For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మటన్ కోఫ్తా బిర్యానీ

|

సాధారణంగా బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులందరికీ ఇష్టమైన డిష్. బిర్యానీలో కూడా వివిధ రకాలుగా తయారు చేస్తారు. చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, మటన్ బిర్యానీ. రుచిలో వేటికవే అద్భుత రుచి, ఒక్కో వంటకాన్నీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మటన్ బిర్యానీ చేయాలంటే వివిధ రకాల మసాల దినుసులు అవసరం అవుతాయి.

మటన్ కోఫ్తా బిర్యానీ చాలా సింపుల్ గా రుచికరంగా, మంచి ఫ్లేవర్ తో అతి త్వరగా తయారు చేసుకోవచ్చు. ఇండియన్ మసాలా దినుసులతో తాయరు చేసే మటన్ కోఫ్తా బిర్యా టేస్ట్, ఫ్లేవర్ కూడా అద్భుతంగా ఉంటుంది. మరి మీరూ మటన్ కోఫ్తా బిర్యానీ రుచి చూడాలంటే ఎలా తయారు చేయాలో తెలుసుకోండి....

కావల్సిన పదార్థాలు:
రైస్ తయారీకి కావల్సినవి:
బాస్మతి రైస్ - 4 cups
కరవే సీడ్స్ - ½ tsp
గరం మసాలా :
పెప్పర్ కార్న్స్ - 7
లవంగాలు - కొద్దిగా
యాలకలు - 5
షాజీర - 1 tsp
దాల్చిన చెక్క - 1 inch
కుంకుమపువ్వు - చిటికెడు పాలలో నానబెట్టాలి
ఉప్పు : రుచికి సరిపడా

కోఫ్తా తయారీకి కావల్సినవి:
మటన్ ఖీమా - 500 g
ఉల్లిపాయ- 1 (paste)
గరం మసాలా పౌడర్ - 1 tsp
ఉప్పు : రుచికి సరిపడా
గసగసాలు - 1 tsp (finely ground)
అల్లం పేస్ట్ - 1 tbsp
వెల్లుల్లి పేస్ట్ - 1 tbsp
ఫ్రెష్ క్రీమ్ - 1 tbsp
కారం - 1 tsp
కొబ్బరి తురుము - 1 tsp
కొత్తిమీర తరుగు - 1 cup (finely chopped)
శెనగపిండి(besan) - 1 tbsp
నట్ గమ్ పౌడర్ - ½ tsp
బ్రెడ్ - 1 slice (soaked in milk)

Mutton Kofta Biryani

కర్రీ తయారీకి కావల్సినవి:
నూనె - ½ a cup
పచ్చిమిర్చి - 2 (chopped)
ఉల్లిపాయ - 1 (chopped)
టమోటోలు - 2 (pureed)
అల్లం పేస్ట్ - 1 tbsp
వెల్లుల్లి పేస్ట్ - 1 tbsp
జీలకర్ర - ½ tsp
పసుపు - ¼th tsp
పెరుగు - 3 tbsp
గరం మసాలా - ½ tsp
కారం - 2 tsp
ఉప్పు - రుచికి సరిపడా
క్విరా వాటర్ - 1 tbsp
పుదీనా - 1 cup (chopped)
ఎల్లో ఫుడ్ కలర్ - a pinch
నట్ గమ్ పౌడర్ - ¼th tsp
గ్రీన్ కార్డమ్ పౌడర్ - ¼th tsp

తయారుచేయు విధానం

రైస్ తయారీ:

1. ముందుగా బియ్యంను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
2. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో నీరు మరిగించి పెట్టుకోవాలి
3. నీరు మరుగుతుండగా, అందులో గరం మసాలా జోడించాలి.
4. తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యం అందులో వేసి, బియ్యంతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిశ్రమం కలబెట్టి, ఉడికించుకోవాలి.
5. బియ్యం ¾th, ఉడికిన తర్వాత ఎక్సెస్ వాటర్ ను వంపేసి పక్కన పెట్టుకోవాలి.

