For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మౌత్ వాటరింగ్ మటన్ సీక్ కబాబ్ రిసిపి: రంజాన్ స్పెషల్

|

రంజాన్ అంటేనే వివిధ రకాల నాన్ వెజ్ రుచులను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయడమే. ఎందుకంటే ఫాస్టింగ్ ఎంత ముఖ్యమో ఫీస్టింగ్ కూడా అంతే ముఖ్యం. ఈ రంజాన్ సీజన్ లో వివిధ రకాల రుచులను చూడటానికి చాలా కోరిక కలిగి ఉంటారు. రోజంతా ఉపవాసం ఉండటం ఎంత కష్టమో, సాయంత్రం ఉపవాసం తీర్చుకోవడానికి రుచికరమైన వంటలను తినడానికి అంతే ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు.

రంజాన్ సీజన్ లో తయారుచేసే మాంసాహారాల్లో ఒకటి కబాబ్ రిసిపిలు. కబాబ్ రిసిపిలను వివిధ రకాలుగా తయారుచేస్తారు . ఈ కబాబ్ రిసిపిలను టేస్ట్ చూడటానికి చాలా ఎక్సైటింగ్ ఉంటారు. రంజాన్ సీజన్ మొత్తం ప్రతిఒక్కరి ముస్లీం ఇంట్లోనో కబాబ్ రిసిపిలు తప్పకుండా చేస్తారు. అంటువంటి వంటలో సీక్ కబాబ్ ఒకటి. చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు.

ఇంట్లో ఉండే చాలా సింపుల్ పదార్థాలను ఉపయోగించి, ఈ సీక్ కబాబ్ ను తయారుచేసుకోవచ్చు. ఈ మౌత్ వాటరింగ్ సీక్ కబాబ్ ను ఎలా తయారుచేయాలోతెలుసుకుందాం...

Mutton Seekh Kababs For Ramzan

మటన్ సీక్ కబాబ్ : రంజాన్ స్పెషల్
మటన్ ఖీమా - 500 g
గరం మసాలా - ¾ teaspoon
ఉల్లిపాయ - 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
అల్లం పేస్ట్ - 2 teaspoons
వెల్లుల్లిపేస్ట్ - 2 teaspoons
పచ్చిబొప్పాయి పేస్ట్ - 1 tablespoon
నిమ్మరసం - 1 teaspoon
ఉల్లిపాయ పేస్ట్ - 1 tablespoon
జీడిపప్పు పేస్ట్ - 2 tablespoons
కార్న్ ఫ్లోర్ - 1 tablespoon
కారం - 1 teaspoon
క్రీమ్ - 2 teaspoons
పెప్పర్ పౌడర్ - చిటికెడు
బ్లాక్ పెప్పర్ పౌడర్ - చిటికెడు
జీలకర్ర - 1 tablespoon
ధనియాలపొడి - 1 teaspoon
యాలకలు - 2 teaspoons
పసుపు - ½ teaspoon
డ్రై మ్యాంగో పౌడర్(Aamchur) - 1 teaspoon
డ్రైజింజర్ పౌడర్ - ¼th teaspoon
ఉప్పు - 2 tablespoons
గసగసాలు - 1 tablespoon (optional)
నట్ మగ్ పౌడర్ - ½ teaspoon
గుడ్డు పచ్చసొన - 1
ఛాట్ మసాలా - కొద్దిగా చిలకరించాలి
నూనె లేదా నెయ్యి: కొద్దిగా

తయారుచేయు విధానం:
1. ముందుగా మటన్ ఖీమాను శుభ్రంగా కడిగి, నీరు పూర్తిగా వంపేసి, పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పదార్థాలన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి.
3. అందులోనే కీమా కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలిపి పెట్టుకోవాలి. ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి .
4. ఒక గంట తర్వాత మైక్రోవేవ్ ను 350డిగ్రీల ఫారెన్ హీట్ లో పెట్టాలి.
5. అంతలోపు ఉడెన్ స్కీవర్స్ ను వాటర్ తో శుభ్రంగా కడిగి, నీటితో తుడిచి పెట్టుకోవాలి.
6. తర్వాత ఉడెన్ స్కీవర్స్ కు నెయ్యి లేదా ఆయిల్ ను అప్లై చేయాలి .
7. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న ఖీమా మిశ్రమాన్ని మరో సారి మిక్స్ చేసి , కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొన, స్వీవర్స్ కు చుట్టి బాగా ప్రెస్ చేయాలి.
8. స్కీవర్ కు మటన్ పూర్తిగా స్టిక్ అవుతుంది . ఇలా అన్ని తయారుచేసుకోవాలి.
9. ఇప్పుడు మైక్రోవోవెన్ గ్రిల్ మోడ్ లో స్కీవర్స్ ను ఫిక్స్ చేసి 350డిగ్రీల ఫారెన్ హీట్ లో ఉడికించుకోవాలి. స్టౌ మీద కాల్చుకొనేటట్లైతే, స్కీవర్స్ ను అన్ని వైపులా తిప్పుతూ ఉడికించుకోవాలి. మద్యమద్యలో కొద్దిగా నెయ్యి లేదా నూనెను చల్లుతూ కాల్చుకోవాలి.
10. సీక్ కబాబ్స్ పూర్తిగా ఉడికిన తర్వాత ఓవెన్ నుండి మటన్ సీకర్స్ ను తీసి, పేపర్ నాప్కిన్స్ మీద ఉంచాలి.
11. స్టౌ మీద తవా పెట్టి, కొద్దిగానూనె వేసి వేడయ్యాక అందులో సీకర్స్ పెట్టి, కొన్ని నిముషాలు రొటేట్ చేస్తూ వేడి చేసుకోవాలి. అన్నివైపులా పూర్గిగా కాలిన తర్వాత తవా నుండి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి.
12. సర్వ్ చేయడానికి సీక్ కబాబ్స్ రెడీ . చాట్ మసాలా మరియు కొద్దిగా నిమ్మరసం చిలకరించి సర్వ్ చేయాలి.

English summary

Mutton Seekh Kababs For Ramzan

Are you planning an exotic Iftar party on weekend? How can that be complete without kababs? Seekh kababs, galouti kababs, reshmi kababs are few of the wide varieties of kababs that are a must try. And all these taste heavenly. Mutton seekh kababs for Ramzan is a very special dish, which can make your Iftar happening.
Story first published:Tuesday, June 14, 2016, 15:44 [IST]
Desktop Bottom Promotion