప్పుడు స్టౌ మీద డీప్ బాటమ్ పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక అందులో ఖీమా పకోడాను కొద్దిగా చేతిలోకి తీసుకొని కాగే నూనెలో వేసి అన్ని వైపులా మెత్తగా ఉడికించుకోవాలి.
6. క్రిస్పీగా అన్ని వైపులా కాగిన తర్వాత వీటిని తీసి సర్వింగ్ ప్లేట్ లో వేసి వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటాయి. ఇంకా ఆనియన్ రింగ్స్ మరియు గ్రీన్ పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే మరింత టేస్టీగా ఉంటుంది.
తయారుచేసే విధానం: మటన్‌ కీమాలో చిటికెడు పసుపు, తగినంత నీరు వేసి కుక్కర్లో మెత్తగా ఉడికించి చల్లారనివ్వాలి. తర్వాత వెడల్పాటి పాత్రలో కీమా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, కారం, శనగపిండి, బియ్యప్పిండి, వంటసోడా, ఉప్పు, కోడిగుడ్డు సొన వేసి బాగా కలపాలి. అరగంట పక్కనుంచి నిమ్మకాయంత ఉండలుగా చుట్టి సన్నమంటపై నూనెలో దోరగా వేగించుకోవాలి. అన్నంలో నంజుకోడానికి చాలా రుచిగా ఉంటాయివి.

English summary

Mutton Kheema Pakora : Weekend Special

Interstitial cystitis (IC) is a chronic bladder problem caused by inflammation or irritation of the bladder wall. In IC, scarring of the bladder causes the bladder to stiffen, decreasing the amount of urine the bladder can comfortably hold. IC is sometimes called bladder pain syndrome, or frequency-urgency-dysuria syndrome.
Story first published: Saturday, September 19, 2015, 14:54 [IST]
Desktop Bottom Promotion