For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మటన్ షోర్బా హెల్తీ రంజాన్ డిష్

|

షోర్బా ఇది అరబ్ రిసిపి. ఇది ఒక రకమైనటువంటి మటన్ సూప్. ఇది గల్ఫ్ లో చాలా పాపులర్ అయినటువంటి వంటకం. ఈ అరబ్ వంటకాన్ని మన స్టైల్ లో తయారు చేయబడింది. రంజాన్ మాసంలో ముస్లీంలు దీన్ని తీసుకోవడం హెల్తీగా భావిస్తారు. షోర్భా ప్రథమికంగా మటన్ సూప్. దీన్ని లెబాన్సే బ్రెడ్(కాబూస్)తో తీసుకుంటారు. మనం కూడా ఈ షోర్బాను ఇండియన్ బ్రెడ్ గా పిలుచుకొనే రోటీతో తినవచ్చు.

షోర్భా ఫర్ ఫెక్ట్ రంజాన్ రిసిపి. ఎందుకంటే ఇది లైట్ మటన్ సూప్ కాబట్టి. మీ ఉపవాసదీక్షను విరమించడానికి ఈ మటన్ షోర్బాన్ తీసుకోవడం వల్ల ఎటువంటి అజీర్ణ సమస్యలు లేదా ఎసిడిటి సమస్యలు ఉండవు. కాబట్టి ఈ రంజాన్ స్పెషల్ డిష్ ను ఎలా తయారు చేయాలో చూద్దామా...

Mutton Shorba

కావల్సిన పదార్థాలు:

మటన్: 500 గ్రాముల (మధ్యతరహా ముక్కలుగా కట్)
లవంగాలు: 5
దాల్చిన చెక్క: చిన్న ముక్క
బిర్యానీ ఆకు: ఒకటి
ఉల్లిపాయ : 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
టమోటా గుజ్జు: 1/2cup
పెప్పర్ పౌడర్: 1tbsp
జీలకర్ర పొడి: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 1tsp
బాదం పేస్ట్ : 1 / 2 కప్
నూనె: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: 1/2cup(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
నిమ్మకాయ: 2స్లైస్

తయారు చేయు విధానం:
1. ముందుగా డీప్ బాటమ్ పాన్ వేడి చేసి, అందులో లవంగాలు, చెక్క, మరియు బిర్యానీ ఆకు వేసి, 30సెకండ్స్ ఫ్రై చేయాలి.
2. తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించాలి. ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మరయు మటన్ వేయాసి, 5నిముషాలు మీడియం మంట మీద ఉడికించాలి. మటన్ నుండి నీరు ఇగిరిపోయి నూనె పైకి తేలే సమయంలో అందులో టమోటో గుజ్జును వేయాలి.
3. తర్వాత ఉప్పు, పెప్పర్, పసుపు, కారం, ధనియాల పొడి వీటన్నింటిని వేసి, మరో 2-3నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులో 3కప్పుల నీళ్ళు పోసి, మూత పెట్టి 10-15నిముషాలు ఉడికించుకోవాలి.
5. మటన్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత అందులో నిమ్మరసం పిండి, కొత్తిమీర తరుగును గార్నిష్ చేసి, అరబిక్ బ్రెడ్, ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేయాలి.

English summary

Mutton Shorba For A Healthy Ramzan

Shorba is basically an Arab recipe. It is a type of mutton soup that is popular in the gulf. However, we have borrowed the shorba recipe from the Arabs and made it our own. It makes a very healthy recipe for Ramzan.
Story first published: Friday, July 12, 2013, 17:20 [IST]
Desktop Bottom Promotion