For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ మటన్ -గ్రీన్ లీఫ్ గ్రేవీ రిసిపి

|

మటన్ మేతి గ్రేవీ రిసిపి. గ్రీన్ లీఫ్స్ ఉపయోగించి తయారుచేసే, ఈ మటన్ రిసిపి చాలా టేస్టీగా ఉంటుంది. గ్రీన్ లీఫ్ హెల్తీ కూడా. గ్రీన్ లీఫ్ జోడించడం వల్ల గ్రేవీ చిక్కగా మరియు గ్రీన్ కలర్ లో నోరూరిస్తూ క్రీమ్ కలర్లో ఉంటుంది.

మరి ఈ గ్రీన్ మటన్ గ్రేవీ రిసిపిని తయారుచేయడం చాలా సులభం మరియు చాలా తక్కువ మసాలా దినుసులతో చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ హెల్తీ గ్రీన్ మటన్ గ్రేవీ రిసిపిని టేస్ట్ చేయాలంటే ఒక సారి ట్రై చేయండి.

Mutton-Methi Gravy Recipe

కావల్సిన పదార్థాలు:
మటన్: 500 గ్రాముల (మధ్య స్థాయి ముక్కలుగా కట్)
ఆకుకూర: 500 గ్రాముల
ఉల్లిపాయలు 2 (చిన్న ముక్కలుగా తరిగి)
వెల్లుల్లి: 5
టొమాటోస్: 1 (తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 3
యోగర్ట్: 2tbsp
ఫ్రెష్ క్రీమ్: 1tbsp
ఎండిన మెంతిఆకులు: 1tbsp
ఇంగువ: ఒక చిటికెడు
కారం: 1tsp
గరం మసాలా: 1tsp
బే ఆకు: 1
ఆయిల్: 2tbsp
నెయ్యి: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో ఇంగువ, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి.
2. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. తర్వాత అందులో వెల్లుల్లి మరియు మటన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీడియం మంట మీద మటన్ 5నిముషాలు ఉడకనివ్వాలి.
3. అంతలోపు, ఆకు కూరను శుభ్రంగా కడిగి కొద్దిగా నీళ్ళు పోసి రెండు, మూడు నిముషాలు ఉడికించి పెట్టుకోవాలి. ఓవర్ గా ఉడికించకండి, మీడియంగా ఉండికించుకోవాలి.
4. తర్వాత ఈ కూరాకులోని నీరు వంపేసి, మిక్సీ జార్ లో వేసి, పచ్చిమిర్చి జతచేసి రెండింటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ లో టమోటోలను వేసి కొద్దిగా ఉప్పు చిలకరించి 5నిముషాలు మొత్తగా వేగించుకోవాలి.
5. టమోటో మెత్తగా ఉడుతున్నప్పుడు, అందులో కారం, మరియు ఎండిన మెంతి ఆకులు వేసి మరో రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులో రెండు కప్పులు నీరు పోసి మూత పెట్టి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
7. తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని, కుక్కర్ లో ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత గరం మసాలా, నెయ్యి, మరియు తాజా క్రీమ్ ను వేసి మిక్స్ చేయాలి . అంతే మటన్ మేతి రిసిపి రెడీ .

English summary

Mutton-Methi Gravy Recipe

A dark green curry with pieces of meat sounds like Mutton Methi Recipe. This mutton curry recipe is essentially prepared with spinach which is a kind of saag (green leafy vegetable).
Desktop Bottom Promotion