For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేరళ స్టైల్ మటన్ కుర్మా: టేస్ట్ సైడ్ డిష్

|

మటన్ కుర్మా ఒక అద్భుతమైన రుచి కలిగిన నాన్ వెజ్ డిష్. దీన్ని కర్రీ, గ్రేవీ, కుర్మా, సైడ్ డిష్ గాను తయారుచేసుకుంటారు . మటన్ రిసిపిలను వివిధ రకాలు తయారుచేయాడనికి వివిధ పద్దతులను అనుసరిస్తుంటారు. ముఖ్యంగా మన ఇండియల్ ఏ రాష్ట్రం వారికైన అత్యంత ఇష్టమైన నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ మటన్ మరియు చికెన్ తో తయారుచేసిన వంటలే.కుర్మా అనే మొఘలాయ్ డిష్ పాకిస్తానీయుల యొక్క ఫేవరెట్ సైడ్ డిష్. ఈ నాన్ వెజిటేరియన్ రిసిపి మొఘలాయుల సాంప్రదాయం నుండి వచ్చి బాగా పాపులర్ అయ్యింది.

ఈ మటన్ కుర్మా రుచి మరియు ఫ్లేవర్ కొన్ని మసాలా దినుసులను పొడి చేసి పెరుగుచేర్చి మటన్ కుర్మాను తయారుచేస్తారు. మటన్ కుర్మా స్పైసీ మరియు చాలా రిచ్ ఫుడ్ కూడా. ఈ మటన్ కుర్మాను పెళ్ళిళ్లు, ఫెస్టివల్స్ వంటి కార్యక్రమాల సందర్భంగా కూడా ఎక్కువగా తయారుచేసుకుంటారు. ఒక చిన్న మార్పుకోసం ఈ స్పైసీ సైడ్ డిష్ ను కేరళ స్టైల్లో తయారుచేయడం జరిగింది. మరి మీరు కూడా ఒక సారి ట్రై చేయండి..

Mutton Korma: Kerala Style Recipe

కావల్సిన పదార్థాలు:

మటన్-½ kg (మధ్య స్థాయి ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 2 (సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం : 1 అంగుళం (తురుము కోవాలి లేదా సన్నగా తరిగినది)
వెల్లుల్లి రెబ్బలు: 5(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కొబ్బరి పాలు: ½cup
దాల్చిన చెక్క: 1
యాలకులు: 3-4
లవంగాలు: 3
సోంపు 1tsp
గసగసాలు: 1tsp
ధనియాల పొడి: 1tbsp
పసుపు: 2tsp
జీడిపప్పు 10-12 (నీటిలో నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి)
బ్లాక్ పెప్పర్ పౌడర్: 1tsp
వెనిగర్: 1tsp
నూనె: 3-4 tbsp
కొత్తిమీర తరుగు: 1tbsp (సన్నగా తరిగినవి)
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో దాల్చిన చెక్క, యాలకులు, సోంపు, మరియు గసగసాలు వేసి అన్నింటిని మిక్స్ చేస్తూ అతి తక్కువ మంట మీద కొన్ని నిముషాలు వేగించుకోవాలి.
2. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు నిముషాలు ఎక్కువ మంట మీద వేగించుకోవాలి.
3. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, వేసి బాగా మిక్స్ చేసి మరో మూడు నిముషాలు వేగించుకోవాలి. తర్వాత పాన్ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి.
4. కొన్ని నిముషాల తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
5. తర్వాత మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి, ఉప్పు చల్లి ప్రెజర్ కుక్కర్ లో వేసి సరిపడా నీళ్ళు పోసి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
6. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో మిక్సీలో వేసి పెట్టుకొన్న మసాలా పేస్ట్ ను అందులో వేసి ఫ్రై చేయాలి.
7. రెండుమూడు నిముషాలు వేగిన తర్వాత అందులో కొబ్బరి పాలు, బ్లాక్ పెప్పర్, సాల్ట్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
8. తర్వాత కుక్కర్ లో ఉడికించుకొన్న మటన్ ముక్కలు మరియు ఉడికిన నీరు కూడా పోయాలి. మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి ఉడికించుకోవాలి.
9. తర్వాత వెనిగర్ మరియు జీడిపప్పు పేస్ట్ వేసి బాగా మిక్స్ చేస్తే చిక్కగా గ్రేవీ తయారవుతుంది. అంతే కేరళ స్టైల్ మటర్ కుర్మా రెడీ . కొత్తిమీర తరుగుతో గార్నిస్ చేసి రోటి మరియు రైస్ తో సర్వ్ చేయవచ్చు.

English summary

Mutton Korma: Kerala Style Recipe

Mutton korma is a delicious gravy that can be served as a side dish. Several cuisines have their own way of preparing mutton recipes. Mutton and chicken are the two most commonly consumed meat items among non-vegetarians. Korma or kurma is a favourite side dish in Pakistan. This non-vegetarian korma recipe originated in Mughal times and became popular gradually.
Story first published: Saturday, June 7, 2014, 16:26 [IST]
Desktop Bottom Promotion