కోప్తా తయారీ
1. కోప్తా కోసం సిద్దంగా ఉంచుకున్న పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2. అన్ని ఒక్కసారిగా పొడి చేసుకోలేకపోతే, రెండు మూడు పదార్థాలు కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు.
3. కోఫ్తా కోసం సిధ్దం చేసుకున్న పదార్థాలను గ్రైండ్ చేసుకున్న పదార్థాలన్నింటిని బాగా మిక్స్ చేసి రిఫ్రిజరేటర్ లో 30 నుండి 40 నిముషాల వరకూ ఉంచాలి.
4. 40 నిముషాల తర్వాత బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి.
5. చిన్న బౌల్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేయాలి. పాన్ మొత్తం నూనెను చేతులతో అప్లై చేయాలి.
6. ఇప్పుడు ఫ్రిజ్ లో నుండి తీసిన మీట్ మిశ్రమంను చేత్తో చిన్న ఉండలుగా చుట్టుకోవాలి.
7.మీట్ మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకున్నాక తిరిగి రిఫ్రిజరేటర్ లో పెట్టాలి.

కర్రీ తయారీ
1. ఒక పాన్ స్టౌ మీద పెట్టి, వేడి అయ్యాక అందులో జీలకర్ర వేసి ఒక నిముషం వేగించాలి. వేగిన తరవ్ాత అందులో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం మిశ్రమాన్ని వేగించుకోవాలి.
2. ఉల్లిపాయలు ట్రాన్సరెంట్ గా వేగిన తర్వాత అందులో టమోటో పేస్ట్, గ్రీన్ చిల్లీ, పసుపు మరియు ఉప్పు వేసి, మొత్తం మిశ్రమాన్ని కలుపుతూ ఫ్రై చేయాలి .
3. అసవరమయితే కొద్దిగా వాటర్ మిక్స్ చేసి సాప్ట్ గా కలుపుకోవాలి.
4. ఇప్పుడు మంట తగ్గించి, ఇందులో రిఫ్రిజరేటర్ లో పెట్టుకున్న కోఫ్తాలను వేయాలి.
5.అలాగే చిక్కగా చిలికిన పెరుగు కూడా వేసి మిక్స్ చేసి మూత పెట్టాలి.
6. మొత్తం మిశ్రమం ఉడకడం ప్రారంభించాక, 20 నిముషాలు ఉడికించుకోవాలి.
7. ఇప్పుడు అందులోనే నట్ మగ్ పౌడర్, పుదీనా, కొత్తిమీర ఆకులు తరుగు వేసి కలుపుకోవాలి.

బిర్యానీ
1. డీప్ బాటమ్ పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి రాసి, రైస్ ను ఒక లేయర్ గా సర్ధాలి. తర్వాత కోఫ్తా కర్రీని మరో లేయర్ గా సర్దాలి.
2. తిరిగి రైస్ లైయర్, కోఫ్తా లేయర్ రెండు మూడు లేయర్స్ గా సర్ధుకోవాలి.
3. ఫైనల్ గా కెవరా వటర్ ను, పాలలో నానబెట్టిని కుంకుమ పువ్వు, ఎల్లో ఫుడ్ కలర్ ను చిలకరించుకోవాలి.
4. మంట ఎక్కువగా పెట్టి 10 నిముషాలు తక్కువ మంట మీద వేడి చేసుకోవాలి. తర్వాత ఆవిరి మీద 10 నిముషాలు ఉడికించుకోవాలి.
5. అంతే మటన్ కోఫ్తా బిర్యానీ రిసిపి రెడీ. రైతా లేదా గ్రీన్ సలాడ్ తో ఎంజాయ్ చేయొచ్చు.

English summary

Mutton Kofta Biryani

Mutton Kofta Biryani ,A festival is equal to special cuisine. Mutton kofta biryani is one of the mouth-watering delicacies that you can have on the occasion of Bakrid.Instead of ordering from restaurants, why not make mutton kofta biryani at house and surprise your family and friends with this incredible
Story first published: Friday, September 9, 2016, 13:29 [IST]
Desktop Bottom Promotion